IMF: భారత్‌ వృద్ధిరేటు అంచనా తగ్గింపు!

భారతదేశ వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తగ్గించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి ......

Published : 27 Jul 2021 22:21 IST

దిల్లీ: భారతదేశ వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) తగ్గించింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి 12.5 శాతం నుంచి 9.5శాతానికి తగ్గించింది. 2022-23 సంవత్సరంలో  వృద్ధిరేటు 8.5శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే,  ప్రపంచ వృద్ధిరేటు 6శాతంగా ఉండొచ్చని ఐఎంఎఫ్‌ పేర్కొంది. మార్చి- మే నెలల్లో  కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్ర ప్రభావం చూపించిన నేపథ్యంలో దేశంలో వృద్ధి అవకాశాలు మందగించాయని, ఆ దెబ్బనుంచి నెమ్మదిగా కోలుకుంటోందని వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌లో తాజాగా ఐఎంఎఫ్‌ విశ్వాసం వ్యక్తంచేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని