ఈటీఎఫ్‌ల‌ను ఎలా ఎంచుకోవాలి

లిక్విడిటీ ఎక్కువ‌గా ఉండాలి..ట్రాకింగ్ ఎర్ర‌ర్ స్వ‌ల్పంగా ఉండాలి..​​​​​​...

Published : 19 Dec 2020 13:12 IST

లిక్విడిటీ ఎక్కువ‌గా ఉండాలి..ట్రాకింగ్ ఎర్ర‌ర్ స్వ‌ల్పంగా ఉండాలి..​​​​​​​

ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు( ఈటీఎఫ్‌లు) కూడా మ్యూచువ‌ల్ ఫండ్ల వ‌ర్గానికి చెందిన‌వే. వీటి ప్ర‌త్యేక‌త ఏంటంటే ఒక వైపు మ్యూచువ‌ల్ ఫండ్ యూనిట్ లాగా, మ‌రో వైపు షేరులా ఎక్స్ఛేంజీలో లిస్ట‌యి ఉంటాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా చూస్తే ఎక్కువ మంది ఎంచుకునే పెట్టుబ‌డి ప‌థ‌కాల్లో ఈటీఎఫ్ ఒకటి. యూఎస్ లో, టాప్ -25 ట్రేడెడ్ సెక్యురిటీలలో తొమ్మిది ఈటీఎఫ్ లే. న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌వైఎస్ఈ) లో టాప్ ట్రేడెడ్ సెక్యూరిటీ SPDR ,S & P 500 ETF, రోజువారీ ట్రేడింగ్ విలువ‌ $ 20 బిలియన్ల వ‌ర‌కూ ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎక్కువ మంది ఈటీఎఫ్ ల్లో పెట్టుబ‌డి చేస్తుంటారు. దీనికి కార‌ణం అక్క‌డ మార్కెట్లు ఎఫీషియంట్ అని భావిస్తుంటారు ఎఫీషియంట్ మార్కెట్ల‌లో బెంచ్‌మార్క్‌ను మించి రాబ‌డి పొంద‌డం దాదాపు అసాధ్యం. ఎఫీషియంట్ మార్కెట్ థియ‌రీ ప్ర‌కారం మార్కెట్లో వ‌చ్చే ప్రతీ విష‌యం అప్ప‌టికే మార్కెట్లో ఇమిడిఉంటుంద‌ని భావిస్తారు. ఎఫీషియంట్ మార్కెట్ల‌లో ఫండ్ మేనేజ‌ర్లు తీసుకోవాల్సిన నిర్ణ‌యాలు, పాటించాల్సిన ప‌ద్ద‌తులు ఏమీ ఉండ‌వ‌ని భావ‌న‌.కాబ‌ట్టి ఎక్కువ మంది మ‌దుప‌ర్లు ఇండెక్స్ ఆధారిత ఈటీఎఫ్‌ల్లో పెట్టుబ‌డులు చేస్తుంటారు. మ‌న దేశంలో కూడా చాలా ర‌కాల ఈటీఎఫ్ లు అందుబాటులో ఉన్నాయి. నిఫ్టీ, సెన్సెక్స్ ఆధారిత ఇండెక్స్ ఫండ్లు నిఫ్టీ 100 ఎస్ అండ్ పీ బీఎస్ఈ 100 ఈటీఎఫ్ మొద‌లైన‌వి. సెక్టార్, థీమ్ ఆధారిత, వ్యూహాత్మ‌కంగా అంటే డివిడెండ్ అవ‌కాశాలు,మౌలిక‌రంగాల‌కు సంబంధించిన ఈటీఎఫ్‌లు మ‌నీ మార్కెట్ ఈటీఎఫ్‌లు, ప్ర‌భుత్వ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డి చేసే ఈటీఎఫ్ లు, క‌మోడిటీ గోల్డ్ ఈటీఎఫ్‌లు అందుబాటులో ఉంటాయి

ఈటీఎఫ్‌ ప్ర‌త్యేక‌త‌ల గురించి చెప్పాలంటే:

  • ఈటీఎఫ్ ఎక్స్చేంజీలో ట్రేడ్ అవుతుంది.
  • పెట్టుబ‌డిలో వైవిధ్య‌త ఉంటుంది.
  • రియ‌ల్ టైమ్ ఎన్ఏవీ ప‌ద్ధ‌తి అందుబాటులో ఉంటుంది.

ఈటీఎఫ్ ల‌ను ఎంచుకునేందుకు ప్రామాణికంగా తీసుకోవాల్సిన కొన్ని విష‌యాల గురించి తెలుసుకుందాం.

పెట్టుబ‌డి వ‌ర్గం:

అందుబాటులో ఉన్న వివిధ పెట్టుబ‌డి వ‌ర్గాల‌కు చెందిన ఈటీఎఫ్ ల్లో త‌మ‌కు అనుగుణంగా ఉండే పెట్టుబ‌డి వ‌ర్గానికి చెందిన ఈటీఎఫ్ మ‌దుప‌ర్లు ఎంచుకోవాలి. వైవిధ్య‌త ఎక్కువ‌గా ఉన్న బ్రాడ్ ఇండెక్స్ ఆధారిత ఈటీఎఫ్ లో పెట్టుబ‌డి చేయడం ఏదైనా రంగాల‌కు చెందిన‌ సెక్టార్ ఈటీఎఫ్ లో పెట్టుబ‌డి చేయ‌డం కంటే మంచిది.

లిక్విడిటీ ఎక్కువ‌గా ఉండాలి:

ఈటీఎఫ్ లో పెట్టుబ‌డి చేసేట‌పుడు లిక్విడిటీ ఉండే విధంగా చూసుకోవాలి. ట్రేడింగ్ యాక్టివ్ గా జ‌రిగే ఈటీఎఫ్ ల‌ను ఎంచుకోవాలి. ఎక్స్ఛేంజీ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు యూనిట్ల‌ను విక్ర‌యించ‌వ‌చ్చు.

ట్రాకింగ్ ఎర్ర‌ర్ స్వ‌ల్పంగా ఉండాలి:

ఈటీఎఫ్ ప‌నితీరుకు కొల‌మానంగా ట్రాకింగ్ ఎర్ర‌ర్ ను ప‌రిగ‌ణిస్తారు. ఇండీస్ ఆధారంగా ఉంటాయి కాబ‌ట్టి వాటి ప‌నితీరు ను బెంచ్ మార్క్ తో పోల్చిచూస్తారు. ఒక్క మాట‌లో చెప్పాలంటే ఈటీఎఫ్ అనుక‌రిస్తున్న‌ సూచీకి, ఈటీఎఫ్ కు మ‌ధ్య రాబ‌డిలో గ‌ల తేడానే ట్రాకింగ్ ఎర్ర‌ర్ అంటారు. ఎందుకంటే ఈటీఎఫ్ పై వ‌చ్చే రాబ‌డి సూచీపై వ‌చ్చిన రాబ‌డికి ద‌గ్గ‌ర‌గా ఉంటుంది. మ‌దుప‌ర్లు ఈటీఎఫ్‌లో పెట్టుబ‌డి చేసేముందు దీర్ఘ‌కాలంలో నూ త‌క్కువ ట్రాకింగ్ ఎర్ర‌ర్ ఉండే వాటిని ఎంచుకోవాలి.

ఇంపాక్ట్ కాస్ట్ త‌క్కువ ఉండాలి:

ఇంపాక్ట్ కాస్ట్ అంటే ఎక్స్ఛేంజీ ద్వారా క్ర‌య‌విక్ర‌యాలు జ‌రిపేట‌పుడు ప‌రోక్షంగా చెల్లించే రుసుము. ఈటీఎఫ్ కు ఎక్కువ లిక్విడిటీ ఉంటే త‌క్కువ ఇంపాక్ట్ కాస్ట్ ఉంటుంది. త‌క్కువ లిక్విడిటీ ఉంటే ఎక్కువ ఇంపాక్ట్ కాస్ట్ ఉంటుంది. ఇంపాక్ట్ కాస్ట్ నేరుగా కాకుండా అంత‌ర్లీనంగా ప‌డే చార్జీలు. ఇంపాక్ట్ కాస్ట్ త‌క్కువ‌గా ఉన్న వాటిని ఎంచుకోవాలి.

నిర్వ‌హాణర‌సుం త‌క్కువగా ఉండేవి ఎంచుకోవాలి:

ఈటీఎఫ్‌లు వార్షిక రుసుమును** ఎక్స్పెన్స్ నిష్ప‌త్తి**లో చూపిస్తారు. దీంట్లో ఫండ్ నిర్వ‌హ‌ణ ఖ‌ర్చులైన నిర్వ‌హాణ బృందం ఫీజు, అడ్మినిస్ట్రేటివ్, ఆప‌రేటింగ్ ఖ‌ర్చులు ఇంకా ఇత‌ర ఖ‌ర్చులు ఏవైనా ఉంటే వాటిని చూపిస్తారు. ఈటీఎఫ్ ల‌ను ఎలా ఎంచుకోవాలిప్ర‌స్తుతం నిఫ్టీ,సెన్సెక్స్ ఇండెక్స్ ఆధారిత ఈటీఎఫ్ లు 0.5 - 1 % రుసుము వ‌సూలు చేస్తున్నారు. బ్యాంకింగ్ ఈటీఎఫ్ లు 1.5 - 2% వ‌సూలు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు