ICICI Bank Alert: ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు గమనిక!
ఈ ఛార్జీల సేవలు 1 ఆగస్టు 2021 నుండి వర్తిస్తాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐసీఐసీఐ సర్వీస్ ఛార్జీలు ఆగస్టు 1 నుండి మారనున్నాయి. బ్యాంకు వెబ్సైట్ ప్రకారం ఐసీఐసీఐ వినియోగదారులకు 6 మెట్రో నగరాల్లో మొదటి 3 లావాదేవీల (ఆర్థిక, ఆర్థికేతర) సేవలు ఉచితంగా లభిస్తాయి. ఐసీఐసీఐ బ్యాంకు నగదు లావాదేవీ, ఏటీఎం ఇంటర్‌ఛేంజ్, చెక్‌బుక్ ఛార్జీలు ఆగస్టు 1 నుండి మారతాయి.
సవరించిన ఛార్జీల వివరాలు...
* ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ప్రతి అదనపు లావాదేవీకి రుసుము వసూలు చేస్తారు.
* ఐసీఐసీఐ వినియోగదారులకు 6 మెట్రో నగరాల్లో మొదటి 3 లావాదేవీల (ఆర్థిక, ఆర్థికేతర) సేవలు ఉచితంగా లభిస్తాయి.
* మెట్రో నగరాలు కాకుండా అన్నిఇతర ప్రదేశాలలో, మొదటి 5 లావాదేవీలు ఉచితం.
* బ్యాంకు ప్రతి ఆర్థిక లావాదేవీకి రూ. 20, ఆర్థికేతర లావాదేవీకి రూ. 8.50 వసూలు చేస్తుంది.
* హోం బ్రాంచిలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. అది దాటితే ప్రతి రూ.1000కి రూ.5 ఛార్జీ పడుతుంది. కనిష్ఠంగా రూ.150కు లోబడి ఉంటుందని బ్యాంక్ తెలిపింది.
* నాన్ హోమ్ బ్రాంచ్ వద్ద రోజుకు రూ. 25,000 వరకు నగదు లావాదేవీలకు ఛార్జీలు లేవు. రూ. 25,000 పైన రూ.1000కి రూ.5 ఛార్జీ పడుతుంది. కనీసం రూ. 150కి లోబడి ఉంటుంది.
* థర్డ్ పార్టీ లావాదేవీల పరిమితి రోజుకు రూ. 25,000గా నిర్ణయించారు. రూ. 25,000 పరిమితి వరకు ప్రతి లావాదేవీకి రూ.150 ఛార్జీ ఉంటుంది. రూ. 25,000 పరిమితికి మించి నగదు లావాదేవీలు అనుమతి లేదు.
* ఒక నెలలో మొదటి 4 లావాదేవీలకు ఛార్జీలుండవు. ఆ తర్వాత రూ.1000 లావాదేవీకి రూ. 5 ఛార్జీ, కనీసం రూ.150కి లోబడి ఉంటుంది.
* ఒక సంవత్సరంలో తీసుకున్న 25 చెక్‌లున్న చెక్ బుక్కి ఛార్జీలు లేవు. ఆ తర్వాత అదే సంవత్సరంలో 10 చెక్‌లున్న చెక్ బుక్ తీసుకుంటే బ్యాంక్ రూ. 20 వసూలు చేస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్‌ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?