మీరు ప‌నిచేసే సంస్థ ఆరోగ్య బీమా అందిస్తుందా? ఎలా క్లెయిమ్ చేయాలో తెలుసుకోండి.

కార్పొరేట్ ఆరోగ్య బీమా పాలసీలలో సహ-చెల్లింపు, గది-అద్దె పరిమితులు వంటి కొన్ని నిబంధ‌న‌లు ఉంటాయి. కాబ‌ట్టి పాల‌సీ మీ అవ‌స‌రాల‌కు స‌రిపోతుందో.. లేదో తెలుసుకునేందుకు పాల‌సి ప‌త్రాల‌ను పూర్తిగా చ‌ద‌వండి. 

Updated : 21 Sep 2021 16:35 IST


క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు తగిన గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలను రూపొందించాయి.  సంస్థ‌లు గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ కింద ఉద్యోగులకు క‌వ‌రేజ్ చేస్తుండగా, దీనికి కొన్ని ఫార్మాలిటీలు, ప్రొఫైల్స్ పూర్తి చేయాలి. ఇందులో స‌రైన వివరాలు అందించ‌క‌పోతే మీకు అవసరమైన సమయంలో హామీ చెల్లించకపోవచ్చు. అందువల్ల గ్రూప్ ఆరోగ్య బీమా క్లెయిమ్‌ కోసం దాఖలు చేయడానికి ముందు మీరు ఈ నాలుగు దశలను అనుసరించాలి.

1. కుటుంబ వివ‌రాలు అప్‌డేట్ చేయాలి.. 
మీ ఉద్యోగి ఐడీని స్వీకరించిన తర్వాత మీరు చేయవలసిన మొదటి పని కంపెనీ పోర్టల్‌లో మీ కుటుంబ సమాచారాన్ని అప్‌డేట్ చేయ‌డం. మీరు అవసరమైన సమాచారాన్ని నమోదు చేయకపోతే క్లెయిమ్ చేసుకునే స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర‌వుతాయి. అందుకే ఈ విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాలి.

2. ఇ-కార్డ్‌..
మీ ఆరోగ్య బీమా పాలసీ జారీ అయిన తర్వాత సంస్థ మీకు థ‌ర్డ్ పార్టీ అడ్మినిస్ర్టేట‌ర్ (టీపీఏ) కార్డు ఇస్తారు. మీరు ఆసుపత్రిలో నగదు రహిత సదుపాయాన్ని ఉపయోగించాలనుకుంటే, ఈ కార్డు ఉపయోగపడుతుంది. దీంతో పాటు క్లెయిమ్ కోసం మీ సంస్థ గుర్తింపు కార్డు ఉండాలి.  

3. క‌వ‌రేజ్ ఎంత‌.. తెలుసుకోండి..
ఏదైనా పాలసీని కొనుగోలు చేసేటప్పుడు పాలసీ పత్రాన్ని పూర్తిగా చదవడం చాలా ముఖ్యం. చివరి నిమిషంలో ఇబ్బందులు ప‌డ‌కుండా, ముందే  మీరు మొదట కవరేజ్ ల‌భించే, క‌వ‌రేజ్ లేని అంశాల‌ను తెలుసుకోవాలి. కార్పొరేట్ ఆరోగ్య బీమా పాలసీలలో సహ-చెల్లింపు నిబంధనలు, గది-అద్దె పరిమితులు వంటివి ఉంటాయి. ఆ విష‌యాల్లో స్ప‌ష్ట‌త ఉండాలి.
 
4. నెట్‌వర్క్ ఆస్పత్రుల జాబితా..
సాధారణంగా, బీమా సంస్థలు తమ వినియోగదారులకు నగదు రహిత సేవలను అందించడానికి ఎంచుకున్న ఆస్పత్రుల సమూహంతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఈ ఆసుపత్రులను ఎంపానెల్డ్ నెట్‌వర్క్ ఆస్పత్రులుగా సూచిస్తారు. పాలసీ పత్రాన్ని చదువుతున్నప్పుడే ఈ ఆసుప‌త్రుల గురించి తెలుసుకోవాలి.

క్లెయిమ్‌ ఎలా దాఖలు చేయాలి?
బీమా చేసినవారు నెట్‌వర్క్ ఆసుపత్రిలో చికిత్స పొందాలి.  కుటుంబ సభ్యులు కూడా ఆసుపత్రికి ఆరోగ్య బీమా పాలసీ, టీపీఏ ఇ-కార్డు వివరాలను అందించాలి. వారికి కూడా పాల‌సీ గురించి పూర్తి వివ‌రాలు తెలిసి ఉండాలి. 

నెట్‌వర్క్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత, మెడికల్ బిల్లులకు సంబంధించిన అన్ని ఖర్చులు ఆసుపత్రి ద్వారా బీమా సంస్థ‌కు లేదా టీపీఏకు పంపబడతాయి. అప్పుడు థ‌ర్డ్ పార్టీ ఏజెన్సీ ఖర్చులను అంచనా వేస్తుంది, బీమా సంస్థ‌ క్లెయిమ్‌ను ప‌రిష్క‌రిస్తుంది. సంస్థ గ్రూప్ బీమా పాల‌సీ విష‌యంలో క్లెయిమ్ ప్రక్రియ, ఆమోదం, పరిష్కారం వంటి స‌మాచారాన్ని మీ సంస్థ‌కు తెలియ‌జేయాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు