Honda Shine: హోండా షైన్ ధర పెంపు!
హోండా మోటార్స్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా షైన్ బైక్ ధరను పెంచింది. ప్రస్తుతం హోండా తయారు
ఇంటర్నెట్‌డెస్క్: హోండా మోటార్స్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా షైన్ బైక్ ధరను పెంచింది. ప్రస్తుతం హోండా తయారు చేసే బైకుల్లో ఇదే అత్యధికంగా అమ్ముడుపోయే మోడల్. దీని ధర రూ.1,072 పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో డ్రమ్ బ్రేక్ వేరియంట్ షైన్ ఎక్స్‌షోరూమ్ ధర రూ.71,550గా ఉండగా.. డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.76,346గా ఉంది. ఇప్పటికే ఈ బైకును ఎస్బీఐ క్రెడిట్ కార్డు వినియోగించి, ఈఎంఐలపై కొనుగోలు చేసే వారికి రూ.3,500 వరకు డిస్కౌంట్లను ప్రకటించిన విషయం తెలిసిందే.
హోండా తన వినియోగదారులకు ఉచిత సర్వీసుల గడువు పెంపును కూడా ప్రకటించింది. ఏప్రిల్1వ తేదీ నుంచి మే 31వ తేదీ మధ్యలో ఎవరి ఉచిత సర్వీసుల గడువు ముగుస్తుందో వారికి జులై 31 వరకు అవకాశం ఇచ్చింది. లాక్డౌన్లు ముగిసిన ప్రాంతాల్లో వారు సర్వీసులు పొందవచ్చని తెలిపింది. షైన్‌లో 125 సీసీ ఇంజిన్ అమర్చారు. ఇది 10.72 బీహెచ్పీ శక్తిని విడుదల చేస్తుంది. దీనికి 5స్పీడ్ గేర్‌బాక్స్ అమర్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!