New IT Portal:  స్టాటిక్ పాస్‌వ‌ర్డ్ పొంద‌డం ఎలా? 

నెట్‌వ‌ర్క్ స‌మ‌స్య‌లు కార‌ణంగా ఓటీపీని పొంద‌డంలో ఇబ్బందులు ఉన్న‌వారికి ఈ స్టాటిక్ పాస్‌వ‌ర్డ్ విధానం ఉప‌యోగ‌కరంగా ఉంటుంది.

Updated : 12 Jun 2021 15:21 IST

ఆదాయ‌పు ప‌న్ను శాఖ కొత్త ఐటీ పోర్ట‌ల్  www.incometax.gov.in రూపొందించిన విష‌యం తెలిసిందే. ఈ పోర్ట‌ల్ జూన్‌7, 2021 నుంచి అందుబాటులోకి వ‌చ్చింది. ఈ పోర్ట‌లో ఎన్నో కొత్త ఫీచ‌ర్లు,  ప్ర‌యోజ‌నాల‌ను ఉన్నాయి. ఐటీ రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌డం ద‌గ్గ‌రి నుంచి రిఫండ్‌లు జారీ చేసే వ‌ర‌కు ఆన్‌లైన్ ద్వారా మెరుగైన సేవ‌ల అందిచ‌డంతో పాటు, ప‌న్ను చెల్లింపుదారుల‌కు యూజ‌ర్ ఫ్రెండ్లీగా, కొత్త అనుభావాల‌ను అందిస్తుంది. ఇందులో భాగంగానే స్టాటిక్ పాస్‌వ‌ర్డ్ జ‌న‌రేష‌న్ కొత్త‌ ఫీచ‌ర్‌ను తీసుకొచ్చింది.

నెట్‌వర్క్ కనెక్షన్లో  త‌రుచూ స‌మ‌స్య‌లు ఎదుర్కునే వారికి, మొబైల్‌లో ప‌రిమిత నెట్ కార‌ణంగా ఇబ్బంది ప‌డేవారికి  ఐటీ శాఖ కొత్త ఫైల్లింగ్ పోర్ట‌ల్ అందించే స్టాటిక్ పాస్‌వ‌ర్డ్ ఫీచ‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. నెట్వ‌ర్క్‌లో స‌మ‌స్య‌లు ఉన్న‌ప్పుడు ఓటీపీ(ఒన్ టైమ్ పాస్‌వ‌ర్డ్‌) లేదా ఈవీసి(ఎల‌క్ట్రానిక్ వెరిఫికేష‌న్ కోడ్‌)ల‌ను పొంద‌డం క‌ష్టం అవుతుంది. ఇటువంటి సంద‌ర్భాల‌లో స్టాటిక్ పాస్‌వ‌ర్డ్ ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఈ స్టాటిక్ పాస్‌వ‌ర్డ్‌ను ఉప‌యోగించి అథంటికేష‌న్ పూర్తిచేయ‌వ‌చ్చు, కొత్త ఇ-ఫైల్లింగ్ పోర్ట‌ల్‌లో  రెండు ద‌శ‌ల అథంటికేష‌న్ అవ‌స‌రం అవుతుంది. ఇది ప‌న్ను చెల్లింపుదారుల‌కు అద‌న‌పు భ‌ద్ర‌త‌నిస్తుంది. 

స్టాటిక్ పాస్‌వ‌ర్డ్‌ను ఎలా జ‌న‌రేట్ చేయాలి?
* ముందుంగా www.incometax.gov.in కి లాగిన్ అవ్వాలి. 
* ప్రొఫైల్ పేజ్‌లో అందుబాటులో ఉన్న మై ఫ్రొఫైల్ ఆప్ష‌న్‌పై క్లిక్ చేయాలి. 
* అక్క‌డ ఎడ‌మ‌వైపు మినూలో 'జ‌న‌రేట్ స్టాటిక్ పాస్‌వ‌ర్డ్' ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. 
* అక్క‌డ ఇచ్చిన సూచ‌న‌లు, నిబంధ‌న‌లు, ష‌రతుల‌ను జాగ్ర‌త్త‌గా చ‌దివి 'జ‌న‌రేట్ స్టాటిక్ పాస్‌వ‌ర్డ్' క్లిక్ చేయండి.
* 10 స్టాటిక్ పాస్‌వ‌ర్డ్‌ల‌ను ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఇస్తుంది. ఇందులో ఏదో ఒక దాన్ని ఉప‌యోగించి లాగిన్ అవ్వ‌చ్చు. 

గ‌మ‌నిక..
ఈ 10 స్టాటిక్‌ పాస్‌వ‌ర్డ్‌లకు 30 రోజుల వ్యాలిడిటీ మాత్ర‌మే ఉంటుంది. ఒక‌సారి ఒక పాస్‌వ‌ర్డ్ ఉప‌యోగిస్తే, మ‌రోసారి అదే పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ అవ్వ‌లేరు. మ‌రో స్టాటిక్ పాస్‌వ‌ర్డ్‌ని ఉప‌యోగించాలి. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని