ఆరోగ్య బీమా...పన్ను మినహాయింపులు

ఆరోగ్య బీమా తీసుకుంటే ల‌భించే ప‌న్ను మిన‌హాయింపుల గురించి వివ‌రంగా తెలుసుకుందాం.

Published : 19 Dec 2020 17:25 IST

ఆదాయ‌పు ప‌న్ను ప‌రిధిలోకి వ‌చ్చేవారు … ఆరోగ్య బీమా పాల‌సీ క‌లిగి ఉన్న‌ట్ల‌యితే పన్ను మిన‌హాయింపు పొందేందుకు అవ‌కాశం ఉంది. ఏయే సంద‌ర్భాల్లో ఎంతెంత ప‌న్ను మిన‌హాయింపు ఉందో తెలుసుకుందాం.

సెక్ష‌న్ 80డీ

  • ఆరోగ్య బీమా పాలసీలకు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80 (డీ) కింద రూ.15వేలు నుంచి రూ.40వేల దాకా పన్ను మినహాయింపు లభించే అవకాశం ఉంది.

  • ఈ మినహాయింపు వ్యక్తిగత, అవిభాజ్య హిందూ కుటుంబానికి లభిస్తుంది.

  • ఈ మినహాయింపు నగదు రూపంలో జరపని చెల్లింపులకు మాత్రమే వర్తిస్తుంది. అంటే చెక్కు, డీడీ లేదా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు జరిపినట్టయితే మినహాయింపు ఉంటుంది.

  • వ్యక్తిగత పాలసీలు, జీవిత భాగస్వామి, సంతానంతో కలిపి తీసుకున్న పాలసీలకు చెల్లించే ప్రీమియంలకు గరిష్ఠంగా రూ.15వేల పన్ను మినహాయింపు ఉంటుంది.

త‌ల్లిదండ్రుల‌తో క‌లిపి తీసుకుంటే…

  • 60ఏళ్లు పైబడిన తల్లిదండ్రుల కోసం ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలుచేసి ప్రీమియం చెల్లిస్తే విడిగా రూ.20వేల వరకు పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది.
    ఉదాహరణకు ఒక వ్యక్తి తన కోసం, జీవితభాగస్వామికి, పిల్లల కోసం తీసుకున్న ఆరోగ్య బీమాకు ఏడాదికి రూ.23వేలు, 60 ఏళ్ల వయసు పైబడిన తల్లిదండ్రులకు విడిగా వేరే ఆరోగ్య పాలసీ కొనుగోలు చేసినందుకు రూ.25వేలు ప్రీమియం కింద చెల్లించినట్టయితే, సదరు వ్యక్తి మొదటి పాలసీకిగాను రూ.15వేలు, తల్లిదండ్రుల కోసం తీసుకున్న పాలసీకి ఇద్దరికీ కలిపి రూ.35 వేలు పన్ను మినహాయింపు పొందొచ్చు.

60ఏళ్లు పైబ‌డిన వ్య‌క్తుల‌కు

  • పన్ను చెల్లించే వ్యక్తి 60ఏళ్ల పైబడినవారైతే తనకు, తల్లిదండ్రులకు తీసుకున్న పాలసీలకు విడివిడిగా రూ.20వేలు + రూ.20వేలు మొత్తం రూ.40వేలు పన్ను మినహాయింపు పొందవచ్చు.

  • పన్ను చెల్లించే వ్యక్తి తనకు, తన కుటుంబసభ్యులకు, తల్లిదండ్రులకు ఆరోగ్య పరీక్షలకై చేసిన ఖర్చులకు రూ.5వేలు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ మినహాయింపు రూ.15వేలు/రూ.20వేలు గరిష్ఠ పరిమితికి లోబడి ఉంటుంది.

యూనిట్ ఆధారిత ప‌థ‌కాల్లో…

  • యూనిట్‌ ఆధారిత ఆరోగ్య బీమా పాలసీలో పెట్టిన పెట్టుబడులకు సెక్షన్‌ 80 సీ పరిమితులకు లోబడి గరిష్ఠంగా రూ.1.50లక్షల వరకు పన్ను మినహాయింపు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని