కారు అగ్ని ప్రమాదానికి గురైతే పరిహారం లభిస్తుందా?
కారు అగ్ని ప్రమాదానికి గురైన సందర్భాలలో ఎలా పరిహారం పొందాలో తెలుసుకుందాం
దేశంలో వాహనాల వినియోగం పెరుగుతోంది. దీని వల్ల కాలుష్యం, ట్రాఫిక్‌జామ్ సమస్యలు మరింత పెరుగుతున్నాయి. వాహనాలు ప్రమాదాల మూలంగా దగ్ధమవుతుండం. ఇలాంటి సందర్భాలలో వాహన తయారీ కంపెనీలు బాధ్యత వహించవు.వాహన బీమాను క్లెయిం చేస్తే పరిహారం వస్తుందా? లేక సహేతుక కారణాలు లేవని బీమా కంపెనీ తిరస్కరిస్తుందా? ఎలాంటిసందర్భాల్లో బీమా కంపెనీలు క్లెయింలను తిరస్కరిస్తాయి? వాహన బీమాలో వేటికి కవరేజీ ఉంటుంది? మీ కారు లేదా వాహనానికి సమగ్రమైన బీమా పాలసీ ఉంటే అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు జరిగిన నష్టానికి బీమా కంపెనీ పూర్తి బాధ్యత వహిస్తుంది. స్టాండలోన్ థర్డ్‌పార్టీ పాలసీలో ఈ సౌలభ్యం ఉండదు. క్లెయింలో బీమా కంపెనీలు సాధారణంగా అగ్ని ప్రమాదమంటే ఏంటో స్పష్టంగా పేర్కొంటాయి. ఆ నిబంధనల ప్రకారం ప్రమాదం సంభవిస్తేనే బీమా కంపెనీ బాధ్యత వహిస్తుంది. అలా కాకుండా వేరే ఏవైనా ఇతర కారణాల వల్ల ప్రమాదం సంభవిస్తే బీమా కంపెనీలు మీ క్లెయింలను తిరస్కరిస్తాయి. వైరింగ్‌లో లోపాలు, వాహనానికి సంబంధించిన విద్యుత్ ఉపకరణాల అమరిక సరిలేకపోవడం లాంటి ఇతర కారణాల వల్ల కూడా అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. వీటికి బీమా క్లయిం ఇస్తారు. ఓవర్ హీటింగ్ లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగే ప్రమాదాలను కంపెనీలు తిరస్కరిస్తాయి.
సమగ్ర బీమా పాలసీలో సహేతుక కారణాల వల్ల అగ్ని ప్రమాదాలు జరిగితే బీమా కంపెనీలు మీ క్లెయింలను అంగీకరిస్తాయి. అలా కాకుండా ఉద్దేశపూర్వకంగా ప్రమాదం జరిగేలా చేస్తే క్లయింలు తిరస్కరణకు గురవుతాయి.అలాగే అల్లర్లు జరిగిన సమయాల్లో వాహనాలకు అగ్ని ప్రమాదం సంభవిస్తే సమగ్ర బీమా పాలసీలో కవరేజీ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కారు ఇంజిన్ లో మంటలు చెలరేగి వాహనం దగ్ధమైతే మినహాయింపులు పోనూ మిగిలిన వాహన విలువను బీమా కంపెనీ చెల్లిస్తుంది.
క్లెయిం ఎలా చేసుకోవాలి?
మీ వాహనం అగ్ని ప్రమాదానికి గురయినప్పుడు, వెంటనే బీమా కంపెనీతో పాటు పోలీసులను కూడా సంప్రదించాలి. జరిగిన ప్రమాదం గురించిన పూర్తి వివరాలను బీమా కంపెనీకి తెలియజేసి స్పాట్ సర్వే చేపట్టాల్సిందిగా కోరండి. స్పాట్ సర్వే వల్ల క్లెయిం సులభంగా, త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలియజేస్తూ ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్)ని సమర్పించాల్సిందిగా బీమా కంపెనీ మిమ్మల్ని అడుగుతుంది. ఇది దర్యాప్తు వేగవంతం కావడానికి దోహదపడుతుంది. ఒక వేళ అగ్ని ప్రమాదం ఉద్ధేశపూర్వకంగా జరిగినట్లు తేలితే మీ క్లెయిం తిరస్కరిస్తారు.
ఏయే సందర్భాలలో క్లెయింను తిరస్కరిస్తారు?
వాహనాలు అగ్ని ప్రమాదాల్లో చిక్కకున్నప్పుడు ఈ కింది సందర్భాలలో మీ క్లెయింలు తిరస్కరణకు గురయ్యే అవకాశాలున్నాయి.
-
ఇంథనం లీకేజీ, సున్నితమైన భాగాలలో అధిక ఒత్తిడి, ఇంజిన్ అధికంగా వేడెక్కడం లాంటి మెకానికల్ వైఫల్యాల వల్ల అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు
-
వాహన బ్యాటరీల నుంచి నిప్పులు వచ్చి ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు
-
ఎల్పీజీ గ్యాస్ కిట్లు, ఏసీల వంటి ఉపకరణాలను బిగించడం లేదా మార్చడం వల్ల అగ్ని ప్రమాదం తలెత్తినప్పుడు
-
వూఫర్లు, ఆంప్లిఫయర్లు, హెడ్ లాంప్స్, ఫాగ్ లాంప్స్, అలారమ్స్, ఎయిర్ ఫిల్టర్లు లాంటి ఉపకరణాలను బిగించే సందర్భాలలో వైరింగ్ లోపాలు తలెత్తి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
కార్లలో గుర్తింపులేని , డూప్లికేట్ ఉపకరణాలను అమర్చేటపుడు అగ్ని ప్రమాదం సంభవిస్తే మీ క్లెయిం తిరస్కరణకు గురవుతుంది. కాబట్టి వాహన యజమానులు అధీకృత వస్తువులనే వాడటం మంచిది. అలాగే అవసరం లేని సందర్భాల్లోనూ తరచుగా వైరింగ్‌ని మార్చడం, అధిక వోల్టేజీ ఉపకరణాలను వినియోగించడం చేయవద్దు. మరమ్మత్తులు చేయించేటపుడు కారు వైరింగ్ వ్యవస్థ సరిగా ఉండేట్లు చూడాలని మెకానిక్ కి చెప్పాలి.వీలైతే కారులో అగ్ని ప్రమాదాలను ఆర్పే యంత్రాలను పెట్టుకోవడం ఎంతో ప్రయోజనకరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్
-
ఏప్రిల్ 1 నుంచి ఇ-బీమా.. ఇంతకీ ఏమిటిది? ఎవరికి ప్రయోజనం?
-
కేజ్రీవాల్‌కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!