ఆ బైకులను రీకాల్ చేయనున్న హోండా
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఇటీవల విడుదల చేసిన 350 సీసీ సామర్థ్యం కలిగిన హెచ్నెస్ సీబీ 35........
దిల్లీ: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) ఇటీవల విడుదల చేసిన 350 సీసీ సామర్థ్యం కలిగిన హెచ్నెస్ సీబీ 350 మోడల్ బైకులను వెనక్కి రప్పించనుంది. ట్రాన్స్మిషన్ పార్ట్‌ను సరిచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోండా తెలిపింది. గతేడాది నవంబరు 25 నుంచి డిసెంబర్ 12 మధ్య ఉత్పత్తి చేసిన బైకులను రీకాల్ చేయనున్నట్లు పేర్కొంది. ఆయా బైకుల్లో ట్రాన్స్మిషన్కు సంబంధించి నాలుగో గేర్ కౌంటర్ షాఫ్ట్‌లో వినియోగించిన విభిన్నంగా ఉందని గుర్తించామని ఓ ప్రకటనలో తెలిపింది. భవిష్యత్‌లో వాహనదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
ఇప్పటి వరకు లోపానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులూ రాలేదని హోండా తెలిపింది. మార్చి 23 నుంచి రీకాల్ కార్యక్రమం ప్రారంభం కానుందని పేర్కొంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇందుకోసం ఎలాంటి రుసుమూ చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టంచేసింది. ఈ విషయాన్ని కాల్/ ఈ-మెయిల్/ఎస్సెమ్మెస్ ద్వారా వినియోగదారులకు తెలియజేస్తామంది. అయితే, ఎన్ని వాహనాలను వెనక్కి రప్పించేదీ హోండా వెల్లడించలేదు. గతేడాది అక్టోబర్ విడుదల చేసిన ఈ మోడల్ ప్రారంభ ధర ₹1.85 లక్షలు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు
-
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
-
సీఎం రేవంత్‌రెడ్డితో ఎంపీ కె.కేశవరావు భేటీ
-
ఉత్తర్‌ప్రదేశ్‌లో హైఅలర్ట్.. గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ మృతిపై కుటుంబం అనుమానాలు!
-
కాంగ్రెస్‌కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?