ఫిర్యాదు చేసినా.. మీ బ్యాంక్‌ ప‌ట్టించుకోవ‌డం లేదా? 


ఆర్థిక కార్య‌కాలాపాలు చాలా వ‌ర‌కు బ్యాంకుల‌తో ముడిప‌డి ఉంటాయి. అందువ‌ల్ల ఈ రోజుల్లో దాదాపు ప్ర‌తీ ఒక్క‌రికీ ఎదో బ్యాంకులో ఖాతా త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలతోపాటు.. వివిధ రకాల ఆర్థికేతర సేవలనూ బ్యాంకులు అందిస్తున్నాయి. ఈ లావాదేవీలు, సేవలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఏర్పడినా, లోపాలు ఉన్నా వాటి ప‌రిష్కారం కోసం  ముందుగా బ్యాంకును సంప్ర‌దించి ఫిర్యాదు చేయాలి. ఒక‌వేళ మీ ఫిర్యాదుకు బ్యాంకు త‌గిన రీతిలో స్పందించ‌క‌పోయినా, స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపించ‌క‌పోయినా లేదా సూచించిన పరిష్కారం సంతృప్తిగా లేకున్నా ఉన్నతి స్థాయిలో ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. 

మొద‌టిగా మీ బ్యాంకును సంప్ర‌దించి ఫిర్యాదు రిజ‌స్ట‌ర్ చేయాలి.  సరైన కారణం చూపకుండా ఖాతా తెరిచేందుకు నిరాకరించడం, ఏటీఎం లలో లావాదేవీలు జరిపేటప్పుడు, అధీకృతం కాని ఎల‌క్ట్రానిక్ లావాదేవీలు, చెక్కులు, బిల్లులు చెల్లింపులలో జాప్యం, నిరాకరణ, ఖాతాదారునికి ముందుగా సమాచారం ఇవ్వకుండా రుసుములు, సర్వీస్ చార్జీలు విధించడం, త‌ప్పుడు బీమా పాల‌సీలు అమ్మ‌జూప‌డం, వ‌ద్దు అని వారించినా మ్యూచువ‌ల్ ఫండ్లు ఖాతాదారుల‌తో కొనుగోలు చేయించ‌డం, రుణాలు, డిపాజిట్ల‌కు సంబంధించి త‌ప్పుడు స‌మాచారం ఇవ్వడం, మొబైల్ లావాదేవీల సంబంధిత స‌మ‌స్య‌లు మొద‌లైన‌ విష‌యాల‌పై ఫిర్యాదులు న‌మోదు చేయ‌వ‌చ్చు. 

అంబుడ్స్‌మెన్ ఫిర్యాదుల‌ను ఎప్పుడు స్వీక‌రించ‌దు..
మీరు ఇచ్చిన ఫిర్యాదుకు బ్యాంకు వారు నెల రోజుల లోపు స్పందించ‌క‌పోతే అంబుడ్స్‌మెన్‌ను సంప్ర‌దించాలి. ఒక‌వేళ మీరు ముందుగా బ్యాంకుకు ఫిర్యాదు చేయ‌కుండా నేరుగా అంబుడ్స్‌మెన్ సంప్ర‌దించినా,  అదేవిధంగా బ్యాంకు మీకు స‌మాధానం ఇచ్చిన తేదీ నుంచి ఒక సంవ‌త్స‌రం త‌రువాత మీరు అంబుడ్స్‌మెన్‌ను ఆశ్ర‌యించినా, వారు మీ ఫిర్యాదును స్వీక‌రించ‌రు. అంతేకాకుండా మీ ఫిర్యాదు ఏదైనా వినియోగ‌దారుల‌ న్యాయ‌స్థానంలో పెండింగ్ ఉన్న‌ప్పుడు కూడా అంబుడ్స్‌మెన్ మీ ఫిర్యాదుల‌ను తీసుకునేందుకు ఆమోదించ‌రు. 

ఫిర్యాదు న‌మోదు ప‌క్రియ‌:
వినియోగ‌దారుల స‌మ‌స్య‌ల‌ను, వారి నుంచి వ‌చ్చే ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించేందుకు ఆర్‌బీఐ, బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్‌ను నియ‌మించింది. బ్యాంకింగ్ సేవ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లను ప‌రిష్క‌రించేందుకు ఎటువంటి రుస‌ము చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం భార‌త‌దేశంలో 22 బ్యాంకింగ్ అంబుడ్స్‌మెన్ కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. 

ఫిర్యాదులు చేసేందుకు ఓ ఫార్మాట్‌ను ఆర్‌బీఐ రూపొందించింది. అయితే, స‌మాచారం స‌రైన‌దిగా ఉన్నంత వ‌ర‌కూ ఎలాంటి ఫార్మెట్‌లోనైనా ఫిర్యాదు చేసేందుకు అవ‌కాశం ఉంది. క‌చ్చితంగా ఆర్‌బీఐ సూచించిన ఫార్మెట్‌నే అనుస‌రించాల‌నే నియ‌మ‌మేమీ లేదు. ఒక తెల్ల‌టి కాగితంపై మీ ఫిర్యాదు రాసి, ఏ బ్యాంకుకు వ్య‌తిరేకంగా ఫిర్యాదు చేయాల‌నుకుంటున్నారో ఆ బ్యాంకు ఏ అంబుడ్స్‌మెన్ కేంద్రం ప‌రిధిలోకి వ‌స్తుందో చూసుకుని ఫిర్యాదు చేయాలి. క్రెడిట్ కార్డు వంటి కేంద్రీకృత కార్య‌క‌లాపాల‌కు సంబంధించి మీరు నివ‌సిస్తున్న బిల్డింగ్ చిరునామా ఏ అంబుడ్స్‌మెన్ అధికారిక ప‌రిధిలోకి వ‌స్తుందో చూసుకుని అక్క‌డ ఫిర్యాదు న‌మోదు చేయాలి. 

ఆన్‌లైన్ ద్వారా..
ఆన్‌లైన్లో కూడా ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.  మీరు కంప్లైంట్ చేయాల‌నుకుంటున్న బ్యాంకు పేరు, బ్రాంచ్‌, చిరునామా, ఏ కేట‌గిరికి సంబంధించి స‌మ‌స్య ఎదుర్కుటుంన్నారు.. త‌దిత‌ర వివ‌రాల‌ను వ్రాసి ఆన్‌లైన్‌లో స‌బ్మిట్ చేయ‌వ‌చ్చు. ఇందులో మీ పేరు, ఫోన్ నెంబ‌రు, చిరునామాను కూడా జ‌త‌చేయాలి. ఇది న‌గ‌దుకు సంబంధించిన స‌మ‌స్య అయితే ఎంత మొత్తం.. అనే వివ‌రాల‌ను కూడా అదే ఫిర్యాదులో తెల‌పాలి. ఈ-మెయిల్ ద్వారా కూడా కంప్లైంట్ ఫైల్ చేయోచ్చు. అయితే ఒక విష‌యం గుర్తించుకోవాలి. స‌మ‌స్య పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా ప‌రిష్కారం కాక‌పోవ‌చ్చు. స‌మ‌స్య తీవ్ర‌త ఆధారంగా అంబుడ్స్‌మెన్ కార్యాల‌యం వారు మిమ్మ‌ల్ని సంప్ర‌దించ‌వ‌చ్చు. స‌మ‌స్య క్లిష్ట‌త ఆధారంగా లిఖిత పూర్వ‌క ఫిర్యాదుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. 

న‌ష్ట‌ప‌రిహారం..
అంబుడ్స్‌మెన్ కేంద్రంలో నిర్ధిష్ట ఫిర్యాదు చేసే ముందు, అదే కంప్లైట్‌తో ఇంత‌కు మునుపు బ్యాంకును సంప్ర‌దించ‌న‌ట్లు ఆధారాలు ఉండాలి. ఒక ఫిర్యాదుకు సంబంధించి గ‌రిష్టంగా రూ.20 ల‌క్ష‌లు న‌ష్ట‌ప‌రిహారం ఇచ్చే అధికారం అంబుడ్స్‌మెన్‌కు ఉంటుంది. ఖాతాదారుడు న‌ష్ట‌పోయిన మొత్తం లేదా రూ.20 ల‌క్ష‌ల‌లో ఏది త‌క్కువైతే ఆ మొత్తాన్ని నష్ట‌ప‌రిహారంగా ఇస్తారు. కంప్లైట్ చేసిన‌వారు న‌ష్ట‌పోయిన స‌మ‌యం, మాన‌సిక ఆందోళ‌న మొద‌లైన వాటికి కోల్పోయిన మొత్తం కంటే రూ.1 ల‌క్ష అద‌నంగా న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌మ‌ని ఆదేశించ‌వ‌చ్చు. 

ఒక‌సారి మీ ఫిర్యాదు తీసుకున్న త‌రువాత మీకు, బ్యాంకుకు మ‌ధ్య సెటిల్‌మెంట్ చేసేందుకు అంబుడ్స్‌మెన్ ప్ర‌య‌త్నిస్తుంది. స‌మ‌స్య ఒక నెల‌లోపు ప‌రిష్కారం కాక‌పోతే, ఫిర్యాదు చేసిన వ్య‌క్తి, బ్యాంకు వివ‌ర‌ణను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని అవార్డు జారీ చేస్తుంది. 

ప‌రిష్కారం కాక‌పోతే..
అంబుడ్స్‌మెన్ సూచించిన ప‌రిష్కారంతో సంతృప్తి చెంద‌క పోతే ఈ ప‌థ‌కం కింద ఫిర్యాదు చేసిన వ్య‌క్తి, బ్యాంకు ఉభ‌యులు అప్పిలేట్ అధికారికి అప్పీల్ చేసుకోవ‌చ్చు. ఇందుకు అంబుడ్స్‌మెన్ నిర్థిష్ట కేసు గురించి నిర్ణ‌యం తీసుకున్న రోజు నుంచి 30 రోజుల స‌మ‌యం ఉంటుంది. వినియోగ‌దారుల కోర్టును కూడా ఆశ్ర‌యించ‌వ‌చ్చు. 


 

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని