రిక‌రింగ్‌ చెల్లింపుల కోసం 'యూపీఐ ఆటోపే'ని ఎలా సెట్ చేయాలి? 

రూ.5వేలు దాటిన రిక‌రింగ్‌ చెల్లింపుల కోసం ఇచ్చిన ఆదేశాల‌ను యూపీఐ పిన్‌తో ప్ర‌తీసారి ధృవీరించాలి. 

Updated : 16 Oct 2021 14:29 IST

రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు, యునిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్‌(యూపీఐ) లేదా ఇత‌ర ముంద‌స్తు(ప్రీపెయిడ్) చెల్లింపు సాధనాల ద్వారా చేసే పున‌రావృత(రిక‌రింగ్‌) చెల్లింపుల ఆటో-డెబిట్‌కి అక్టోబ‌రు 1 నుంచి ఎడిష‌న‌ల్ ఫ్యాక్ట‌ర్ అథంటికేష‌న్(ఏఎఫ్ఏ) అవ‌స‌రం. 

మొబైల్ బిల్లులు, విద్యుత్ బిల్లులు, ఈఎమ్ఐ చెల్లింపులు, వినోదం/ ఓటీటీ స‌బ్‌స్క్రిప్ష‌న్లు, బీమా, మ్యూచువ‌ల్ ఫండ్లు, రుణ చెల్లింపులు వంటి పున‌రావృత‌ చెల్లింపులకు ఏదైనా యూపీఐ అప్లికేష‌న్ ద్వారా పున‌రావృత ఇ-ఆదేశాన్ని(ఇ-మ్యానిడేట్‌) ఇవ్వ‌చ్చు. అయితే రూ.5వేల లోపు ఉన్న చెల్లింపుల‌కు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంది. రూ.5వేల లోపు ఉన్న పున‌రావృత చెల్లింపుల‌కు రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో యూపిఐ పిన్ ద్వారా ఒక్క‌సారి ధృవీక‌రించి ఆటో-డిబిట్‌కి ఆదాశాలు ఇవ్వ‌చ్చు. రూ.5వేలు దాటిన చెల్లింపుల‌కు మాత్రం ఇచ్చిన ఆదేశాల‌ను యూపీఐ పిన్‌తో ప్ర‌తీసారి ధృవీరించాలి. 

అక్టోబ‌రు 1 నుంచి ఆర్‌బీఐ కొత్త ఆటో డెబిట్ రూల్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో ఆటో డెబిట్ ప్ర‌యోజ‌నాల‌ను పొందేందుకు బిహెచ్ఐఎమ్ యూపీఐ యాప్‌లో ఇ-మ్యాన్‌డేట్‌ను ఎలా సెట్ చేయాలో తెలుసుకుందాం. 

1. ముందుగా బిహెచ్ఐఎమ్ యూపిఐ యాప్‌కి లాగిన్ అవ్వండి
2. ఆటో డెబిట్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేసి మ్యాన్‌డేట్‌ను సెల‌క్ట్ చేసుకోవాలి. 
3. ఇక్క‌డ క‌నిపించే మ్యానేజ్ మ్యాన్‌డేట్ లో కొత్త‌గా ఆదేశాలు ఇవ్వ‌చ్చు. లేదా ఇదివ‌ర‌కే ఇచ్చిన ఆదేశాలు చూడ‌చ్చు, అలాగే ఇది వ‌ర‌కు ఇచ్చిన ఆదేశాల‌ను మార్పు/ర‌ద్దు చేయ‌వ‌చ్చు. 
4. యూపిఐ ఐడి, క్యూర్ స్కాన్‌, ఇంటెట్ ద్వారా ఇ-ఆదేశాలు క్రియేట్ చేయ‌వ‌చ్చు. 
5. ఆ త‌ర్వాత ఎంత కాల‌వ్య‌వ‌ధి(ఫ్రీక్వెన్సీ)లో చెల్లింపులు చేయాలో ఎంచుకోవాలి. రోజువారిగా, వారానికి, నెల‌కు, 15 రోజుల‌కు, నెల‌కు, మూడు నెల‌లు, ఆరు నెల‌ల‌కు, ఏడాదికి ఒక‌సారి.. ఎంత టైమ్ గ్యాప్‌లో చెల్లింపులు చేయాలో సెల‌క్ట్ చేసుకోవాలి. 
6. ఆ త‌ర్వాత వ్యాపార‌స్తున్ని ఎంచుకుని ఆటో-డిబిట్ తేదిని ఎంచుకుని ప్రొసీడ్‌పై క్లిక్ చేయాలి.  
7. వినియోగ‌దారులు యూపీఐ పిన్ ద్వారా ఒక‌సారి ఖాతాను ధృవీక‌రించాలి. త‌దుప‌రి చెల్లింపులు స్వ‌యంచాల‌కంగా డెబిట్ చేయ‌బ‌డ‌తాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని