CB300R: హోండా నుంచి కొత్త బైక్‌ సీబీ300ఆర్‌.. ధర ఎంతంటే?

ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (HMSI) బుధవారం మరో కొత్త బైక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.....

Published : 12 Jan 2022 21:13 IST

దిల్లీ:  ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ ‘హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (HMSI)’ బుధవారం మరో కొత్త బైక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. సీబీ300ఆర్‌ (CB300R)గా పేర్కొంటున్న ఈ బైక్ ధర రూ.2.77 లక్షలు (ఎక్స్‌షోరూం). నేటి నుంచి బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. హోండాకు మాత్రమే ప్రత్యేకమైన ప్రీమియం బిగ్‌వింగ్‌, బిగ్‌వింగ్‌ టాప్‌లైన్ డీలర్‌షిప్‌లలో దీన్ని బుక్‌ చేసుకోవచ్చు. 

కొత్త బైక్‌ 288సీసీ 4-వాల్వ్‌ లిక్విడ్‌ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌తో వస్తోంది. దీంట్లో క్లచ్‌కి అసిస్ట్‌ అండ్‌ స్లిప్పర్ అనే అదనపు హంగును జోడించారు. దీంతో సాధారణ క్లచ్‌ ఆపరేషన్స్‌కి కావాల్సిన దానికంటే తక్కువ లోడ్‌తోనే క్లచ్‌ ఫంక్షన్స్‌ని నిర్వహించొచ్చు. ఇక స్లిప్పర్‌ ఫంక్షన్.. సడెన్‌ ఇంజిన్ బ్రేకింగ్‌ వల్ల వచ్చే అనవసర షాక్స్‌ను తగ్గిస్తుందని కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని