నొయిడాలో కార్ల ఉత్పత్తి నిలిపివేసినహోండా

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌సీఐఎల్‌) యూపీలోని గ్రేటర్‌ నొయిడాలో ఉన్న ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేసింది. ఇకపై కార్ల ఉత్పత్తి మొత్తం రాజస్థాన్‌లోని తపుకరాలో మాత్రమే.....

Published : 30 Dec 2020 15:45 IST

దిల్లీ: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హోండా కార్స్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌సీఐఎల్‌) యూపీలోని గ్రేటర్‌ నొయిడాలో ఉన్న ప్లాంట్‌లో ఉత్పత్తిని నిలిపివేసింది. ఇకపై కార్ల ఉత్పత్తి మొత్తం రాజస్థాన్‌లోని తపుకరాలో మాత్రమే జరగనుంది. నొయిడాలో కంపెనీ కార్పొరేట్‌ హెడ్‌ ఆఫీస్‌తో పాటు స్పేర్‌పార్ట్స్‌ డివిజన్‌,  రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రం, ఇతర కార్యకలాపాలు మాత్రమే కొనసాగుతాయి.

జపాన్‌కు చెందిన హోండా దేశీయంగా కార్ల ఉత్పత్తి కోసం నొయిడాలో 1997లో ప్లాంట్‌ను నెలకొల్పింది. అయితే, ప్లాంట్‌ ఉత్పాదకత, సామర్థ్యం పెంపునకు ఈ ఏడాది తొలినాళ్లలో ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ ప్రకటించింది. తాజాగా మూసివేత నిర్ణయం తీసుకుంది. దీనిపై స్పందించేందుకు కంపెనీ నిరాకరించింది. గ్రేటర్‌ నొయిడాలో హోండాకు చెందిన సిటీ, సీఆర్‌-వి, సివిక్‌ మోడళ్లు ఉత్పత్తి అయ్యేవి. ఈ ప్లాంట్‌ సామర్థ్యం లక్ష యూనిట్లు కాగా.. తపుకరా ప్లాంట్‌ సామర్థ్యం 1.8 లక్ష యూనిట్లుగా ఉంది. ఇతర దేశాలకు సైతం తపుకరలో తయారైన ఇంజిన్లు ఉత్పత్తి అవుతున్నాయి. మరోవైపు గతేడాది నవంబర్‌లో 6,549 వాహనాలు మాత్రమే విక్రయించిన హోండా.. ఈ ఏడాది నవంబర్‌లో 9,900 యూనిట్లు విక్రయించింది.

ఇవీ చదవండి..
‘భారత్‌ ఎందుకు’ అనుకున్నవారే ఇప్పుడు..
పిన్‌ లేకుండా రూ.5వేల లావాదేవీ.. సురక్షితమేనా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని