Housing finance: హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో 10% వృద్ధి

ఈ ఆర్థిక సంవత్సరం హౌసింగ్‌ ఫినాన్స్‌ కంపెనీ(హెచ్‌ఎఫ్‌సీ)లు 8-10 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది...

Updated : 08 Nov 2021 18:56 IST

ముంబయి: ఈ ఆర్థిక సంవత్సరం హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ(హెచ్‌ఎఫ్‌సీ)లు 8-10 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా రేటింగ్స్ అంచనా వేసింది. తొలి త్రైమాసికంలో కరోనా రెండో దశ ప్రభావం కారణంగా రుణాల మంజూరు, వసూళ్ల సామర్థ్యం తగ్గిందని తెలిపింది. దీంతో వృద్ధిలో ఎలాంటి పెరుగుదల నమోదు కాలేదని పేర్కొంది. కానీ, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడంతో రెండో త్రైమాసికానికి పరిస్థితులు గాడిన పడ్డాయని తెలిపింది. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవడం, వ్యాక్సినేషన్‌తో పాటు ఈ రంగంలో గిరాకీ పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది సానుకూల వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గృహరుణాలు, ఆస్తులపై రుణాలు, మార్టిగేజ్‌ రుణాలు, కన్‌స్ట్రక్షన్‌ ఫైనాన్స్‌, లీజ్‌, రెంటల్‌ డిస్కౌంటింగ్‌.. అన్నీ కలుపుకొని హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో ఆన్‌-బుక్‌ పోర్ట్‌ఫోలియో విలువ జూన్‌ 30, 2021 నాటికి రూ.11 లక్షలకు చేరిందని ఇక్రా తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని