ఐసిఐసిఐ ప్రూ గ్యారెంటీడ్ పెన్షన్ ప్లాన్

ప‌ద‌వీవిర‌మ‌ణ జీవితాన్ని ఆర్థిక స్వేచ్చ‌తో సాగించేంద‌కు ఒక క్ర‌మ‌మైన ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోవ‌డం అవ‌స‌రం...

Updated : 01 Jan 2021 18:47 IST

​​​​​​​ప‌ద‌వీ విర‌మ‌ణ త‌రువాత జీవితానికి ఖ‌చ్చిత‌మైన ఆదాయాన్ని అందించేంద‌కు ఐసీఐసీఐ ప్రూడెన్షియ‌ల్ లైఫ్ ఇన్సురెన్స్ ఒక కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఐసిఐసిఐ ప్రూ గ్యారెంటీడ్ పెన్షన్ ప్లాన్ అనేది నాన్‌-లింకెడ్‌, నాన్ పార్టిసిపేట్ ఇండివిడ్యువ‌ల్ యాన్యుటీ ప్రొడెక్ట్‌. ఇందులో రెండు విధాలుగా ఆదాయాన్ని పొందే అవ‌కాశం ఉంది. ఇమిడియేట్‌‌ యాన్యూటీ, డిఫ‌ర్డ్ యాన్యూటీ. ఈ రెండిటిలో ఒక ప‌ద్ధ‌తిని వినియోగ‌దారుడు ఎంచుకోవల్సి ఉంటుంది. ఇమిడియేట్ యాన్యూటీ ఆప్ష‌న్‌ను ఎంచుకున్న వారు ఒన్‌టైమ్ ప్రీమియంను చెల్లించిన వెంట‌నే క్ర‌మ‌మైన ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. డిఫ‌ర్డ్ యాన్యూటీ ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే కొంత కాలం వేచియున్న త‌రువాత యాన్యూటీ పొందే వీలుంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు, ఒక వ్య‌క్తి ప‌ద‌వీ విర‌మ‌ణకు 10 సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంది అనుకుందాం. ఆ వ్య‌క్తి డిఫ‌ర్డ్ యాన్యూటీ ఆప్ష‌న్‌ను ఎంచుకుని 10 సంవ‌త్స‌రాల త‌రువాత ఆదాయాన్ని పొందేవిధంగా ఏర్పాటు చేసుకోవ‌చ్చు. నిజానికి ఎంత ఎక్కువ కాలం వాయిదా వేసుకుంటే, అంత ఎక్కువ‌గా ఆదాయాన్ని పొందేదుకు అవ‌కాశం ఉంటుంది.

ప్ర‌స్తుతం ద్ర‌వ్యోల్బ‌ణం ప్ర‌భావం ఎక్కువ‌గానే క‌నిపిస్తుంది. ఈ కార‌ణంగా భ‌విష్య‌త్తులో ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను ఎదుర్కునేందుకు, వినియోగ‌దారులు వారి కాంట్రీబ్యూష‌న్ పెంచుకునేందుకు టాప్‌-అప్ చేసుకునే వీలుంది. త‌ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు.

పాల‌సీదారులు సింగిల్ లేదా జాయింట్ లైప్ ఆప్ష‌న్ల‌ను ఎంపిక చేసుకునే అవ‌కాశం కూడా ఈ ప్లాన్ అందిస్తుంది. సింగ‌ల్ లైఫ్ ఆప్ష‌న్ ఎంచుకుంటే పాల‌సీదారుడు జీవించి ఉన్నంత‌వ‌ర‌కు క్ర‌మ‌మైన ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. జాయింట్ లైఫ్ ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే, పాల‌సీదారుడు మ‌ర‌ణించిన త‌రువాత అత‌ని/ ఆమె జీవిత భాగ‌స్వామి ఆదాయాన్ని పొందుతారు.

పాల‌సీ దారునికి నిర్ధిష్ట‌, తీవ్ర‌మైన అనారోగ్యం, శాశ్వ‌త వైక‌ల్యం వంటివి నిర్ధార‌ణ అయితే ప్రీమియం మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు పాల‌సీ అనుమ‌తిస్తుంది. అనారోగ్యానికి చికిత్స చేయించుకునేంద‌కు. వైద్య ఖ‌ర్చుల‌కు ఈ మొత్తాన్ని ఉప‌యోగించుకోవ‌చ్చు.

పాల‌సీ ప్రారంభోత్సవ కార్య‌క్ర‌మంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అమిత్ పాల్టా మాట్లాడుతూ, “నేటి అనిశ్చిత ప‌రిస్థితుల‌లో ఖ‌చ్చిత‌మైన జీవిత‌కాల ఆదాయాన్ని అందించే ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకురావ‌డం మాకు చాలా సంతోషంగా ఉంది. మ‌నిషి స‌గ‌టు జీవిత‌కాలం పెరగ‌టం, సామాజిక భ‌ద్ర‌త లేక‌పోవ‌డంతో పాటు, ద్ర‌వ్యోల్బ‌ణం, ఆరోగ్య సంర‌క్ష‌ణ ఖ‌ర్చులు పెర‌గడంతో సుర‌క్షిత‌మైన‌, ప‌ద‌వీవిర‌మ‌ణ జీవితం కోసం ప్లాన్ చేసుకోవ‌డం అత్య‌వ‌స‌రం. ఐసీఐసీఐ ప్రూ గ్యారెంటీడ్ పెన్షన్ ప్లాన్ అనేది బహుముఖ విరమణ ప్రణాళిక. రిటైర్ అయిన వెంట‌నే, అదేవిధంగా రిటైర్‌మెంట్‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న వారికి చాలా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది” అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని