Hero Lectro: హీరో లెక్ట్రో నుంచి రూ.41,000 సైకిల్‌.. ఫీచర్లివే!

హీరో సైకిల్స్‌కు చెందిన విద్యుత్‌ సైకిళ్ల బ్రాండ్‌ ‘హీరో లెక్ట్రో’ మరో రెండు కొత్త సైకిళ్లను విడుదల చేసింది....

Updated : 27 Dec 2021 16:58 IST

ముంబయి: హీరో సైకిల్స్‌కు చెందిన విద్యుత్‌ సైకిళ్ల బ్రాండ్‌ ‘హీరో లెక్ట్రో’ మరో రెండు కొత్త సైకిళ్లను విడుదల చేసింది. ఎఫ్‌2ఐ పేరిట వస్తున్న సైకిల్‌ ధర 39,999 కాగా.. ఎఫ్‌3ఐ ధర రూ.40,999. సంస్థ ఆర్‌అండ్‌డీ కేంద్రంలో డిజైన్‌ చేసిన ఈ ఈ-సైకిళ్లు ఒకసారి ఛార్జ్‌ చేస్తే 35 కి.మీ వరకు ప్రయాణించగలవు. వీటిని ఈ-మౌంటెయిన్‌ బైక్స్‌గా సంస్థ పేర్కొంది. 7-స్పీడ్‌ గేర్స్‌, 100 ఎంఎం సస్పెన్షన్, డ్యుయల్‌ డిస్క్‌ బ్రేక్‌లు, బ్లూటూత్‌ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. 6.4ఏహెచ్‌ కెపాసిటీ బ్యాటరీని అమర్చారు. పెడిలిక్‌, థ్రాటిల్‌, క్రూయిజ్ కంట్రోల్‌, మ్యానువల్‌ అనే నాలుగు మోడ్స్‌ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఉన్న 600 హీరో లెక్ట్రో డీలర్ల వద్ద వీటిని పొందవచ్చు. అలాగే ఆన్‌లైన్‌లోనూ బుక్‌ చేసుకునే సదుపాయం ఉంది.


ఎలెక్టా@రూ.1.99 లక్షలు

విద్యుత్తు వాహన తయారీ సంస్థ వన్‌-మోటో.. ఎలెక్టా పేరిట కొత్త స్కూటర్‌ను విడదల చేసింది. దీని ధర రూ.1.99 లక్షలు(ఎక్స్‌షోరూం). కంపెనీ నుంచి వస్తున్న మూడో స్కూటర్‌ ఇది. గతంలో కమ్యూటా, బైకా పేరిట రెండు హైస్పీడ్‌ స్కూటర్లను మార్కెట్లోకి తెచ్చింది. 72వీ, 45ఏహెచ్‌, డిటాచబుల్‌ లిథియం-అయాన్‌ బ్యాటరీని పొందుపరిచారు. 4 గంటల్లో దీన్ని ఛార్జ్‌ చేయొచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ వరకు ప్రయాణించొచ్చు. గరిష్ఠంగా గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని