హోండా నుంచి ₹6.80 లక్షల బైక్‌

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) కొత్త అడ్వెంచర్‌ ప్రీమియం బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. సీబీ500x పేరిట.....

Published : 15 Mar 2021 19:05 IST

దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) కొత్త అడ్వెంచర్‌ ప్రీమియం బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. సీబీ500x పేరిట విడుదల చేసిన ఈ బైక్‌ ధరను రూ.6.87 లక్షలు (ఎక్స్‌ షోరూం, గురుగ్రాం)గా నిర్ణయించింది. బుకింగ్స్‌ ప్రారంభించినట్లు తెలిపింది. కంపెనీకి చెందిన బిగ్‌వింగ్‌ డీలర్‌షిప్స్‌ ద్వారా దేశవ్యాప్తంగా వీటిని విక్రయించనున్నారు. ప్రయాణికులకు మరిచిపోలేని అనుభూతిని అందించేందుకు ఈ ప్రీమియం బైక్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ ఎండీ, ప్రెసిడెంట్‌, సీఈవో అత్సుషి ఒగాటా ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ బైక్‌లో 8 వాల్వ్‌ ట్విన్ సిలిండర్‌ 471 సీసీ లిక్విడ్‌ కూల్‌ ఇంజిన్‌ అమర్చారు. మొత్తం ఆరు గేర్లు ఉన్నాయి. ఈ ఇంజిన్‌ 8,500 ఆర్‌పీఎం వద్ద 47 బీహెచ్‌పీని ఉత్పత్తి చేస్తుంది. ముందూ వెనుక ఏబీఎస్‌తో కూడిన డిస్క్‌ బ్రేక్‌ సదుపాయం ఇస్తున్నారు. ఇవే కాకుండా ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఫీచర్‌ ఉంది. ఇది సడెన్ బ్రేక్ వేసినప్పుడు వెంటనే గుర్తించి ఆటోమేటిక్‌గా ముందూ వెనుక లైట్లను ఆన్‌ చేస్తుంది. ఈ బైక్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌ రెడ్‌, మ్యాటీ గన్‌ పౌడర్‌ బ్లాక్‌ మెటాలిక్‌ రంగుల్లో లభించనుంది.

ఇవీ చదవండి..
ఆ బైకులను రీకాల్‌ చేయనున్న హోండా
ఏబీఎస్‌ టెక్నాలజీతో కొత్త ప్లాటినా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని