ఇత‌ర బ్యాంకుల వినియోగ‌దారులకూ 'ఐమొబైల్ పే' సేవ‌లు

ఐసీఐసీఐ బ్యాంకు మరో వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చింది. తమ మొబైల్ చెల్లింపుల యాప్‌ కొత్త వెర్షన్‌ ‘ఐమొబైల్ పే’ ను ఆవిష్కరించింది. ఇతర బ్యాంకుల వినియోగదారులు కూడా ఈ యాప్‌ ద్వారా..

Published : 15 Dec 2020 16:09 IST

ఐసీఐసీఐ బ్యాంకు మరో వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చింది. తమ మొబైల్ చెల్లింపుల యాప్‌ కొత్త వెర్షన్‌ ‘ఐమొబైల్ పే’ ను ఆవిష్కరించింది. ఇతర బ్యాంకుల వినియోగదారులు కూడా ఈ యాప్‌ ద్వారా చెల్లింపులు, బ్యాంకింగ్‌ సేవలు పొందగలగడం విశేషం.

సేవింగ్స్‌ ఖాతా, పెట్టుబడులు, రుణాలు, క్రెడిట్‌ కార్డులు, గిఫ్ట్‌కార్డులు, ట్రావెల్‌ కార్డుల వంటి సత్వర బ్యాంకు సేవలను ఐమొబైల్‌ పే ద్వారా పొందొచ్చని ఐసీఐసీఐ తెలిపింది. ఈ తరహా యాప్‌ రావడం ఇదే తొలిసారని తెలిపింది. వినియోగదారులు తమ కాంటాక్టులకు సంబంధించిన యూపీఐ ఐడీలను సుదీర్ఘకాలం గుర్తుంచుకోనవసరం లేకుండా ఇంట‌ర్ఆప‌రేట‌బిలిటీ అందిస్తున్నామని వెల్లడించింది. దీంతో సులువుగా పేమెంట్‌ యాప్స్‌, వాలెట్లకు నగదు బదిలీ చేసుకోవచ్చని తెలిపింది.

‘ఐమొబైల్ పే’ ఫీచ‌ర్స్ అందరికీ అందుబాటులో:
‘ఐమొబైల్ పే’ అన్ని బ్యాంకుల వినియోగ‌దారుల‌కు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, అత్యుత్తమ భద్రతా లక్షణాల మద్దతుతో త‌క్ష‌ణ‌ లావాదేవీలకు అనుమతిస్తుంది.

చెల్లింపుల యాప్‌లా పనిచేస్తుంది
ఇది వినియోగదారులకు ఏదైనా చెల్లింపుల యాప్ క్యూర్‌ కోడ్‌ను స్కాన్ చేయడానికి, ఏదైనా యుపిఐ ఐడి, బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపించడానికి అనుమతిస్తుంది. ఉచితంగా ఎవరికైనా డబ్బును తక్షణమే బదిలీ చేయడానికి వినియోగదారులకు సహాయపడుతుంది. అంతేకాకుండా, వినియోగదారులు పెట్రోల్ పంపులు, కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, ఫార్మసీలు, ఆస్పత్రులు, మల్టీప్లెక్స్‌లు వంటి వాటి వ‌ద్ద యాప్‌ ఉపయోగించి చెల్లించవచ్చు. ఏదైనా బ్యాంక్ ఖాతా, చెల్లింపు యాప్‌ లేదా డిజిటల్ వాలెట్‌కు డబ్బును బదిలీ చేయవచ్చు.

బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది
వినియోగదారులు ఐసిఐసిఐ బ్యాంక్‌తో కొత్త సంబంధాన్ని ప్రారంభించడానికి ఒక గేట్‌వేగా పనిచేస్తుంది. ఇది ఐసిఐసిఐ బ్యాంక్ పొదుపు ఖాతాను డిజిటల్‌గా, తక్షణమే తెరవడానికి, ప్ర‌వేశ రుసుము లేకుండా, క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి, గృహ / వ్యక్తిగత / కారు రుణాలకు తక్షణ ఆమోదం పొందవ‌చ్చు.

బహుళ బ్యాంక్ ఖాతాలను లింక్ చేసే అవ‌కాశం
వినియోగదారులు లింక్ చేసిన ఖాతాలలో దేనినైనా ఒకే యుపిఐ ఐడితో లావాదేవీలు చేయవచ్చు, ఇది మొదటి ఖాతాను లింక్ చేసే సమయంలో జ‌న‌రేట్ అవుతుంది.

త్వరలో జోడించాల్సినవి చాలా ఉన్నాయి:
రాబోయే ఉత్తేజకరమైన ఫీచ‌ర్స్ జాబితాలో వినియోగదారులు యుటిలిటీ బిల్లులు చెల్లించవచ్చు, మొబైల్ ఫోన్‌లను రీఛార్జ్ చేసుకోవచ్చు, సిబిల్ స్కోర్‌ను తనిఖీ చేయవచ్చు, ప్రయాణ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు, ప్రయాణ , బహుమతి కార్డులను కొనుగోలు చేయవచ్చు, ఎఫ్‌డి, ఆర్‌డీ, మ్యూచువల్ ఫండ్‌లు, బీమా సంస్థలలో పెట్టుబడి పెట్టవచ్చు. ఖర్చులను ట్రాక్ చేసుకునే స‌దుపాయం కూడా ల‌భించ‌నుంది.

ఐమొబైల్‌పే యాప్‌ను సుల‌భంగా ఇలా ప్రారంభించండి

  1. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఐమొబైల్ పే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
  2. యాప్‌లో త‌మ బ్యాంకు ఖాతాను అనుసంధానించాలి. ఒక‌టి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కూడా లింక్ చేయ‌వ‌చ్చు.
  3. ఖాతాలు లింక్ చేసిన త‌ర్వాత యూపీఐ ఐడీ జ‌న‌రేట్ అవుతుంది. దీంతో చెల్లింపులు ప్రారంభించ‌వ‌చ్చు.

‘సరికొత్త ఆవిష్కరణలు చేయడం, ప్రవేశపెట్టడంలో మేమెప్పుడూ ముందుంటాం. 2008లో దేశంలోనే తొలిసారిగా బ్యాంకింగ్‌ యాప్‌ను పరిచయం చేశాం. ఇప్పుడు విడుదల చేసిన కొత్త వెర్షన్‌తో ఇతర బ్యాంకులకు చెందిన వినియోగదారులు సైతం వారి అన్ని బ్యాంకు ఖాతాలను ఇందులో లింక్‌ చేసుకోవచ్చు’ అని ఐసీఐసీఐ బ్యాంకు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని