కళ్లు చెదిరే లాభాల్లో హెచ్‌యూఎల్‌..!

2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం లాభాలను హిందూస్థాన్‌ యూనిలీవర్‌ సంస్థ ప్రకటించింది.

Published : 29 Apr 2021 15:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం లాభాలను హిందూస్థాన్‌ యూనిలీవర్‌ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది ఏకీకృత నికరలాభం రూ.2,143కోట్లుగా వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 41.07వృద్ధి చెందింది. కంపెనీ గతేడాది ఇదే సీజన్‌లో రూ.1,519 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇక గత త్రైమాసంలో సంస్థ రూ.1,921 కోట్ల లాభాన్ని సంపాదించింది. 
ఈ త్రైమాసకంలో హెచ్‌యూఎల్‌ ఆదాయంలో కూడా 34శాతం వృద్ధి కనిపించింది. గతేడాది ఇదే త్రైమాసకంలో రూ.9,011 కోట్ల ఆదాయం రాగా.. ఈ సారి అది వృద్ధి చెంది రూ.12,132 కోట్లుగా నిలిచింది.  ఇక గత త్రైమాసికంతో పోల్చుకొంటే 2.27శాతం పెరిగింది. వాస్తవానికి ఈ సారి ఫలితాలు విశ్లేషకుల అంచనాలను మించాయి. దాదాపు అందరు విశ్లేషకులు గతేడాదితో పోలిస్తే 11శాతం నుంచి 32శాతం మధ్య లాభాల్లో వృద్ధి కనిపిస్తుందని వెల్లడించారు. కానీ, వాటిని మించి 41శాతం గా నమోదు చేసింది. ఇదే విధంగా ఆదాయం విషయంలో కూడా రాణించింది. 

‘‘ఈ సారి టర్నోవర్‌లో 34శాతం, పన్ను చెల్లించిన అనంతరం లాభాల్లో 41శాతం వృద్ధి సాధించాము. దేశీయ వినియోగదారుల్లో 41శాతం వృద్ధి కనిపించింది. ఆరోగ్యం, పరిశుభ్రత,న్యూట్రిషన్‌ విభాగాల్లో 80 వ్యాపారం పెరిగింది. ఆయా రంగాల్లో రెండంకెల వృద్ధి లభించింది’’ అని హిందూస్థాన్‌ యూనిలీవర్‌ సంస్థ పేర్కొంది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని