హైటెక్స్‌లో హోమ్‌ ఫర్నీచర్‌ ఎక్స్‌పో

హైటెక్‌ సిటీలోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఈ నెల 3 నుంచి హోమ్‌ ఫర్నీచర్‌ ఎక్స్‌పో ప్రారంభమైంది. ఆరో తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్‌ జరగనుందని నిర్వాహకులు తెలిపారు.

Updated : 04 Dec 2021 17:11 IST

హైదరాబాద్‌: హైటెక్‌ సిటీలోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఈ నెల 3 నుంచి హోమ్‌ ఫర్నీచర్‌ ఎక్స్‌పో ప్రారంభమైంది. ఆరో తేదీ వరకు ఈ ఎగ్జిబిషన్‌ జరగనుందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ప్రవేశానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. ఇయర్‌ ఎండ్‌ ఫర్నీచర్‌ డిస్కౌంట్‌ సేల్‌లో భాగంగా ఈ ఎక్స్‌పో నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫర్నీచర్‌తో పాటు ఇంటీరియర్స్‌, గృహోపకరణాలు, డ్రెస్‌ మెటీరియల్స్‌, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ ఎగ్జిబిషన్‌లో ఉంచుతున్నట్లు తెలిపారు. టేకు, వెదురుతో చేసిన ఫర్నీచర్‌తో పాటు గార్డెన్‌, ఆఫీస్‌ ఫర్నీచర్‌ కూడా లభిస్తుందని, మరిన్ని వివరాలకు 78239 90381 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని