ఇల్లు హోల్డింగ్ పీరియ‌డ్ ఎంత ఉంటే ప‌న్ను మిన‌హాయింపు

దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డి ప‌న్నుపై పాక్షికంగా లేదా పూర్తిగా ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలో అనేక వెసులుబాట్లు ఉన్నాయి. ఇంటి య‌జ‌మాని తాము నివ‌సిస్తున్న‌ ఇంటిని అమ్మే ముందు ..

Published : 25 Dec 2020 16:12 IST

దీర్ఘ‌కాల మూల‌ధ‌న రాబ‌డి ప‌న్నుపై పాక్షికంగా లేదా పూర్తిగా ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలో అనేక వెసులుబాట్లు ఉన్నాయి. ఇంటి య‌జ‌మాని తాము నివ‌సిస్తున్న‌ ఇంటిని అమ్మే ముందు ఎన్ని రోజుల హోల్డింగ్ పీరియ‌డ్ ఉండే ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. ఆదాయ ప‌న్ఉ చ‌ట్టం ప్ర‌కారం ఉన్న నియ‌మ నిబంధ‌న‌లు ఏంటి తెలుసుకుందాం..

క్యాపిట‌ల్ గెయిన్స్‌పై ప‌న్ను మిన‌హాయింపు
ఏదైనా స్తిరాస్థిని కొనుగోలు చేసిన రెండేళ్ల లోపు అమ్మితే వ‌చ్చే లాభాల‌పై స్వ‌ల్ప‌కాల మూల‌ధ‌న లాభాల‌ (షార్ట్ ట‌ర్మ్ క్యాపిట‌ల్ గెయిన్స్ ట్యాక్స్‌) ప‌న్ను విధిస్తారు. అదే విధంగా రెండేళ్ల పైన స్తిరాస్థి క‌లిగి ఉండి దానిని విక్ర‌యిస్తే గ‌నుక దీర్ఘ‌కాల మూల‌ధ‌న లాభాల (లాంగ్ ట‌ర్మ్ క్యాపిట‌ల్ గెయిన్స్ ట్యాక్స్‌) ప‌న్నును చెల్లించాల్సి ఉంటుంది. స్వ‌ల్పకాల మూల‌ధ‌న లాభాలపై ప‌న్నును లెక్కించేందుకు లాభాల‌ను ప‌న్ను చెల్లింపుదారు ఆదాయానికి జ‌త‌చేస్తారు. ప‌న్ను చెల్లింపుదారు శ్లాబును బ‌ట్టి ప‌న్ను నిర్ణ‌య‌మ‌వుతుంది. లాంగ్‌ట‌ర్మ్ క్యాపిట‌ల్ గెయిన్స్ ట్యాక్స్ విష‌యంలో మాత్రం వ్య‌క్తి ఆదాయ‌పు ప‌న్ను శ్లాబుకు సంబంధం లేకుండా మూల‌ధ‌న లాభంపై 20శాతం ప‌న్ను వ‌సూలు చేస్తారు.

మూల‌ధ‌న ఆస్తుల‌ను అమ్మ‌డం ద్వారా వ‌చ్చే లాభాల‌కు సెక్ష‌న్ 54(ఎఫ్‌) కింద ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. అయితే సెక్ష‌న్ 54(ఎఫ్‌) ప్ర‌కారం ఇలా వ‌చ్చిన లాభాల‌ను మ‌రో నివాస స్థలం కొనుగోలుకు ఉప‌యోగించాలి. అప్పుడే ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. స్తిరాస్థిని అమ్మగా వ‌చ్చిన లాభాల‌తో రెండేళ్ల‌లోపు నివాస గృహాన్ని కొనుగోలు చేస్తే ప‌న్ను మినహాయింపు ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. నిర్మాణంలో ఉన్న నివాస స్థ‌లంపై పెట్టుబ‌డి పెట్టాల‌నుకుంటే మూల‌ధ‌న ఆస్తిని విక్ర‌యించిన మూడేళ్ల‌లోగా ఆ ప‌నిచేయాలి. నూత‌న నివాసంపై చేసిన పెట్టుబ‌డి మూడేళ్ల దాకా లాక్ ఇన్ అయి ఉంటుంది. కాబట్టి కొత్త ఇంటిని కొని మూడేళ్ల లోపు అమ్మేదానికి వీల్లేదు. ఒక వేళ అలా చేస్తే గ‌నుక మీ మూల‌ధ‌న ఆస్తిపై తొలుత ఏదైతే లాభం వ‌చ్చి, దానిపై ప‌న్ను ప్ర‌యోజ‌నం పొందారో అదంతా కోల్పోవాల్సి ఉంటుంది.

పన్ను మిన‌హాయింపు ప్ర‌యోజ‌నం పొందాల‌నుకునే వారికి కేవలం ఒక్క సొంత ఇల్లు మాత్రమే ఉండాలి అలా కాకుండా రెండు, మూడు ఇళ్లు ఉన్న‌వారికి సెక్ష‌న్ 54(ఎఫ్‌) వ‌ర్తించ‌దు. మూల‌ధ‌న ఆస్తిని విక్ర‌యించిన ఆరు నెల‌ల లోపు బాండ్ల‌లో పెట్టుబ‌డి పెడితే సెక్ష‌న్ 54 (ఈసీ) కింద ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. గ్రామీణ విద్యుత్ కార్పొరేష‌న్ లిమిటెడ్‌(ఆర్‌.ఇ.సి.)/ జాతీయ ర‌హ‌దారుల ప్రాధికార సంస్థ‌(ఎన్‌.హెచ్‌.ఏ.ఐ) లాంటివి జారీచేసే బాండ్ల‌లో మూల‌ధ‌న ఆస్తి విక్ర‌య లాభాల‌ను పెట్ట‌వ‌చ్చు.

గృహ రుణంతో కొనుగోలు చేస్తే..
సెక్ష‌న్ 80 సీ ప్ర‌కారం, వ్య‌క్తులు గృహ రుణం చెల్లింపు, బీమా, పెట్టుబ‌డులు, ట్యూష‌న్ ఫీజు, పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్‌, ఈపీఎఫ్‌,ఎన్ఎస్‌సీ వంటి పెట్టుబ‌డులు ఉంటే. స్టాంప్ డ్యూటీ, రీజిస్ర్టేష‌న్ ఛార్జీలు వంటి వాటిపై రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు ల‌భిస్తుంది. అయితే బ్యాంకులు, ఇత‌ర హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీల‌ నుంచి తీసుకున్న రుణంపై మాత్ర‌మే ఈ మిన‌హాయింపులు ల‌భిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని