Hero: హీరో మోటోకార్ప్‌ గిన్నీస్‌ రికార్డు..స్ల్పెండర్‌ బైక్‌లతో అతిపెద్ద లోగో!

ఒకప్పుడు కలిసి ద్విచక్ర వాహనాలు తయారు చేసిన రెండు వేర్వేరు కంపెనీలైన హీరో, హోండా.. విడిపోయి దశాబ్దం గడిచింది. ఈ నేపథ్యంలో తమ ఒంటరి ప్రయాణానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది...

Updated : 11 Aug 2021 11:57 IST

చిత్తూరు: ఒకప్పుడు కలిసి ద్విచక్ర వాహనాలు తయారు చేసిన రెండు వేర్వేరు కంపెనీలైన హీరో, హోండా.. విడిపోయి దశాబ్దం గడిచింది. ఈ నేపథ్యంలో తమ ఒంటరి ప్రయాణానికి పదేళ్లు పూర్తయిన సందర్భంగా హీరో ఓ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. సంస్థకు చెందిన అతిపెద్ద లోగోను ప్రదర్శించి గిన్నీస్‌ రికార్డును నెలకొల్పింది. అదీ తమ సంస్థకు వెన్నుదన్నుగా ఉన్న స్ల్పెండర్‌ ప్లస్‌ బైక్‌లను ఓ వరుస క్రమంలో పేర్చి లోగోను రూపొందించారు. దీనికి చిత్తూరు జిల్లాలోని హీరో తయారీ కేంద్రం వేదికగా నిలిచింది. మొత్తం 1000 ఫీట్‌ x 800 ఫీట్‌ స్థలాన్ని వినియోగించారు. 90 రోజులు ప్రణాళికలు వేసి, 300 గంటలు శ్రమించి ఈ లోగోను నిర్మించారు. మొత్తం 1845 బైక్‌లను హీరో లోగో ఆకారంలో పేర్చారు. ఇంత భారీ లోగోను ప్రదర్శించిన ఏకైక ద్విచక్రవాహన సంస్థగా రికార్డు నెలకొల్పింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని