Gold: బంగారం అమ్ముతున్నారా.. మంచి ధ‌ర రావాలంటే 

బంగారం కొనుగోలు చేసేప్పుడు స్వ‌చ్చ‌త‌ను తెలిపే హాల్‌మార్క్ గుర్తున్న ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేస్తే, వాటిని విక్రయించడం సుల‌భం అవుతుంది. 

Updated : 13 Jul 2021 18:50 IST

ఆర్ధిక ప్ర‌ణాళిక‌లో బంగారం కూడా భాగ‌మే. అత్య‌వ‌స‌ర స‌మ‌యంలో డ‌బ్బు కావాల్సి వ‌చ్చిన‌ప్ప‌డు బంగారం తాక‌ట్టుపెట్టి రుణం తీసుకోవ‌డం లేదా అమ్మ‌డం చేస్తుంటారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆర్థిక అవ‌స‌రాల కోసం కొంత మంది బంగారాన్ని విక్ర‌యించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే అమ్మేముందు కొన్ని విష‌యాలు గుర్తుపెట్టుకోండి.

* విక్ర‌యించే ముందు బంగారం బ‌రువు, స్వచ్ఛతను తెలుసుకోండి.  కొనుగోలు చేసిన‌ప్పుడు ఇచ్చే ర‌శీదుల‌ను భ‌ద్ర‌ప‌రుచుకోవ‌డం మంచిది. ఇలాంటి స‌మ‌యంలో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. 

* ర‌శీదులు లేక‌పోయానా ప్ర‌స్తుతం ఉన్న బ‌రువు, స్వ‌చ్చ‌త‌ను పరీక్షించి ర‌శీదు తీసుకోండి. 

* ఒకే దుకాణంలో కాకుండా నాలుగైదు షాపుల‌కు వెళ్ళి కొటేష‌న్ తీసుకోండి. బంగారం ధ‌ర‌ను నిర్ణ‌యించేందుకు స్టాండ‌ర్డ్ విధానాలు లేవు. అందువ‌ల్ల వేరు వేరు దుకాణాల్లో కొటేష‌న్ తీసుకోమ‌ని నిపుణులు చెబుతున్నారు.

* అమ్మాల‌నుకుంటున్న‌ బంగారం స్వ‌చ్ఛ‌త గురించి మీకు ఖ‌చ్చితంగా తెలియ‌క‌పోతే..క్యారెట్ మీట‌ర్ అందుబాటులో ఉన్న ఒకటి కంటే ఎక్కువ షాపుల వ‌ద్ద స్వ‌చ్చ‌త‌ను ప‌రీక్షించండి. బంగారు నగ‌ల‌పై ఉండే హాల్‌మార్కింగ్ గుర్తు దాని స్వ‌చ్చత‌ను తెలియ‌జేస్తుంది.  కొనుగోలు దారులు అటువంటి ఆభ‌ర‌ణాల‌ను కొనేందుకు ఆసక్తి చూపుతారు. 

* ఆభ‌రణాలు అమ్మాల‌న్నా, పాత న‌గ‌ల‌కు బ‌దులుగా కొత్త‌వి తీసుకోవాల‌న్నా .. గ‌తంలో ఆ ఆభ‌రాల‌ను కొనుగోలు చేసిన దుకాణాన్ని ఎంచుకోవడం మంచిది. కొన్ని దుకాణాలు, వారి వ‌ద్ద కొనుగోలు చేసిన బంగారాన్ని తిరిగి కొనుగోలు చేస్తాయి.

* చిన్న చిన్న దుకాణాలు, తెలియ‌ని వారు మోసాలకు పాల్ప‌డే అవ‌కాశం ఉన్నందువ‌ల్ల న‌మ్మ‌క‌మైన దుకాణాల వ‌ద్ద గానీ, ప్ర‌సిద్ధ  బ్రాండ్‌ షాపుల‌కు గానీ వెళ్ల‌డం మంచిది. 

తుది ధ‌ర చెప్పే ముందు, ఆభ‌ర‌ణాల బ‌రువులో నిర్ణీత శాతాన్ని వేస్టేజ్ కింద త‌గ్గిస్తారు. అందువ‌ల్ల విక్ర‌యించే ముందు ఎంత శాతం వెస్టేజ్ రూపంలో పోతుందో తెలుసుకోవాలి. కొంత మంది  న‌గల మొత్తం బ‌రువులో 20 శాతం వ‌ర‌కు వేస్టేజీ కింద తీసివేసి ఆ మొత్తాన్ని త‌గ్గించి ఇస్తారు. రాళ్లు ఉన్న ఆభ‌ర‌ణాల‌కు ఎక్కువ వేస్టేజీ లెక్కిస్తారు. 

* ఆభ‌ర‌ణాలు కొనుగోలు చేసేప్పుడు మీరు చెల్లించిన త‌యారీ రుసుములు, విక్ర‌యించేప్పుడు తిరిగి రావన్న విషయాన్ని గుర్తించాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని