SBI: వ‌డ్డీ ధ్రువీకరణ ప‌త్రాన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై కనీసం 2.9 శాతం, గరిష్టంగా 5.4 శాతం వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తుంది

Updated : 24 Jun 2021 17:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్యాంక్ డిపాజిట్లకు సంబంధించి వ‌డ్డీ ఆదాయం వివ‌రాల‌ను తెలియ‌జేస్తుంది డిపాజిట్ ఇంట్ర‌స్ట్ స‌ర్టిఫికెట్‌. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో బ్యాంకు పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్ డిపాజిట్ ఖాతాల‌పై ఎంత వ‌డ్డీ పొందారో ఈ ధ్రువీకరణ ప‌త్రంలో చూడొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగ‌దారులు బ్యాంకు బ్రాంచ్‌ను సంద‌ర్శించ‌డం ద్వారా గానీ, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా గానీ ఈ స‌ర్టిఫికెట్‌ పొందొచ్చు.

డౌన్‌లోడ్‌ ఇలా..
* ముందుగా ఎస్‌బీఐ ఇంట‌ర్నెట్‌ బ్యాంకింగ్‌కు లాగిన్‌ అవ్వాలి.
* మెయిన్ మెనూలో అందుబాటులో ఉండే ఇ-స‌ర్వీసెస్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి.
* స్ర్కీన్‌పై క‌నిపిస్తున్న సేవ‌ల‌లో మై స‌ర్టిఫికెట్స్‌ ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి.
* మీకు ఏ ర‌క‌మైన ఇంట్ర‌స్ట్ స‌ర్టిఫికెట్‌ (ఇంట్ర‌స్ట్ స‌ర్టిఫికెట్‌ ఆఫ్ డిపాజిట్ అక్కౌంట్‌) కావాలో సెలెక్ట్ చేసుకోవాలి.
* ఖాతాలో సేక‌రించిన/డిడ‌క్ట్ చేసిన వ‌డ్డీని ఇక్క‌డ చూడొచ్చు. స‌ర్టిఫికెట్‌ కింద డౌన్‌లోడ్ ఆప్ష‌న్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే స‌ర్టిఫికెట్ డౌన్‌లోడ్ అవుతుంది. 

ఎస్‌బీఐ తాజా ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్లు..
ఎస్‌బీఐ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై కనీసం 2.9 శాతం.. గరిష్ఠంగా 5.4 శాతం వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తోంది. డిపాజిట్ కాల‌ప‌రిమితిపై ఆధార‌ప‌డి వ‌డ్డీ రేట్లు వ‌ర్తిస్తాయి. 7 నుంచి 45 రోజుల డిపాజిట్ల‌పై 2.9 శాతం, 45 నుంచి 179 రోజుల ట‌ర్మ్ డిపాజిట్ల‌పై 3.9 శాతం, 180 రోజుల నుంచి ఏడాది లోపు డిపాజిట్ల‌పై 4.4 శాతం, ఒక సంవ‌త్స‌రం నుంచి రెండేళ్ల డిపాజిట్ల‌పై 5 శాతం, రెండు నుంచి మూడేళ్ల లోపు కాల‌ప‌రిమితి ఉన్న డిపాజిట్ల‌పై 5.1 శాతం, మూడేళ్ల నుంచి ఐదేళ్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 5.3 శాతం, 5 నుంచి 10 సంవ‌త్స‌రాల మెచ్యూరిటీ పిరియ‌డ్ ఉన్న ట‌ర్మ్ డిపాజిట్ల‌పై 5.4 శాతం వ‌డ్డీని ఎస్‌బీఐ అందిస్తోంది.

ఎస్‌బీఐ పొద‌పు ఖాతా వ‌డ్డీ రేట్లు..
రూ.1 ల‌క్ష లోపు, అలాగే రూ.1 ల‌క్ష‌ల‌కు మించి పొదుపు ఖాతా బ్యాలెన్స్ నిర్వ‌హిస్తున్న‌వారికి ఎస్‌బీఐ 2.70 శాతం వ‌డ్డీ రేటును అందిస్తోంది. బ్యాంకు పొద‌పు ఖాతాపై వ‌డ్డీని రోజు వారీ ప్రాతిప‌దిక‌న లెక్కిస్తుంది. త్రైమాసికంగా ఖాతాదారుల‌కు చెల్లిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని