క్ష‌ణాల్లో ఐసీఐసీఐ బ్యాంక్ డిజిట‌ల్ పీపీఎఫ్ ఖాతా

ఐసీఐసీఐ బ్యాంక్ డిజిట‌ల్ రూపంలో త‌క్ష‌ణ‌ ప్ర‌జా భ‌విష్య నిధి (పీపీఎఫ్) ఖాతాను ప్రారంభించే స‌దుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అంటే వినియోగ‌దారులు బ్యాంకుకి వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండానే ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. పీపీఎఫ్ వంటి చిన్న‌ మొత్తాల పొదుపు ప‌థ‌కాలు దీర్ఘ‌కాలికంగా అవ‌స‌ర‌మ‌య్యే నిధిని ఏర్పాటు చేసుకునేందుకు ఉప‌యోగ‌క‌రంగా ఉండ‌టంతో పాటు ప‌న్ను మిన‌హాయింపులు..

Published : 17 Dec 2020 15:41 IST

ఐసీఐసీఐ బ్యాంక్ డిజిట‌ల్ రూపంలో త‌క్ష‌ణ‌ ప్ర‌జా భ‌విష్య నిధి (పీపీఎఫ్) ఖాతాను ప్రారంభించే స‌దుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అంటే వినియోగ‌దారులు బ్యాంకుకి వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండానే ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. పీపీఎఫ్ వంటి చిన్న‌ మొత్తాల పొదుపు ప‌థ‌కాలు దీర్ఘ‌కాలికంగా అవ‌స‌ర‌మ‌య్యే నిధిని ఏర్పాటు చేసుకునేందుకు ఉప‌యోగ‌క‌రంగా ఉండ‌టంతో పాటు ప‌న్ను మిన‌హాయింపులు కూడా వ‌ర్తిస్తాయి. పీపీఎఫ్ ఖాతా మోచ్యూరిటీ గ‌డువు 15 సంవ‌త్స‌రాలు.

పీపీఎఫ్ ఖాతా ప్రారంభించేందుకు తెలుసుకోవాల్సిన 5 విష‌యాలు

1.ఐసీఐసీఐ బ్యాంకు వినియోగ‌దారులు బ్యాంకుకి వెళ్లి, ఎలాంటి ద‌ర‌ఖాస్తులు, ప‌త్రాలు ఇచ్చే అవ‌స‌రం లేకుండా ఆన్‌లైన్ ద్వారా పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించే అవ‌కాశాన్ని క‌ల్పించంది.
2.ఐసీఐసీఐ బ్యాంక్ ఇంట‌ర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పీపీఎఫ్ డిజిట‌ల్ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు.
3.అవ‌స‌ర‌మైన వివ‌రాల‌న్నీ అందించిన త‌ర్వాత వెంట‌నే పీపీఎఫ్ ఖాతా ప్రారంభించ‌బ‌డుతుంది. పీపీఎఫ్ ఖాతా నంబ‌ర్ వ‌స్తుంది.
4.ఐసీఐసీఐ బ్యాంక్ ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్ సౌక‌ర్యాల‌ను అందిస్తుంది.
5.పీపీఎఫ్ ఖాతా ప్రారంభం త‌ర్వాత‌ లావాదేవీలు వివ‌రాల‌ను ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా తెలుసుకోవ‌చ్చు.

ఐసీఐసీఐ బ్యాంక్ పీపీఎఫ్ ఖాతాను ఎలా ప్రారంభించాలి?

  1. మొద‌ట ఐసీఐసీఐ బ్యాంకు రిటైల్‌ ఇంట‌ర్నెట్ బ్యాంక్ పేజీలోకి వెళ్లాలి. త‌ర్వాత 'మై అకౌంట్స్ సెక్ష‌న్‌’లో ఉన్న ‘ఓపెన్ పీపీఎఫ్ అకౌంట్‌’ పై క్లిక్ చేయాలి.
  2. పాన్‌, చిరునామా వంటి వివ‌రాల‌ను అందించాలి. మొద‌ట కొంత న‌గ‌దును ఖాతాలో డిపాజిట్ చేయాలి. త‌ర్వాత ఖాతాలో నెల‌వారీగా న‌గ‌దును పెంచుకుంటూ పోయేందుకు కూడా అవ‌కాశ‌ముంటుంది.
  3. చివ‌రిగా వెరిఫికేష‌న్ కోసం ఆధార్ నంబ‌ర్‌ను ఎంట‌ర్ చేయాలి. మొబైల్‌కి ఆధార్ ఓటీపీ వ‌స్తుంది. దీంతో మీ ఖాతా ప్రారంభమైన‌ట్లు నిర్ధారిత‌మ‌వుతుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని