EPFO: పెన్ష‌న‌ర్లు బ్యాంక్ ఖాతా, పీఎఫ్ నెంబ‌ర్ల ద్వారా పీపీఓ నెంబ‌రు ఎలా పొందచ్చు?

బ్యాంక్ ఖాతా లేదా పీఎఫ్ నెంబ‌రు ద్వారా పెన్ష‌న్ పేమెంట్ ఆర్డ‌ర్ నెంబ‌రు పొందే విధానాన్ని ద‌శల వారిగా తెలుసుకుందాం

Updated : 16 Nov 2021 11:39 IST

ఫించ‌నుదారులు వారి పెన్ష‌న్ పొందేందుకు పెన్ష‌న్ పేమెంట్ ఆర్డ‌ర్ (పీపీఓ) నెంబ‌రు స‌హాయ‌ప‌డుతుంది. ఇది 12-అంకెల సంఖ్య‌.  కేంద్ర ఫెన్స‌న్ అక్కౌంటింగ్ ఆఫీస్‌(సీపీఏఓ)తో ఏదైనా  సంప్రదించాలనుకుంటే పీపీఓ ప్రాథ‌మికంగా అవ‌స‌ర‌మ‌య్యే రిఫ‌రెన్స్ నెంబ‌రు. ఏదైనా కార‌ణం చేత పెన్ష‌న్‌దారుడు పీపీఓ నెంబ‌రు మ‌ర్చిపోతే లేదా పీపీఓ నెంబ‌రు తెలుసుకోవాల‌నుకుంటే.. అత‌ను/ ఆమె ఈపీఎఫ్‌కి అనుసంధాన‌మైన బ్యాంక్ ఖాతా నెంబ‌రు లేదా పీఎఫ్ నెంబ‌రును ఉప‌యోగించి తెలుసుకోవ‌చ్చు. 

బ్యాంక్ ఖాతా లేదా పీఎఫ్ నెంబ‌రు ద్వారా పీపీఓ నెంబ‌రు పొందే విధానం:

* ముందుగా ఈపీఎఫ్(www.epfindia.gov.in) వెబ్‌సెట్‌కి లాగిన్ అవ్వాలి.
* హోమ్ పేజ్‌లో ఎడ‌మ‌వైపున ఉన్న పెన్ష‌న‌ర్ పోర్ట‌ల్‌పై క్లిక్ చేయాలి. ఇది ఫించ‌నుదారులకు వివిధ ర‌కాల‌ సేవలు అందించ‌డం కోసం ఏర్పాటు చేసిన‌ ప్ర‌త్యేక పోర్ట‌ల్‌. ఇది జీవన్ ప్రమాణ్ ఎంక్వైరీ, పీపీఓ నంబర్ తెలుసుకోవ‌డం, పీపీఓ విచార‌ణ‌(ఎంక్వైరీ), చెల్లింపుల విచార‌ణ‌, పెన్ష‌న్ స్థితిని తెలుసుకోవ‌డం వంటి విభిన్న‌ సేవలను అందిస్తుంది.
* ఇక్క‌డ ‘నో యువర్ పీపీఓ నెం’ పై క్లిక్ చేయాలి. 
* త‌దుప‌రి స్టెప్‌లో పెన్ష‌న్ ఖాతాకు లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నెంబ‌రు గానీ, సభ్యత్వ గుర్తింపు నెంబ‌రు గానీ న‌మోదు చేయ‌మ‌ని సిస్ట‌మ్ మిమ్మ‌ల్ని అడుగుతుంది. 
* ఈ వివ‌రాల‌ను అందించిన త‌రువాత పీపీఓ నెంబ‌రుతో పాటు ఇత‌ర వివ‌రాలు తెలుసుకోవ‌చ్చు. 

ఈపీఎఫ్ఓ అందించే పథకాలలో ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995 (ఈపీఎస్‌) ఒకటి.  సూప‌ర్ యాన్యుయేష‌న్ లేదా పదవీ విరమణ, వైకల్యం పొందిన‌వారు, ప్రాణాలతో బయటపడినవారు, వితంతువులు, పిల్లలు మొద‌లైన వారికి నెలవారీ ప్రయోజనాన్ని ఈపీఎస్ అందిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని