ఐసీఐసీఐ ది ఒన్ సేవింగ్స్‌ అక్కౌంట్‌

కుటుంబ శ్రేయ‌స్సు, సంతోషం కోసం మ‌నం వివిధ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్దం చేసుకుని వాటి ప్ర‌కారం న‌డుచుకుంటాము. అలాగే కుటుంబం భ‌విష్య‌త్తును భ‌ద్ర‌ప‌రిచేందుకు స్మార్ట్ పెట్టుబ‌డులు పెట్టేందుకు చూస్తుంటాం. పెట్టుబ‌డులు పెట్టి మంచి రాబ‌డి ఆర్జించ‌డంతో పాటు, జీవ‌న శైలిని మెరుగుప‌రుచుకుంనేందుకు, మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొందేందుకు ఐసీఐసీఐ ...

Published : 18 Dec 2020 15:24 IST

కుటుంబ శ్రేయ‌స్సు, సంతోషం కోసం మ‌నం వివిధ ప్ర‌ణాళిక‌ల‌ను సిద్దం చేసుకుని వాటి ప్ర‌కారం న‌డుచుకుంటాము. అలాగే కుటుంబం భ‌విష్య‌త్తును భ‌ద్ర‌ప‌రిచేందుకు స్మార్ట్ పెట్టుబ‌డులు పెట్టేందుకు చూస్తుంటాం. పెట్టుబ‌డులు పెట్టి మంచి రాబ‌డి ఆర్జించ‌డంతో పాటు, జీవ‌న శైలిని మెరుగుప‌రుచుకుంనేందుకు, మ‌రిన్ని ప్ర‌యోజ‌నాల‌ను పొందేందుకు ఐసీఐసీఐ బ్యాంక్ ది ఒన్ సేవింగ్స్‌ అక్కౌంట్‌ను రూపొందించింది. ఈ ఖాతాతో మీరు పొదుపు, పెట్టుబ‌డులు వంటి బ్యాంకింగ్ సేవ‌ల‌తో పాటు వివిధ ర‌కాల ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. అయితే వీటికి కొన్ని నియ‌మ నిభంధ‌న‌లు వ‌ర్తిస్తాయి.

ఐసీఐసీఐ ది ఒన్ సేవింగ్స్‌ అక్కౌంట్ అందించే వివిధ ప్ర‌యోజ‌నాలు:

జీవ‌న శైలి ప్ర‌యోజ‌నాలు:

  1. జొమెటో గోల్డ్‌:
    ఒన్ సేవింగ్స్‌ ఖాతాలో మూడు నెల‌ల పాటు క‌నీస బ్యాలెన్స్‌ను నిర్వ‌హిస్తూ,మీ ఐమొబైల్ యాప్‌లో, ఒక యూపీఐ(యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్‌) లావాదేవీని చేసిన వారికి కాంప్లిమెంట‌రీగా ఒక సంవ‌త్స‌రం పాటు జోమోటో గోల్డ్ మెంబ‌ర్ షిప్‌ను ఐసీఐసీఐ అందిస్తుంది. ఈ మెంబ‌ర్‌షిప్‌ ద్వారా భార‌త‌దేశంలోని 10 న‌గ‌రాల‌లో ఎంచుకున్న ప్ర‌ముఖ రెస్టారెంట్ల‌లో 1 + 1, 2 + 2 ఆఫర్లను పొంద‌వ‌చ్చు.

  2. అమెజాన్ ప్రైమ్‌:
    ది ఒన్ సేవింగ్స్ ఖాతా డిబిట్ కార్డుతో రూ. 15 వేలు ఖ‌ర్చు చేస్తే రూ. 999 విలువైన‌ అమెజాన్ గిఫ్ట్ కార్డు పొంద‌వ‌చ్చు. ఈ గిప్ట్ కార్డుతో అమెజాన్ ప్రైమ్‌లో స‌భ్య‌త్వం తీసుకోవ‌చ్చు.

  3. బిగ్ బాస్క‌ట్‌:
    ది ఒన్ సేవింగ్స్ ఖాతా డెబిట్ కార్డుతో బిగ్‌బాస్క‌ట్ షాపింగ్‌పై ప్ర‌తినెలా15శాతం గ‌రిష్టంగా రూ.500 డిస్కౌంట్ ల‌భిస్తుంది.

  4. ఎస్ఆర్ఎల్ డ‌యాగ్నోస్టిక్స్‌:
    ఐమొబైల్ యాప్ లేదా ఇంట‌ర్‌నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ కామ‌ర్స్ వెబ్‌సైట్‌లో కొనుగోళ్లు చేసిన వారికి, బిల్లు చెల్లించిన వారి కుటుంబ సభ్యుల‌లో ఒక‌రికి ఉచితం ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించుకోవ‌చ్చు.

icici.jpg

ఆర్థిక ప్ర‌యోజ‌నాలు:

  1. ఈక్వీటీ పెట్టుబ‌డులు:
  • రూ.22,500 వ‌ర‌కు ఉచిత బ్రాక‌రేజ్ స‌దుపాయం
  • ట్రేడింగ్ ఖాతాను తెరిచేందుకు 100 శాతం ఫీజు మిన‌హాయింపు
  • జిరో వార్షిక నిర్వ‌హ‌ణ రుస‌ములు(ఏఎమ్‌సీ)తో మొద‌టి సంవ‌త్స‌రం డీమ్యాట్ ఖాతాను నిర్వ‌హించుకోవ‌చ్చు.
  1. :బ్యాంకింగ్ ప్ర‌యోజ‌నాలు
  • బ్యాంకుల ప్ర‌ధాన సేవ‌ల‌కు మొద‌టి ప్రాధాన్య‌త
  • ఏ బ్యాంకు ఏటీఎమ్ వ‌ద్ద‌నైనా అపరిమిత ఉచిత నగదు ఉపసంహరణలు చేసుకోవ‌చ్చు
  • వార్షిక లాక‌ర్ అద్దెపై 40 శాతం రాయితీ ఉంటుంది.

నియ‌మ నిభంధ‌న‌లు:

  1. బిగ్‌బాస్క‌ట్‌లో కొనుగోలు చేసిన వారికి 15 శాతం డిస్కౌంటు ల‌భిస్తుంది. అయితే ఈ డిస్కౌంట్ గ‌రిష్టంగా మాగ్న‌మ్‌ కార్డుల‌కు రూ. 250, టైటానియ‌మ్ కార్డుల‌కు రూ.500 వ‌ర‌కు ల‌భిస్తుంది.
  2. కాంప్లిమెంట‌రీ జొమెటో గోల్డ్ మెంబ‌ర్‌షిప్, పైన తెలిపిన నియ‌మ నిబంధ‌న‌లు పూర్తిచేసిన టైటానియ‌మ్ కార్డుదారుల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని