టీకా రిజిస్ట్రేషన్‌కు సాయం: స్పైస్‌ మనీ

గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక సేవలు అందించే ఫిన్‌టెక్‌ సంస్థ స్పైస్‌ మనీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌లో గ్రామీణులకు తోడ్పాటు అందించనుంది. దేశంలో దాదాపు 18,000 పిన్‌కోడ్‌లలో ఉన్న తమ నెట్‌వర్క్‌ ద్వారా

Published : 06 May 2021 01:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆర్థిక సేవలు అందించే ఫిన్‌టెక్‌ సంస్థ స్పైస్‌ మనీ కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌లో గ్రామీణులకు తోడ్పాటు అందించనుంది. దేశంలో దాదాపు 18,000 పిన్‌కోడ్‌లలో ఉన్న తమ నెట్‌వర్క్‌ ద్వారా ఈ ప్రక్రియ చేపడుతున్నట్లు సంస్థ తెలిపింది. దీంతోపాటు వ్యాక్సిన్‌ అవసరం, దానిపై ఉన్న అపోహలను తొలగించేందుకు తమ అధికారులు కృషి చేస్తారని పేర్కొంది. దేశంలో దాదాపు 95 శాతం గ్రామీణ ప్రాంతాల్లో 4లక్షల మంది తమ అధికారులు ఉన్నారని స్పైస్‌ మనీ సీఈఓ సంజీవ్‌ కుమార్‌ తెలిపారు. స్పైస్‌ మనీ యాప్‌, వెబ్‌సైట్‌ ద్వారా వ్యాక్సిన్‌ కోసం నమోదు చేసుకునే వీలుందని పేర్కొన్నారు.

సకాలంలో తీసుకున్న నిర్ణయం
అపోలో హాస్పిటల్స్‌ సంయుక్త ఎండీ సంగీతా రెడ్డి

దిల్లీ: కొవిడ్‌-19 ముప్పు నేపథ్యంలో వైద్య సదుపాయాలు విస్తరించేందుకు వీలుగా బ్యాంకులు రూ.50,000 కోట్ల మేరకు రుణాలు జారీ చేయాలని భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఆదేశించడాన్ని అపోలో హాస్పిటల్స్‌ సంయుక్త ఎండీ సంగీతారెడ్డి స్వాగతించారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఇది ఎంతో సానుకూల నిర్ణయమని ఆమె పేర్కొన్నారు. మార్చి 31, 2022 వరకు ఈ సదుపాయాన్ని కల్పించాలని, మూడేళ్ల కాలపరిమితి గల రుణాలను బ్యాంకులు జారీ చేయాలని ఆర్‌బీఐ గవర్నర్‌ సూచించడం గమనార్హం. టీకాల తయారీ సంస్థలు, ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, పాథాలజీ ల్యాబ్స్‌, ఆక్సిజన్‌ సరఫరా చేసే సంస్థలు, వెంటిలేటర్ల తయారీ- సరఫరా సంస్థలు, వైద్య వసతులు అందించడంలో నిమగ్నమై ఉన్న లాజిస్టిక్స్‌ సేవల సంస్థలు, టీకాలు- మందులు దిగుమతి చేసుకునే సంస్థలు ఈ రుణాలు తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని