ఎఫ్‌డీ వ‌డ్డీ రేట్లు స‌వ‌రించిన ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్‌..

సాధార‌ణ ఖాతాదారుల‌తో పోలిస్తే సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 0.50 శాతం అద‌న‌పు వ‌డ్డీని ఆఫ‌ర్ చేస్తుంది. 

Published : 10 May 2021 12:15 IST

ప్రైవేట్ రంగ బ్యాంకు - ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను స‌వ‌రించింది. సవ‌రించిన వ‌డ్డీ రేట్లు మే1 నుంచి వ‌ర్తింప‌జేస్తామ‌ని బ్యాంకు తెలిపింది. 7 రోజుల నుంచి ఏడాది వ‌ర‌కు స్వ‌ల్ప‌కాల డిపాజిట్ల‌తో పాటు ఏడాది నుంచి 10 సంవ‌త్స‌రాల కాలానికి దీర్ఘ‌కాల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌ను అందిస్తుంది. ఈ డిపాజిట్ల‌పై వార్షికంగా 2.75 శాతం నుంచి మొద‌లుకుని గ‌రిష్టంగా ఏడాదికి 6 శాతం వ‌డ్డీని అందిస్తుంది. 

ఎఫ్‌డీల‌పై ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్ తాజా వ‌డ్డీరేట్లు..
7-14 రోజులు 2.75 శాతం 
15 - 29 రోజులు 3 శాతం
30 - 45 రోజులు 3.50 శాతం
46 - 90 రోజులు 4 శాతం
91 - 180 రోజులు 4.50 శాతం
181 రోజుల నుంచి ఏడాది లోపు 5.25 శాతం
ఏడాది నుంచి 2 సంవ‌త్స‌రాల లోపు 5.50 శాతం
2 సంవ‌త్స‌రాల ఒక రోజు నుంచి మూడేళ్ల లోపు 5.75 శాతం
3 సంవ‌త్స‌రాల ఒక రోజు నుంచి ఐదేళ్ల లోపు 6 శాతం
5 సంవ‌త్స‌రాల ఒక రోజు నుంచి ప‌దేళ్ల లోపు 5.75 శాతం
5 సంవ‌త్స‌రాల (ప‌న్ను ఆదా) డిపాజిట్ల‌పై 5.75 శాతం

మే1 నుంచి  పొద‌పు ఖాతా వ‌డ్డీ రేట్ల‌ను కూడా బ్యాంకు త‌గ్గించింది. రూ.1లోపు డిపాజిట్ల‌పై 4 శాతం, రూ.1 ల‌క్ష నుంచి రూ.10 ల‌క్ష‌ల లోపు బ్యాలెన్స్ నిర్వ‌హించే పొదుపు ఖాతాల‌కు 4.5 శాతం, రూ.10 ల‌క్ష‌ల నుంచి రూ.2 కోట్లు బ్యాలెన్స్ నిర్వ‌హించే పొదుపు ఖాతాల‌కు అత్య‌ధికంగా 5 శాతం వ‌డ్డీని బ్యాంకు ఆఫ‌ర్ చేస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని