హెల్త్‌, ఎడ్యుకేష‌న్ సెస్ ఎందుకు ?

సెస్ అనేది ఒక నిర్దిష్ట సేవ లేదా రంగం అభివృద్ధి లేదా సంక్షేమం కోసం ప్రభుత్వం వసూలు చేసే పన్ను. ఇది ప్రత్యక్ష , పరోక్ష పన్నులపై వసూలు చేస్తారు . భారతదేశంలోని..

Published : 23 Dec 2020 16:25 IST

సెస్ అనేది ఒక నిర్దిష్ట సేవ లేదా రంగం అభివృద్ధి లేదా సంక్షేమం కోసం ప్రభుత్వం వసూలు చేసే పన్ను. ఇది ప్రత్యక్ష , పరోక్ష పన్నులపై వసూలు చేస్తారు . భారతదేశంలోని గ్రామీణ కుటుంబాల విద్య, ఆరోగ్య అవసరాలను తీర్చాలనే లక్ష్యంతో ఈ సెస్ వ‌సూలుచేస్తారు. ప్రస్తుతం, వ్యక్తుల ప్రత్యక్ష ఆదాయ పన్నుపై ప్రభుత్వం 4% ఆరోగ్య, విద్య సెస్ వసూలు చేస్తుంది. ఈ సెస్‌ను కేంద్ర బడ్జెట్ 2018 లో అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు, అంతకుముందు మాధ్యమిక, ఉన్నత విద్య సెస్‌ను 3% గా ఉండేది. ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం సేకరించిన సెస్‌ను ఇతర అవ‌స‌రాల కోసం ఉపయోగించలేరు లేదా మళ్లించలేరు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రయోజనం కోసం తగినంత నిధులను సేకరించే సమయం వరకు ఈ నిర్దిష్ట సెస్ విధిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని