లాక‌ర్లు సుర‌క్షిత‌మేనా? అందులోని వ‌స్తువుల‌కు బ్యాంకు బాధ్య‌త వ‌హించ‌దు!

బ్యాంకు లాక‌ర్ల‌ను పూర్తిగా సుర‌క్షిత‌మ‌ని భావించ‌న‌క్క‌ర్లేదు. లాక‌ర్ల‌కు బ్యాంకులు బాధ్య‌త వ‌హించ‌వు. మ‌రి వినియోగ‌దారులు ఏం చేయాలో తెలుసుకుందాం..

Published : 15 Dec 2020 20:41 IST

లాక‌ర్లు ఇప్పుడు దాదాపు ప్ర‌తి బ్యాంకులోను ద‌ర్శ‌నమిస్తున్నాయి. చాలా బ్యాంకులు ఈ స‌దుపాయాన్ని త‌మ వినియోగ‌దారుల‌కు అందిస్తుంటాయి. వ్య‌క్తిగ‌త వ‌స్తువులు, బంగారు ఆభ‌ర‌ణాలు, న‌గ‌దు, ముఖ్య‌మైన ద‌స్త్రాలు ఉంచుకునేందుకు లాక‌ర్ స‌దుపాయాన్ని ఇస్తారు. ఇందుకోసం లాక‌ర్ సైజును బ‌ట్టి వార్షికంగా రుసుము వ‌సూలు చేస్తారు. వినియోగ‌దారులు బ్యాంకు లాక‌ర్ల‌లో త‌మ వ‌స్తువులు భ‌ద్రంగా ఉంటాయ‌ని భావిస్తారు. అయితే కొన్ని సంఘ‌ట‌నల దృష్ట్యా నిజంగా ఇవి ఎంత మేర‌కు సుర‌క్షిత‌మ‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మే?

దిల్లీలోని పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ ప్ర‌ధాన కార్యాల‌యంలో మంట‌లు చెల‌రేగి వంద‌ల కొద్దీ జ‌నాలు లోప‌లే ఇరుక్కుపోయారు. లాక‌ర్ల‌లోని వ‌స్తువుల‌న్నీ అగ్నికి ఆహుత‌య్యాయి. ఒక‌సారి హ‌ర్యానాలో ఇదే బ్యాంకు సోనిప‌ట్ శాఖ‌లో దొంగ‌లు 125 అడుగుల సొరంగాన్ని త‌వ్వి 77 లాక‌ర్ల నుంచి విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు, న‌గ‌దు, ఇత‌ర విలువైన వ‌స్తువుల‌ను దోచుకెళ్లారు. మ‌రో సంఘ‌ట‌న‌లో భాగంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఒక ప‌ట్ట‌ణంలో ఉన్న సెంట్ర‌ల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి చాక‌చక్యంగా 45 లాక‌ర్ల నుంచి వ‌స్తువుల‌ను దొంగ‌లు మాయం చేసేశారు. ఇంకో సంద‌ర్భంలో చెన్నైకి స‌మీపంలోని ఇండియన్ ఓవ‌ర్‌సీస్ బ్యాంక్ కీల్‌క‌ట్ట‌లై శాఖ‌లో ప‌ట్ట‌ప‌గ‌లే దొంగ‌లు ప‌డి వినియోగ‌దారుల‌ను బెదిరించి బ‌ల‌వంతంగా లాక‌ర్ల‌ను తెరిపించి డ‌బ్బు, విలువైన వ‌స్తువుల‌ను దోచుకెళ్లారు. ఇవి కొన్ని సంఘ‌ట‌న‌లు మాత్ర‌మే. బ్యాంకు లాక‌ర్ల‌ను పూర్తిగా సుర‌క్షిత‌మ‌ని భావించ‌న‌క్క‌ర్లేదు. లాక‌ర్ల‌కు బ్యాంకులు బాధ్య‌త వ‌హించ‌వు. మ‌రి వినియోగ‌దారులు ఏం చేయాలో తెలుసుకుందాం. బ్యాంకు- వినియోగ‌దారు సంబంధం ఇలా…బ్యాంకు- లాక‌ర్ అద్దెకు తీసుకునేవారిది బెయిల్ ఇచ్చే వ్య‌క్తి… తీసుకునే వ్య‌క్తి మ‌ధ్య ఉండే సంబంధం లాంటిది. అంతేకానీ, అద్దెకిస్తున్నారు క‌దా అని యాజ‌మాని- కిరాయిదారు లాంటిది కాదు! లాక‌ర్లో ఉన్న వ‌స్తువుల‌కు బ్యాంకులకు ఎలాంటి అవ‌గాహ‌న ఉండ‌దు. లాక‌ర్క్ ఫిక్స్‌డ్ డిపాజిట్‌…స‌రైన స‌మ‌యంలో లాక‌ర్ అద్దె చెల్లించే భ‌రోసా ఉండేలా లాక‌ర్ల కోసం క‌నీస ఫిక్స్‌డ్ డిపాజిట్‌ను బ్యాంకులు వ‌సూలు చేస్తాయి. అనుకోని సంఘ‌ట‌న జ‌రిగి లాక‌ర్లు బ‌ల‌వంతంగా తెరిచిన‌ప్పుడు, లేదా అద్దె ఇవ్వ‌కుండా ఎగొట్టిన‌ప్పుడు ఈ ఎఫ్డీ ఉప‌యోగిస్తారు. దొంగ‌త‌నాల‌కు బాధ్య‌త‌ - బ్యాంకు చేయిదాటి జ‌రిగిన ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌ల‌కైనా బాధ్య‌త వ‌హించ‌దు. దోపిడీ, దొంగ‌త‌నాలు జ‌రిగిన‌ప్పుడు బ్యాంకులు 100శాతం బాధ్య‌త‌ను తీసుకోవు. లాక‌ర్ల‌లో ఏమున్న‌ద‌నే విష‌యం బ్యాంకుల‌కు అస్స‌లు తెలియ‌దు. లాక‌ర్ ను తెర‌వాలంటే దాన్ని అద్దెకు తీసుకున్న‌వారు, బ్యాంకు వ‌ద్ద ఉన్న మాస్ట‌ర్ తాళం చెవి… ఇవి రెండు ఉప‌యోగిస్తే కానీ తెర‌వ‌లేం. అందుకే బ్యాంకునొక్క‌దాన్నే దీన్ని బాధ్య‌త వ‌హించ‌మ‌న‌లేం. ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం…లాక‌ర్లో పెట్టిన వ‌స్తువుల‌కు ఏ విధ‌మైన బాధ్య‌త బ్యాంకులు వహించ‌బోవు. దొంగ‌త‌నం, దోపిడీ, లేదా ఇత‌ర అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న‌ప్పుడు చ‌ట్టం ప్ర‌కారం ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోజాల‌రు… అని ఆర్బీఐ నిబంధ‌న‌ల్లో ఉంది. మ‌రో చోట ఆర్‌బీఐ ఏం చెప్పిందంటే… లాక‌ర్లో ఏం వ‌స్తువులు ఉన్నాయో తెలియక‌పోయినా వాటికి ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని బ్యాంకుల ప‌ని అని పేర్కొంది. కొన్ని సంఘ‌ట‌న‌ల్లో లాక‌ర్ల‌లో పోయిన వ‌స్తువుల‌కు బ్యాంకులు త‌మ వినియోగ‌దారుల‌కు న‌ష్ట‌ప‌రిహారాన్ని చెల్లించాయి.

భ‌ద్ర‌త‌ గురించిన చ‌ర్య‌లు - లాక‌ర్ అద్దెకు తీసుకునే నియ‌మ‌నిబంధ‌న‌ల‌పై క్షుణ్ణంగా తెలుసుకోవాలి. వీటికి సంబంధించి ద‌స్త్రాలను ఒక‌టికి రెండు సార్లు చ‌దువుకోవాలి. లాక‌ర్‌లో ఉంచాల‌నుకునే వ‌స్తువుల జాబితాను సిద్ధం చేసుకోండి. ఆ త‌ర్వాత వాటి విలువ‌ను లెక్క‌కట్టండి. వ‌స్తువుల‌ను కోల్పోతే అందుకు త‌గిన ప‌రిహారం దొరికే అవ‌కాశం ఉంటుంది. ముందుగా బ్యాంకు ఉద్యోగి మాస్ట‌ర్ కీ ఉప‌యోగించాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాతే మీ తాళం చెవితో లాక‌ర్‌ను తెరిచేందుకు వీల‌వుతుంది. సద‌రు బ్యాంకు ఉద్యోగి వెళ్లిపోయాకే లాక‌ర్‌ను తెర‌వడం మంచిది. ప‌ని అయిపోయాక లాక‌ర్ ను స‌రిగ్గా మూసిందీ లేనిదీ చూసుకోవాలి. లాక‌ర్ దొంగ‌త‌నం కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల గురించి…సీసీటీవీ కెమెరాలు - మీరు లాక‌ర్ స‌దుపాయాన్ని పొందాల‌నుకునే లేదా ఇదివ‌ర‌కే లాక‌ర్ ఉన్న బ్యాంకు చుట్టుప‌క్క‌ల ప‌టిష్ట‌మైన సీసీటీవీ కెమెరాలు ఉన్నాయో లేవో గ‌మ‌నించండి. దొంగ‌తనాలు లాంటివి జ‌రిగిన‌ప్పుడు నిందితుల‌ను ప‌ట్టుకునేందుకు ద‌ర్యాప్తు బృందానికి ప‌ని సులువు అవ్వ‌డ‌మే కాకుండా మీ వ‌స్తువులు తిరిగి వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌.

ర‌శీదు - కావాలంటే ఏమేం వ‌స్తువులు లాక‌ర్లో పెట్టామో ర‌శీదుగా పొందొచ్చు. అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్న‌ప్పుడు ర‌శీదు ఉంటే ప‌రిహారం సుల‌భంగా పొందొచ్చు. సెక్యూరిటీ త‌నికీ - ఆర్‌బీఐ నిబంధ‌న‌ల ప్ర‌కారం సెక్యూరిటీ త‌నిఖీను ప‌టిష్టంగా ఉంచారో లేదో అనే విష‌యాన్ని బ్యాంకు మేనేజ‌ర్ల‌ను అడిగి తెలుసుకోవాలి. ప‌రిస‌రాల త‌నిఖీ - అప్పుడ‌ప్పుడు ప‌రిస‌ర ప్రాంతాల‌ను బ్యాంకులు త‌నిఖీ చేస్తున్నాయా లేదా అనే విష‌యాన్ని తెలుసుకోవాలి. త‌ర‌చూ సంద‌ర్శ‌న‌ - వినియోగ‌దారులు లాక‌ర్‌ను త‌ర‌చూ సంద‌ర్శిస్తూ అందులో వ‌స్తువుల‌న్నీ భ‌ద్రంగా ఉన్నాయా లేవా అన్న దాన్ని చూస్తుండాలి. లాక‌ర్లలో ఏముంద‌న్న విష‌యంపైన బ్యాంకులకు తెలియ‌దు కాబ‌ట్టి వాటికి బీమా చేయించ‌వు. మీ లాక‌ర్లో ఉన్న‌వస్తువుల‌కు మీరే విడిగా బీమా తీసుకోవ‌డం మంచిది. ఇది అంత‌గా ఖ‌రీదు కాదు. ఒక వేళ బీమా తీసుకోద‌ల్చుకుంటే విలువైన వ‌స్తువుల‌ను బ్యాంకు లాక‌ర్లో పెట్టినా, ఇంట్లో పెట్టినా ఒక‌టే. ఇంట్లోనే భ‌ద్రంగా బీరువా లాక‌ర్‌లో పెట్టుకుంటే బ్యాంకున‌కు చెల్లించే ఛార్జీలను త‌గ్గించుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని