Honda Cars: పండగ సీజన్‌.. హోండా కార్లపై భారీ రాయితీలు!

పండగ సీజన్‌ నేపథ్యంలో ‘హోండా కార్స్‌ ఇండియా’ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మోడల్‌ను బట్టి కార్లపై రూ.53,500 వరకు ప్రయోజనాలు లభించనున్నాయి.....

Published : 06 Oct 2021 18:58 IST

దిల్లీ: పండగ సీజన్‌ నేపథ్యంలో ‘హోండా కార్స్‌ ఇండియా’ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. మోడల్‌ను బట్టి కార్లపై రూ.53,500 వరకు ప్రయోజనాలు లభించనున్నాయి. ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉండనున్నాయి. క్యాష్‌బ్యాక్‌, యాక్సెసరీస్‌, లాయల్టీ బోనస్‌, స్పెషల్‌ ఎక్స్‌ఛేంజ్‌ బెనిఫిట్స్‌ రూపంలో ప్రయోజనాలు అందనున్నాయి. ఐదో తరం సిటీ కారు మోడల్‌పై రూ.53,500, నాలుగో తరం సిటీపై రూ.22,000, అమేజ్‌పై రూ.18,000, డబ్ల్యూఆర్‌-వీపై రూ.40,100, జాజ్‌పై రూ.45,900 వరకు ప్రయోజనాలు లభించనున్నాయి. పండగ సీజన్‌ నేపథ్యంలో వినియోగదారులకు ప్రకటించిన ప్రత్యేక ఆఫర్ల ద్వారా వాహన విక్రయాలు మరింత ఊపందుకుంటాయని ఆశిస్తున్నామని హోండా కార్స్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌ గోయల్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని