HDFC Bank: ఆదిత్య పురికి అత్యధిక వేతనం..!

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మాజీ సీఈవో ఆదిత్య పురి టాప్‌ ప్రైవేటు బ్యాంకుల్లో అత్యధిక వేతనం పొందిన వ్యక్తిగా నిలిచారు. కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 2020లో ఆయన

Published : 25 Jul 2021 20:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మాజీ సీఈవో ఆదిత్య పురి టాప్‌ ప్రైవేటు బ్యాంకుల్లో అత్యధిక వేతనం పొందిన వ్యక్తిగా నిలిచారు. కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న 2020లో ఆయన రూ.13.82 కోట్లను అందుకొన్నారు. అక్టోబర్‌లో పురి పదవీ విరమణ చేశాక ఆయన స్థానంలో వచ్చిన శశిధర్‌ జగదీశన్‌ స్థూల వేతనం రూ. 4.77 కోట్లు వార్షిక వేతనం అందుకొన్నారు. దీనిలో ఆయన గతంలో నిర్వహించిన పదవికి సంబంధించిన వేతనం కూడా ఉంది. ఇక పురి పదవీ విరమణ తర్వాత రూ.3.5 కోట్ల లబ్ధిపొందారు. 

ఇక కొవిడ్‌ వ్యాప్తి ఎక్కువగా ఉండటంతో ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో సందీప్‌ భక్షి తనకు వచ్చే ఫిక్స్‌డ్‌ కాంపన్సేషన్‌, ఇతర అలవెన్సులను స్వచ్ఛందంగా వదులుకొన్నారు. ఆయన రూ.38.38 లక్షల పెర్క్‌లు, రూ.63.60 లక్షల బోనస్‌ను స్వీకరించారు. ఇది ఆయనకు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ తరపున వచ్చింది. 

యాక్సెస్‌ బ్యాంక్‌కు చెందిన అమిత్‌ చౌధరీకి రూ.6.52 కోట్ల మొత్తాన్ని అందుకొన్నారు. ఈ విషయాన్ని బ్యాంక్‌ వార్షిక నివేదికలో పేర్కొంది. 2021 ఫైనాన్షియల్‌ ఇయార్‌లో కంపెనీలోని ఉన్నత శ్రేణి మేనేజ్‌మెంట్‌కు ఎటువంటి వేతన పెంపు ఇవ్వలేదని కంపెనీ పేర్కొంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని