ఆరోగ్య బీమా ఎంతకి తీసుకోవాలి?
పిల్లలు పుట్టిన వెంటనే వారిని కూడా ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకుని రావాలి
పెరుగుతున్న వైద్య ఖర్చులను తట్టుకోవడానికి ఆరోగ్య బీమా అంత ఉత్తమం మరోటి లేదు. మరి ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలి? ఈ ప్రశ్న కు సమాధానం అంత తేలికేమీ కాదు.
జీవిత బీమా కు ఆరోగ్య బీమా కూడా మధ ఎంతో వ్యత్యాసం ఉంది. వార్షిక ఆదాయానికి ఎన్ని రెట్లు జీవిత బీమా తీసుకుంటే సరిపోతుందని..లేదా ఒక వ్యక్తి ఆర్ధిక పరిస్థితిని బట్టి, ఎంత బీమా తీసుకుంటే ధీమా గా ఉండవచ్చో తేలిగ్గా సూత్రీకరించవచ్చు. కానీ, ఆరోగ్య బీమా విషయం లో ఇలా చెప్పడం ఎంతో కష్టం. ఎందుకంటే ..అనారోగ్యం ఏ రూపం లో వస్తుందో, దానికి ఎంత ఖర్చు అవుతుందో ఊహించడం దాదాపు అసాధ్యం. మరి కుటుంబానికి అనారోగ్యం లో ఆర్ధికంగా అండగా ఉండాలంటే ఆరోగ్య బీమా పాలసీని ఎంత మొత్తానికి తీసుకోవాలి? ఈ ప్రశ్న కు సమాధానం కాస్త కష్టమే అయినప్పటికీ కొన్ని అంశాల ఆధారంగా దీని విషయంలోనూ ఒక నిర్ణయానికి రావచ్చు.
వయసెంత?
ఆరోగ్య బీమా పాలసీని ఎంత మొత్తానికి తీసుకోవాలో నిర్ణయించుకునే ముందు వయసు ను పరిగణ లోకి తీసుకోవడం మర్చిపోవద్దు. ఎంత చిన్న వయసు లో పాలసీ తీసుకుంటే అంత మంచిది. ఉదాహరణకి 35 ఏళ్ళ వయసు గల మనిషి వ్యక్తిగత ఆరోగ్య బీమా తీసుకోవాలంటే కనీసం రూ. 3 నుంచి 5 లక్షల బీమా ఉండాల్సిదే. ఆ తర్వాత నుంచి ఏటా కనీసం 10 నుంచి 15 శాతం పాలసీ విలువను పెంచుకుంటూ వెళ్ళాలి. చిన్న వయసు లో పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. అదే సమయం లో ముందస్తు వ్యాధులు ఉండే అవకాశం కూడా తక్కువే. కొన్ని బీమా కంపెనీలు 45 ఏళ్ళ వయసు పై బడిన వారికి, పెద్దలకు(60 ఏళ్ళు దాటిన వారికి) ప్రత్యేక పాలసీలను అందిస్తాయి. ఇందులో ప్రత్యేకతలు కూడా ఉంటాయి. సాధారణ పాలసీల్లో లాగా వేచి ఉండే సమయం అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. అందుకే పాలసీలను ఎంచుకునేటప్పుడు మీ వయసు ఆధారంగా ఏమైనా ప్రత్యేక పాలసీలు ఉన్నాయా అన్నది కూడా చూడడం ఉత్తమం.
మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా :
జీవితంలోని వివిధ దశలను బట్టి బీమా అవసరాలు కూడా మారుతుంటాయి. కాబట్టి ఆరోగ్య బీమా పాలసీ ఎంచుకునేప్పుడు కూడా మీ అవసరాలు ఏంటో ఒకసారి చూసుకోవాలి. అప్పుడే సరైన మొత్తానికి పాలసీ తీసుకోవడం వీలవుతుంది. మీకు పెళ్ళైతే..జీవిత భాగస్వామి కి కూడా బీమా రక్షణ కల్పించాలి. పిల్లలు పుట్టిన వెంటనే వారిని కూడా ఆరోగ్య బీమా పరిధిలోకి తీసుకుని రావాలి. అప్పుడు వారికి వచ్చే అనారోగ్యాలను కూడా దృష్టిలో పెట్టుకుని పాలసీ సరిపోతుందా లేదా అన్నది సమీక్షించుకోవాలి. ఫామిలీ ఫ్లోటర్ పాలసీ ద్వారా మొత్తం కుటుంబాన్ని ఆరోగ్య బీమా పరిధి లోకి తీసుకురావచ్చు. కుటుంబం లోని ప్రతి వ్యక్తికీ వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం కన్నా..ఒకే పాలసీ తో అందరికి బీమా రక్షణ కల్పించడం ఉత్తమం.
మరింత లోతుగా :
సాధారణ ఆరోగ్య బీమా పాలసీ ఆసుపత్రి లో అయిన ఖర్చులను మాత్రమే చెల్లిస్తుంది. ఒక వ్యక్తి ఆసుపత్రి పాలైతే ఇంకా ఎన్నో ఖర్చులు అదనంగా ఉంటాయి. అందుకే, ఇలాంటి అవసరాలకు కూడా రక్షణనిచ్చే పాలసీలను ఎంచుకోవడం ఉత్తమం. కొన్ని ప్రత్యేకతలను జోడించి బీమా కంపెనీలు పాలసీలను అందిస్తున్నాయి. ముఖ్యంగా..
* ఆసుపత్రి లో చేరినప్పుడు రోజుకి ఇంత అని చెప్పి నగదు ఇవ్వడం. దీని వల్ల బీమా పాలసీలో పరిహారం అందని ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది.
* తీవ్రమైన వ్యాధుల బారిన పడినప్పుడు ఆర్ధికంగా ఆదుకునేలా ఉండాలి. మహిళలకు సంబంధించి వచ్చే ప్రత్యేక వ్యాధులకూ పరిహారం చెల్లించే ఏర్పాటు ఉండాలి.
* వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం
* పెద్దలకు సంబంధించి ప్రత్యేక రక్షణ
* ప్రసవం ఖర్చుల కోసం బీమా
ఇవన్నీ ఉండేలా అదనంగా ఒక పాలసీని తీసుకోవడం కూడా మంచిదే.
పన్ను పరంగా కూడా:
ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియం కి సెక్షన్ 80డీ కింద ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. మీ తల్లిదండ్రులకు కూడా బీమా పాలసీ తీసుకుని ఈ మినహాయింపుని పొందొచ్చు. రూ. 25000 వరకు ఆరోగ్య ప్రీమియం కట్టి దానికి పన్ను మినహాయింపు పొందొచ్చు, అదే సీనియర్ సిటిజన్లు అయితే రూ. 50,000 వరకు మినహాయింపు ఉంటుంది.
ఇతర పాలసీలు ఏమున్నాయి?
మీరు పని చేస్తున్న కంపెనీ బృంద ఆరోగ్య బీమా అందిస్తుందా?అయినప్పటికీ ఈ బీమా చాలా సందర్భాల్లో మీ అవసరాలకు ఏ మాత్రం సరిపోకపోవచ్చు. ఖర్చుల్లో 20 శాతం వరకు సహా చెల్లింపు(కో-పే) చేయాల్సి రావచ్చు. పాలసీ ని దీర్ఘకాలం పాటు కొనసాగించవచ్చు లేదా మధ్యలోనే రద్దు చేయవచ్చు. కొన్ని రకాల వ్యాధులకు పరిహారం ఇవ్వకపోవచ్చు. ఇలా ఇందులో చాలా పరిమితులు ఉంటాయి. ఉద్యోగం వదులుకుంటే గ్రూప్ పాలసీ ని కూడా వదులుకోవాల్సిందే. అందుకే ప్రతి వ్యక్తీ బృంద బీమా తో పాటు సొంతంగా కుటుంబానికి ఆరోగ్య బీమా పాలసీ ని తీసుకోవాలి. పెరుగుతున్న వైద్య ఖర్చులకు తగ్గట్టుగా సరిపడా ఆరోగ్య బీమా హామీ ని ఎంచుకోండి. మీకు భవిష్యత్తులో ఆర్ధికంగా సమస్యలు రాకుండా ఇది ఉపయోగపడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..