SBI car loan: ఎస్‌బీఐ కార్ లోన్‌.. ఆన్‌లైన్‌లో ఇలా అప్లయ్‌ చేయండి..

యోనో యాప్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి 25 బేసిస్ పాయింట్లు వ‌డ్డీ రాయితీ ల‌భిస్తుంది.

Updated : 04 Oct 2021 15:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భార‌తీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగ‌దారుల అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు క‌స్ట‌మైజ్డ్ కారు రుణాల‌ను అందిస్తోంది. సాధార‌ణ కారు రుణంతోపాటు, స‌ర్టిఫైడ్ ప్రీ-ఓన్డ్ కారు రుణం, ఇప్ప‌టికే బ్యాంకు నుంచి గృహ రుణం పొందిన వారికి ఎస్‌బీఐ లోయ‌ల్టీ కారు లోన్‌, ట‌ర్మ్ డిపాజిట్ క‌స్ట‌మ‌ర్ల‌కు అస్యూర్డ్ కారు లోన్, ఎల‌క్ట్రిక్ కార్ల కొనుగోలుదారుల‌కు గ్రీన్ కారు లోన్‌.. ఇలా వివిధ ర‌కాల రుణాల‌ను ఇస్తోంది. 

ఎస్‌బీఐ కారు రుణాల‌ ఫీచ‌ర్లు, ప్ర‌యోజ‌నాలు..
* త‌క్కువ వ‌డ్డీరేట్లు, ఈఎమ్ఐ
* తిరిగి చెల్లించేందుకు సుదీర్ఘ కాల‌వ్య‌వ‌ధి (7 సంవ‌త్స‌రాలు)
* జీరో ప్రాసెసింగ్ ఫీజు
* ఆన్‌-రోడ్ ధ‌ర‌పై  ఫైనాన్సింగ్‌ స‌దుపాయం
* ఆన్‌-రోడ్ ధ‌ర‌లో రిజిస్ట్రేష‌న్, ఇన్సురెన్స్ కూడా ఉంటాయి.
* ఆన్‌-రోడ్ ధ‌ర‌పై 90శాతం రుణం
* రోజువారీగా త‌గ్గిన బ్యాలెన్స్‌పై వ‌డ్డీ లెక్కిస్తారు.
* కొత్త పాసింజర్‌ కార్ల‌తో పాటు, మ‌ల్టీ-యుటిలిటి (ఎమ్‌యూవీ), ఎస్‌యూవీ వాహ‌నాల కొనుగోలుకు అనుమ‌తిస్తుంది.
* అడ్వాన్స్ ఈఎంఐ చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు. 

ఎస్‌బీఐ కార్ లోన్ వ‌డ్డీ రేటు, కాల‌ప‌రిమితి..  

7.75 శాతం వార్షిక వ‌డ్డీ రేటుతో ఎస్‌బీఐ కారు రుణాల‌ను అందిస్తోంది. యోనో యాప్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారికి 25 బేసిస్ పాయింట్లు వ‌డ్డీ రాయితీ ల‌భిస్తుంది. అంటే 7.50శాతం వార్షిక వ‌డ్డీతో రుణం పొందొచ్చు. 3 నుంచి 7 సంవ‌త్స‌రాలు సుదీర్ఘ కాల‌ప‌రిమితో రుణాలు అందిస్తుంది. 

ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.. 

* వినియోగ‌దారులు ఎస్‌బీఐ కారు రుణం లింక్‌ను క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.
* లింక్‌ను క్లిక్ చేయ‌డం ద్వారా ఓపెన్ అయిన పేజీలో కావ‌ల‌సిన వివ‌రాలు ఇవ్వాలి.
* వినియోగ‌దారులు వారి రుణ అర్హ‌త‌ను చెక్ చేసుకుని లోన్ కొటేష‌న్ పొందొచ్చు. 

ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా.. 

* ముందుగా యోనో యాప్ ఖాతాకు లాగిన్ అవ్వాలి. 
* హోమ్ పేజీపైన ఎడ‌మ‌వైపు ఉన్న మెనూ (మూడు గీత‌లు)పై క్లిక్ చేసి లోన్స్ ఆప్ష‌న్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. 
* ఇందులో ఉన్న కారు రుణాల‌పై క్లిక్ చేయాలి.
* మీ రుణ అర్హ‌త‌ను చెక్ చేసి ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి.
* ఇక్క‌డ కావ‌ల‌సిన‌ వివ‌రాలు ఇచ్చి రుణం కోసం అభ్యర్థించాలి.
* అర్హ‌త క‌లిగిన రుణ మొత్తాన్ని తెలుసుకున్న త‌రువాత ద‌ర‌ఖాస్తు ఫారం నింపి, దాంతో పాటు కావ‌ల‌సిన ఇత‌ర ప‌త్రాల‌ను కూడా అప్‌లోడ్ చేసి స‌బ్మిట్ చేస్తే స‌రిపోతుంది. 
* మీకు రిఫ‌రెన్స్ నంబర్‌ వస్తుంది. ఎస్‌బీఐ ఎగ్జిక్యూటివ్‌ త్వ‌ర‌లోనే మీకు కాల్ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని