Post Office: ఇంటి నుంచే ఆఫ్‌లైన్‌లో నెల‌వారి బిల్లులు 

పున‌రావృత బిల్లుల‌ను ఇంటి వ‌ద్ద నుంచే న‌గ‌దు రూపంలో చెల్లించే స‌దుపాయాన్ని ఇండియా పోస్ట్‌పేమెంట్ బ్యాంక్ అందిస్తుంది. 

Updated : 11 Dec 2021 13:31 IST


వినియోగదారులు ఇంటి వ‌ద్ద నుంచే న‌గ‌దు ఆధారిత బిల్లుల‌ను చెల్లించే సౌక‌ర్యాన్ని అందుస్తున్న‌ట్లు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపిపిబి) ప్ర‌క‌టించింది. ఇందుకు గానూ నేష‌న‌ల్ పేమెంట్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసిఐ).. బిల్ పేమెంట్ సిస్ట‌మ్, భార‌త్ బిల్‌పేతో జ‌త‌క‌ట్టిన‌ట్లు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ శుక్ర‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. 

భారత్ బిల్‌పే ప్లాట్‌ఫారమ్ ద్వారా వివిధ యుటిలిటీ బిల్లుల చెల్లింపులు చేయవచ్చు. ఐపిపిబి క‌స్ట‌మ‌ర్‌ల‌తో పాటు ఇత‌రులకు కూడా ఈ స‌దుపాయం అందుబాటులో ఉండ‌నుంది. ఈ సదుపాయంతో, వినియోగ‌దారులు తమ ఇంటి నుంచే మొబైల్ పోస్ట్‌పెయిడ్, డీ2హెచ్‌ రీఛార్జ్, స్కూల్ ఫీజులు వంటి పున‌రావృత బిల్లుల(ప్ర‌తీ నెల చెల్లించాల్సిన బిల్లులు)ను సౌక‌ర్య‌వంతంగా చెల్లించ‌వ‌చ్చు. అలాగే ఇంటి వ‌ద్ద మాత్ర‌మే కాకుండా స‌మీపంలోని పోస్టాఫీస్ వ‌ద్ద కూడా ఈ సేవ‌లు పొంద‌వ‌చ్చు.  

త‌పాల శాఖ నెట్‌వ‌ర్క్‌, ఐపిపిబి-డిజిట‌ల్ బ్యాంకింగ్ ఫ్లాట్‌ఫామ్ స‌హాయంతో భార‌త్ బిల్‌పే ఒన్‌-స్టాప్ ఎకోసిస్ట‌మ్‌ను అందిస్తుంది. దీని ద్వారా దేశ‌వ్యాప్తంగా ఉన్న వినియోగ‌దారులు ఎప్పుడైనా, ఎక్క‌డైనా విశ్వ‌శ‌నీయ‌త‌తో, నిశ్చింత‌గా, సుర‌క్షితంగా చెల్లింపులు చేయ‌వ‌చ్చ‌ని ఎన్‌పీసిఐ తెలిపింది.

ఫీచ‌ర్లు..
*
న‌గ‌దు రూపంలో రిక‌రింగ్(పున‌రావృత‌) బిల్లుల‌ను చెల్లించ‌వ‌చ్చు. 
* వీలైన‌న్ని ఎక్కువ వివ‌రాల‌తో లావాదేవీల చ‌రిత్ర అప్‌డేట్ చేస్తారు.
* లావాదేవీలు సంబంధిత‌ తేదీల‌ను గుర్తుచేసేందుకు అల‌ర్ట్స్‌, రిమైండ‌ర్ల‌ను సెట్ చేసుకోవ‌చ్చు. 
* ఆన్‌-స్క్రీన్ యూజ‌ర్ అనుభ‌వాన్ని అప్‌డేట్ చేస్తారు. 
* బిల్లు చెల్లింపు లావాదేవీల విష‌యంలో ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు న‌మోదు/ట్రాక్ చేయ‌వ‌చ్చు. 
* బిల్ల‌ర్ల ఎంపిక/మార్పు/అద‌న‌పు జోడింపు చేయ‌వ‌చ్చు.
* నోటిఫికేష‌న్లు, అల‌ర్ట్స్‌, రిమైండ‌ర్ల‌ను ఎనేబుల్ చేసుకోవ‌చ్చు. 

ఎలాంటి బిల్లులు చెల్లించ‌వ‌చ్చు?
మొబైల్ పోస్ట్‌పెయిడ్,  ప్రీపెయిడ్ రీఛార్జ్‌లు, కేబుల్ టీవీ సబ్‌స్క్రిప్షన్ ఫీజులు, డీటీహెచ్ రిఛార్జ్‌, స్కూల్ ఫీజులు, విద్యుత్, గ్యాస్, నీరు, ఎన్ఈటీసి ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్, రుణ చెల్లింపులు, ఆరోగ్యం, జీవిత బీమా,  మున్సిపల్ సేవలు, పన్నులు, అనేక ఇతర పునరావృత బిల్లుల చెల్లింపు సౌకర్యాన్ని భార‌త్ బిల్‌పే అందిస్తుంది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని