Automobile: స్పోర్టీ లుక్‌తో మార్కెట్లోకి హోండా గ్రాజియా 125

హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్ఐ) మరో కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గ్రాజియా 125 ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చింది.

Published : 15 Nov 2021 20:36 IST

దిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్ఐ) మరో కొత్త స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గ్రాజియా 125 ప్రత్యేక ఎడిషన్‌ను తీసుకొచ్చింది. దీని ధరను రూ.87,138 (ఎక్స్‌ షోరూమ్‌, గురుగ్రామ్‌)గా నిర్ణయించింది. రెప్సోల్‌ హోండా రేసింగ్‌ టీమ్‌ను స్ఫూర్తిగా తీసుకుని కొత్త ఎడిషన్‌ను తీర్చిదిద్దారు. దేశంలోని రేసింగ్‌ ఔత్సాహికుల కోసం ఈ కొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చినట్లు హెచ్‌ఎంఎస్‌ఐ ఎండీ, ప్రెసిడెంట్‌, సీఈవో అత్సుషి ఒగాటా ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

125సీసీ ఇంజిన్‌తో వస్తున్న ఈ స్కూటర్‌ ప్రోగ్రామ్డ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ ఇంజిన్‌తో వస్తోంది. ఎల్‌ఈడీ డీసీ హెడ్‌ల్యాంప్‌, ఇంటిగ్రేటెడ్‌ పాసింగ్‌ స్విచ్‌,  సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌ సదుపాయం ఉంది. ఒకవేళ స్టాండ్‌ తీయకపోతే ఇంజిన్‌ స్టార్ట్‌ అవ్వని విధంగా సాంకేతికను వినియోగించారు. ముందువైపు టెలిస్కోపిక్‌ ఫోర్క్‌తో పాటు, వెనుకవైపు ట్రిపుల్‌ స్టెప్‌ అడ్జెస్టబుల్‌ సస్పెన్షన్‌ను అందిస్తున్నారు. ముందువైపు డిస్క్‌బ్రేక్‌, వెనుకవైపు డ్రమ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ ఇస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని