మ‌హిళ‌ల‌కు ఐసీఐసీఐ కొత్త పొదుపు ఖాతా

ఐసీఐసీఐ బ్యాంక్ 'అడ్వాంటేజ్ ఉమెన్ ఆరా సేవింగ్స్ అక్కౌంట్ ’ పేరుతో మ‌హిళల‌ కోసం ప్ర‌త్యేక‌మైన పొదుపు ఖాతాను ఆవిష్క‌రించింది. స్వ‌యం ఉపాది క‌లిగిన‌ మ‌హిళ‌ల‌తో స‌హా విద్యావేత్త‌లు, వృత్తి నిపుణులు, గృహం వ‌ద్ద వ్యాపారం చేసేవారు ఇత‌ర ప‌నిచేస్తున్న మ‌హిళ‌లు ఈ ఖాతాను తీసుకోవ‌చ్చు. క‌నీస బ్యాలెన్స్‌ రూ.10 వేలు. ఇందులో సాధారణ, సిల్వర్,..

Published : 18 Dec 2020 14:39 IST

ఐసీఐసీఐ బ్యాంక్ 'అడ్వాంటేజ్ ఉమెన్ ఆరా సేవింగ్స్ అక్కౌంట్ ’ పేరుతో మ‌హిళల‌ కోసం ప్ర‌త్యేక‌మైన పొదుపు ఖాతాను ఆవిష్క‌రించింది. స్వ‌యం ఉపాది క‌లిగిన‌ మ‌హిళ‌ల‌తో స‌హా విద్యావేత్త‌లు, వృత్తి నిపుణులు, గృహం వ‌ద్ద వ్యాపారం చేసేవారు ఇత‌ర ప‌నిచేస్తున్న మ‌హిళ‌లు ఈ ఖాతాను తీసుకోవ‌చ్చు. క‌నీస బ్యాలెన్స్‌ రూ.10 వేలు. ఇందులో సాధారణ, సిల్వర్, గోల్డ్, మాగ్నమ్, టైటానియం పేర్ల‌తో 5 ర‌కాల (వేరియంట్స్‌) అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా ఖాతాదారుల‌కు వివిధ ప్ర‌యోజ‌నాల‌ను ఐసీఐసీఐ బ్యాంక్‌ అందిస్తుంది. పొదుపు ఖాతాలో మాగ్న‌మ్ ర‌కాన్ని మొట్ట‌మొద‌టిసారిగా ప్ర‌వేశ‌పెట్టింది. బ్యాంకింగ్, జీవ‌న శైలి, సౌల‌భ్యం, పెట్టుబ‌డులు, ప‌న్ను ప్ర‌ణాళిక‌లు, పిల్ల‌ల విద్య‌, భ‌ద్ర‌త వంటి వాటిలో ఈ ఖాతా ద్వారా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. కొన్ని ముఖ్యమైన అవ‌స‌రాల‌కు ఈ ఖాతా ద్వారా ల‌భించే డెబిట్‌ కార్డును ఉప‌యోగించ‌డం ద్వారా నెల‌కు రూ. 750 క్యాష్‌బ్యాక్ పొంద‌వ‌చ్చు. భార‌త‌దేశంలోని ఐసీఐసీఐ బ్యాంక్, ఇత‌ర బ్యాంకు ఏటీఎమ్‌ల‌లో అపరిమిత ఉచిత లావాదేవీలు నిర్వ‌హించ‌వ‌చ్చు.

ఈ ఖాతాను తీసుకున్న వారికి, బ్యాంకు బీమా ప్రయోజనాలను కూడా అందిస్తోంది. బ్యాంకు అందించే బీమా సౌక‌ర్యాల‌ జాబితాలో ఎయిర్‌, వ్యక్తిగత ప్రమాద బీమాలు కూడా ఉన్నాయి. రూ.40 లక్షలు వ‌ర‌కు ఎయిర్ బీమా హామీ రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా హామీల‌ను బ్యాంకు అందిస్తుంది. ఖాతా తెరిచే స‌మ‌యంలో వినియోగ‌దారుని డిక్ల‌రేష‌న్ ఫార‌మ్‌ను పూర్తి చేయడం ద్వారా కేన్స‌ర్ ప్రొటక్ష‌న్ బీమా ప‌థ‌కాన్ని కూడా ఎంచుకోవ‌చ్చు. 'ఆరా అండ్ స్పిరిట్ ఆఫ్ ఉమెన్; పేరుతో కొత్త డిబెట్ కార్డును కూడా రూపొందించింది.

ఖాతాదారుల‌కు అందించే కొన్ని ప్ర‌యోజ‌నాలు, రివార్డులు…

బ్యాంకింగ్‌:

  • ఇందులో అన్ని వ‌ర్గాల వారు ఐసీఐసీఐ, ఇత‌ర బ్యాంకు ఏటీఎమ్‌ల‌లో అప‌రిమిత లావాదేవీలు నిర్వ‌హించ‌వ‌చ్చు.
  • గృహ, ఆటో, వ్య‌క్తిగ‌త‌, ద్విచ‌క్ర‌వాహ‌న రుణాలు ప్రాసెసింగ్ రుసుముల‌లో 50 శాతం రాయితీ ల‌భిస్తుంది.
  • లాక‌ర్ అద్దెల‌పై 50 శాతం రాయితీ ల‌భిస్తుంది.
  • గోల్డ్‌, మాగ్న‌మ్‌, టైటానియ‌మ్ ర‌కాల‌కు కొత్త, ప్ర‌త్యేక‌మైన డెబిట్ కార్డుల‌ను అందిస్తారు.

జీవ‌న‌శైలి (లైఫ్ స్టైల్‌):

  • ఈ ఖాతాలోని అన్ని ర‌కాల డెబిట్ కార్డుల‌ వినియోగంపై భోజన, వినోదం, ఆభరణాలపై నెలకు రూ. 750 క్యాష్ బ్యాక్ ల‌భిస్తుంది.
  • టైటానియం, మాగ్న‌మ్ కార్డు ఖాతాదారులకు ఉచిత ఎయిర్‌ఫోర్ట్ లాంజ్‌ యాక్సెస్ సౌక‌ర్యం క‌ల్పిస్తుంది.
  • షాప‌ర్స్‌స్టాప్‌.కామ్‌, ప‌ర్ప‌ల్‌.కామ్‌, లీనో పెర్రోస్ అండ్‌ మియా బై తనిష్క్, అమెజాన్ .ఇన్ లో ఆఫ‌ర్ల‌ను, ఓచ‌ర్ల‌ను అందిస్తుంది.

మద్దతు & సౌలభ్యం:

  • గృహకార్య‌కాలాపాల‌లో సహాయపడేందుకు హౌస్‌జాయ్‌.కామ్‌లో డిస్కౌంటును అందిస్తుంది.
  • రోజువారీ ప‌చారీ స‌రుకులు(గ్రోస‌రీస్‌) కొనుగోలు చేసేందుకు బిగ్‌బాస్క‌ట్‌.కామ్ ద్వారా డిస్కౌంటును అందిస్తుంది.
  • ప్ర‌యాణ చింత త‌గ్గించేందుకు ఓలా గిఫ్ట్ ఓచ‌ర్ల‌ను అందిస్తుంది.

పెట్టుబడులు & ప‌న్ను ప్ర‌ణాళిక‌:

  • వ్యక్తిగత పెట్టుబడుల ప్రణాళిక సాధనం ‘మనీ కోచ్’ మహిళలు తమ పెట్టుబడులు తామే నిర్వహించేందుకు సహాయపడుతుంది.
  • పన్ను దాఖలు చేసేందుకు సీఏ-సహకార ప్ర‌ణాళిక‌ల‌ పన్ను పోర్టల్ పై డిస్కౌంట్ అందిస్తుంది.
  • గోల్డ్‌, మాగ్న‌మ్‌, టైటానియం ర‌కాల వారికి ట్రేడింగ్ ఖాతా ప్ర‌వేశ‌, నిర్వ‌హ‌ణ రుసుములు ఉండ‌వు.

పిల్ల‌ల విద్య‌:

  • ఎంట్ర‌న్స్‌ 360లో ప్ర‌వేశ ప‌రీక్ష ప్యాకేజీల‌పై డిస్కౌంట్ ల‌భిస్తుంది.

భ‌ద్ర‌త‌:

  • ఖాతా తెరిచే స‌మ‌యంలో క్యాన్సర్ భ‌ద్ర‌త బీమా పధకాన్ని ఎంచుకోవచ్చు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని