HDFC Home Loan: గృహరుణాలపై హెచ్‌డీఎఫ్‌సీ పండగ ఆఫర్‌!

కొత్తగా గృహ రుణాలు తీసుకోబోయే వినియోగదార్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పండగ ఆఫర్లను ప్రకటించింది. రుణమొత్తంతో సంబంధం లేకుండా.. గృహ రుణాన్ని 6.7 శాతం ప్రారంభ వడ్డీతో అందించనుంది....

Published : 21 Sep 2021 14:21 IST

ముంబయి: కొత్తగా గృహ రుణాలు తీసుకోబోయే వినియోగదార్లకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ పండగ ఆఫర్లను ప్రకటించింది. రుణమొత్తంతో సంబంధం లేకుండా.. గృహ రుణాన్ని 6.70 శాతం ప్రారంభ వడ్డీతో అందించనుంది. అయితే, క్రెడిట్‌ స్కోర్‌ 800కి పైగా ఉండాలని షరతు విధించింది. అంతక్రితం ఉద్యోగులు రూ.75 లక్షలపైన గృహ రుణాలకు 7.15 శాతం వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి 7.30 శాతం వడ్డీ వర్తించేంది. తాజా ఆఫర్‌ కింద ఏ మొత్తానికైనా తక్కువలో తక్కువ 6.7 శాతం వడ్డీ వర్తిస్తుందని బ్యాంకు తెలిపింది. ఇటీవల ఎస్‌బీఐ, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సైతం పండగ సీజన్‌ నేపథ్యంలో వడ్డీరేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఎస్‌బీఐ ప్రాసెసింగ్‌ ఫీజును సైతం రద్దు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని