ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్ ఎందుకు తీసుకోవాలి? 

క‌ట్ట‌డ నిర్మాణం పూర్తైతే ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్‌ను పొంద‌డం  క‌ట్ట‌డం నిర్మాణ‌దారుని భాద్య‌త‌. 

Updated : 26 Aug 2021 16:37 IST

ఏదైనా కొత్త ఆస్తిని కొనుగోలు చేసేప్పుడు ముందుగా ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్‌ను(ఓసీ) తీసుకోవాలి.  అస‌లు ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్ అంటే ఏమిటి? ఎందుకు తీసుకోవాలి? ప్రాధాన్య‌త ఏమిటి? త‌దిత‌ర విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్‌ను (ఆక్ర‌మ‌ణ ధృవ‌ప‌త్రం) స్థానిక అధికారులు జారీచేస్తారు.  ఒక భ‌వ‌నం దానికి నిర్ధేశించిన ప‌రిధిలో, ఆమోదించిన ప్ర‌ణాళిక ప్ర‌కారం, స్థానిక చ‌ట్టాల‌కు అనుగుణంగా నిర్మిత‌మైందా లేదా అనే అంశాల ద్వారా ఈ స‌ర్టిఫికేట్‌ను జారీ చేస్తారు. 

భ‌వ‌న నిర్మాణానికి వ‌ర్తించే బిల్డింగ్ కోడ్‌ల‌ను అనుస‌రించి, సాధార‌ణ నియ‌మాల‌కు, చ‌ట్టాల‌కు అనుగుణంగా భ‌వ‌న నిర్మాణం జ‌రిగింది అని ధృవీక‌రించే ప‌త్రం. ఒక‌సారి క‌ట్ట‌డ నిర్మాణం పూర్తైతే ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్ పొంద‌డం క‌ట్ట‌డం నిర్మాణ‌దారుని భాద్య‌త‌. మంచినీరు, సేనిటేష‌న్‌, ఎల‌క్ట్రానిక్ క‌న‌క్ష‌న్లు వంటి వాటికి ఇది అవ‌స‌రం అవుతుంది. ఆస్తి చట్టపరమైన హోదాను బలపరిచేందుకు గృహ యజమానులకు ఆక్యుపేష‌న్ స‌ర్టిఫికేట్ అవ‌స‌రం. ఓసీ లేక‌పోతే స్థానిక మున్సిప‌ల్ ఆఫీస్ చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకుంటుంది. గృహ రుణం పొందాల‌న్నా ఒసీ అవ‌స‌రం.  మీ పాత బిల్డింగ్‌ను కొనాల‌న్న అమ్మాల‌న్న కూడా ఓసీ త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి. 

ఆక్యుపెన్సీ స‌ర్టిఫికేట్‌ను పొంద‌డం ఎలా?
బిల్డింగ్  నిర్మాణం పూర్త‌య్యే 30 రోజుల‌లో భ‌వ‌ణ నిర్మాణదారుడు ఓసీని ద‌ర‌ఖాస్తు చేయాలి. ఆస్తి య‌జ‌మానిగా మీరు కూడా స్థానిక మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ఓసీ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అవ‌స‌ర‌మైన అన్ని ప్ర‌మాణాల ప్ర‌కారం నిర్మాణం పూర్తిచేస్తే ద‌ర‌ఖాస్తు చేసిన 30 రోజుల‌లోపు ఓసీని పొందుతారు. 

ద‌ర‌ఖాస్తు చేసేందుకు కావ‌ల‌సిన ప‌త్రాలు..
*
నిర్మాణ‌ ప్రారంభ ప్రమాణపత్రం.
* నిర్మాణ‌ పూర్తి ప్రమాణపత్రం..
* అగ్ని, కాలుష్యం కోసం ఎన్ఓసీ(నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికేట్‌) లు.
* తాజా ఆస్తి పన్ను రసీదు.
* భవన నిర్మాణం కోసం మంజూరు చేసిన ప్రణాళిక కాపీ.
* ఫ్లోర్ ఏరియా లెక్కింపు ప‌త్రం(అర్కిటెక్‌చే సంత‌కం చేసి ఉండాలి)
పూర్తైన భ‌వ‌నానికి సంబంధించిన ఫోటో కాపీలు

ఆస్తి య‌జ‌మానిగా మీ హ‌క్కు..
భ‌వ‌న నిర్మాణ‌దారుడు/డ‌వ‌ల‌ప‌ర్‌ ఓసీని ఇచ్చేందుకు నిరాక‌రించిన‌, భ‌వ‌న నిర్మాణం పూర్తైన‌ప్ప‌టికీ ఓసీ పొంద‌క‌పోయినా, డ‌వ‌ల‌ప‌ర్‌కు వ్య‌క్తిరేకంగా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవ‌చ్చు. చట్టపరమైన నోటీసు జారీ చేయవచ్చు, వినియోగదారుని(కన్స్యూమర్ ) కోర్టులో కేసు ఫైల్ చేయ‌వ‌చ్చు. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ -ఆర్ఈఆర్ఏ) వంటి చట్టాలు కార‌ణంగా డెవలపర్లు నిర్లక్ష్యం, మోసాలు గణనీయంగా తగ్గుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆస్తి యజమానులుగా మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆక్యుపేష‌న్ స‌ర్టిఫికేట్‌ వంటి ముఖ్యమైన పత్రాలు ఆస్తిపై మీ హక్కులను సురక్షితంగా ఉంచుతాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని