పిపిఎఫ్ ఖాతాలో ఆన్‌లైన్‌లో డ‌బ్బు జ‌మ చేయ‌డం ఎలా ?

పిపిఎఫ్తో స‌హా 9 ర‌కాల పొదుపు ప‌థ‌కాల‌ను పోస్ట‌ల్ శాఖ అందిస్తుంది.

Updated : 06 Jan 2021 14:42 IST

ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్‌), ప‌న్ను ఆదా ప‌థ‌కం. దీనిపై ప్రస్తుతానికి వడ్డీ ఏడాదికి 7.1%  ఉంది. చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్లు త్రైమాసిక ప్రాతిప‌దిక‌న స‌వ‌రించ‌బ‌డ‌తాయి.  పీపీఎఫ్‌తో స‌హా చిన్న పొదుపు ప‌థ‌కాల వ‌డ్డీ రేట్ల‌ను ఈ జ‌న‌వ‌రి నుండి మార్చి త్రైమాసికానికి కేంద్ర ప్ర‌భుత్వం మార్చ‌లేదు. పీపీఎఫ్ 15 సంవ‌త్స‌రాల‌కు మెచ్యూర్ అవుతుంది. ఖాతాను యాక్టివ్‌గా ఉంచ‌డానికి సంవ‌త్స‌రానికి క‌నీసం రూ. 500 డిపాజిట్ అవ‌స‌రం.

పోస్ట్ ఆఫీస్ ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పిపిఎఫ్‌)తో స‌హా 9 ర‌కాల పొదుపు ప‌థ‌కాల‌ను పోస్ట‌ల్ శాఖ అందిస్తుంది. ఈ ప‌థ‌కాలు చాలా వ‌ర‌కు ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80సి కింద ప‌న్ను రాయితీ ఉంది. పీపీఎఫ్‌ ఖాతా తెర‌వ‌డానికి, మీరు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపిపిబి) యాప్‌తో ఆన్‌లైన్‌లో నిర్వ‌హించ‌గ‌లిగిన త‌ర్వాత‌, పోస్ట్ ఆఫీస్‌ను ఒక‌సారి సంద‌ర్శించాలి.

మీ పోస్ట్ ఆఫీస్ పిపిఎఫ్ ఖాతాలో డ‌బ్బును ఆన్‌లైన్‌లో బ‌దిలీ చేసే ప్ర‌క్రియ తెలుసుకుందాం:

1) మీ బ్యాంక్ ఖాతా నుండి ఐపీపీబీ ఖాతాకు డ‌బ్బును యాడ్ చేయండి.

2) `డిఓపి` ప్రొడ‌క్ట్స్‌కు వెళ్లండి. పిపిఎఫ్ ఎంచుకోండి.

3) మీ పిపిఎఫ్ ఖాతా నంబ‌ర్‌ను రాసి, ఆపై క‌స్ట‌మ‌ర్ ఐడిని `డిఓపి` చేయండి.

4) వాయిదాల వ్య‌వ‌ధి మ‌రియు మొత్తాన్ని ఎంచుకోండి.

ఐపీపీబీ మొబైల్ అప్లికేష‌న్ ద్వారా విజ‌య‌వంతంగా బ‌దిలీ అయింద‌ని మీకు తెలియ‌జేస్తుంది.

డాక్ పే - డిజిట‌ల్ చెల్లింపుల యాప్‌:

గ‌త నెల‌లో ప్ర‌భుత్వం డాక్ పే డిజిట‌ల్ చెల్లింపుల యాప్‌ను ప్రారంభించింది. దీన్ని పోస్ట్ ఆఫీస్ మ‌రియు ఐపీపీబీ క‌స్ట‌మ‌ర్లు కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. డాక్‌పే ఇండియా పోస్ట్, ఐపీపీబీ అందించే డిజిట‌ల్ ఫైనాన్షియ‌ల్‌, అసిస్టెడ్ బ్యాంకింగ్ సేవ‌ల‌ను అందిస్తుంది. ఇది డ‌బ్బు పంప‌డం, క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయ‌డం, వ్యాపారుల‌కు డిజిట‌ల్‌గా చెల్లింపు వంటి సేవ‌ల‌ను కూడా సుల‌భ‌త‌రం చేస్తుంది. ఇది దేశంలోని ఏ బ్యాంకుతోనైనా వినియోగ‌దారుల‌కు ఇంట‌ర్‌పెర‌బుల్ బ్యాంకింగ్ సేవ‌ల‌ను అందిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని