ఐసీఐసీఐ ప్రూ.. గ్యారెంటీడ్ పెన్ష‌న్ ప్లాన్‌

ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితం సాఫీగా సాగాలంటే.. ద్ర‌వ్యోల్బ‌ణానికి త‌గిన‌ట్లు ఒక క్ర‌మ‌మైన ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోవ‌డం అవ‌స‌రం

Updated : 26 May 2021 16:31 IST

ప‌దవీ విర‌మ‌ణ తరువాత కచ్చిత‌మైన ఆదాయాన్ని అందించేందుకు గ్యారెంటీడ్ పెన్ష‌న్ ప్లాన్ పేరుతో పెన్ష‌న్ ప్లాన్‌ను ప్ర‌వేశ‌పెట్టింది ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ లైఫ్ ఇన్సురెన్స్‌. డిఫ‌ర్డ్‌, ఇమిడియేట్ యాన్యూటీ విధానాల‌ను క‌లిపి పెట్టుబ‌డుల‌పై కచ్చిత‌మైన రాబ‌డిని అందించే విధంగా దీన్ని రూపొందించింది.

బ్యాంక్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం, ఈ ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక పెరుగుతున్న జీవ‌న వ్య‌యానికి త‌గిన‌ట్లుగా క్ర‌మ‌మైన ఆదాయాన్ని పెంచి ఇచ్చే ఆప్ష‌న్‌తో వ‌స్తుంది. 5ఏళ్ళ త‌రువాత రెండింత‌లు, 11 సంవ‌త్స‌రాల త‌రువాత మూడింత‌లు రెగ్యుల‌ర్ ఇన్‌క‌మ్ పెరుగుతుంది.

ప‌దవీ విర‌మ‌ణ త‌రువాత క్ర‌మ‌మైన ఆదాయాన్ని పొందేందుకు యాన్యూటీలు వీలు క‌ల్పిస్తాయి. ఇవి రెండు ర‌కాలుగా ఉంటాయి. 1. ఇమిడియేట్‌ యాన్యూటీలు 2. డిఫ‌ర్డ్ యాన్యుటీలు. రెండింటిలో ఒక ప‌ద్ధ‌తిని వినియోగ‌దారుడు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇమిడియేట్ యాన్యూటీ ఆప్ష‌న్‌ను ఎంచుకున్న వారు వన్‌టైమ్ ప్రీమియంను చెల్లించిన వెంట‌నే క్ర‌మ‌మైన ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. డిఫ‌ర్డ్ యాన్యూటీ ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే కొంత కాలం వేచియున్న త‌రువాత యాన్యూటీ పొందే వీలుంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు, ఒక వ్య‌క్తి ప‌ద‌వీ విర‌మ‌ణకు 10 సంవ‌త్స‌రాల స‌మ‌యం ఉంది అనుకుందాం. ఆ వ్య‌క్తి డిఫ‌ర్డ్ యాన్యూటీ ఆప్ష‌న్‌ను ఎంచుకుని 10 సంవ‌త్స‌రాల త‌రువాత ఆదాయాన్ని పొందే విధంగా ఏర్పాటు చేసుకోవ‌చ్చు. నిజానికి ఎంత ఎక్కువ కాలం వాయిదా వేసుకుంటే, అంత ఎక్కువ‌గా ఆదాయాన్ని పొందేదుకు అవ‌కాశం ఉంటుంది.

ముఖ్య ప్ర‌యోజ‌నాలు..

* జీవిత కాలం కచ్చిత‌మైన యాన్యుటీ.. ఒక‌సారి ప్రీమియంను చెల్లించి, జీవిత కాలం క్ర‌మ‌మైన ఆదాయాన్ని పొంద‌వచ్చు.

* ప‌దవీ విర‌మ‌ణ తేదిని ఎంచుకునే అవకాశం.. కొనుగోలు చేసిన నాటి నుంచి యాన్యూటినీ తీసుకోవ‌చ్చు లేదా 1 నుంచి 10 సంవ‌త్స‌రాలు వాయిదా వేసుకోవ‌చ్చు.

* నెల‌వారిగా,  మూడు నెల‌లు, ఆరు నెల‌లు, సంవ‌త్స‌రానికి ఒక‌సారి.. ఏవిధంగా పెన్ష‌న్‌ తీసుకోవాల‌నుకుంటున్నారో ఎంచుకోవ‌చ్చు.

* పాల‌సీదారులు సింగిల్ లేదా జాయింట్ లైప్ ఆప్ష‌న్ల‌ను ఎంపిక చేసుకునే అవ‌కాశం కూడా ఈ ప్లాన్ అందిస్తుంది. సింగ‌ల్ లైఫ్ ఆప్ష‌న్ ఎంచుకుంటే పాల‌సీదారుడు జీవించి ఉన్నంత‌వ‌ర‌కు క్ర‌మ‌మైన ఆదాయాన్ని పొంద‌వ‌చ్చు. జాయింట్ లైఫ్ ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే, పాల‌సీదారుడు మ‌ర‌ణించిన త‌రువాత అత‌ని/ఆమె జీవిత భాగ‌స్వామి ఆదాయాన్ని పొందుతారు.

* 11 ర‌కాల యాన్యుటీ ఆప్ష‌న్లు అందుబాటులో ఉన్నాయి. మీ ఆర్థిక అవ‌స‌రాల‌కు త‌గిన ప్లాన్‌ను ఎంచుకోవ‌చ్చు.

* అధిక విలువ‌తో కొనుగోలు చేస్తే,  మీరు ఎంచుకున్న యాన్యూటి ఆప్ష‌న్‌, కొనుగోలు ధ‌ర స్లాబ్‌పై ఆధార‌ప‌డి అద‌న‌పు యాన్యూటీ ప్ర‌యోజ‌నాలు పొందచ్చు.
* వినియోగ‌దారులు వారి కాంట్రీబ్యూష‌న్ పెంచుకునేందుకు టాప్‌-అప్ చేసుకునే వీలుంది. త‌ద్వారా ఎక్కువ ఆదాయాన్ని పొందొచ్చు.

* ఐసీఐసీఐ ఫ్రూ గ్యారెంటీడ్ పెన్ష‌న్ ప్లాన్ యాన్యుటి ప్రొడెక్ట్‌లు, ఎర్లీ రిట‌ర్న్ ఆఫ్ ప‌ర్చేజ్ ప్ర‌యోజ‌నాన్ని అందిస్తున్నాయి. అంటే 76 నుంచి 80 సంవ‌త్స‌రాల వ‌య‌సులోనే కొనుగోలు ధ‌ర‌(ప్రీమియం మొత్తం) తిరిగి ఇచ్చే ప్ర‌యోజ‌నాన్ని అందిస్తున్నాయి. పాల‌సీదారుడు మ‌ర‌ణించినా, నిర్దిష్ట తీవ్ర అనారోగ్యాలు గుర్తించిన‌, ప్ర‌మాదం కార‌ణంగా శాశ్వ‌త వైక‌ల్యం ఏర్ప‌డిన‌ప్పుడు కూడా ప్రీమియంను తిరిగి ఇచ్చేందుకు అనుమితిస్తున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని