ఈ రూపే కార్డుతో తక్కువ ధరకే రైలు టిక్కెట్లు!

దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రయాణ సాధనం రైలు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. రైలు ప్రయాణం చేసే

Published : 26 Dec 2020 17:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉండే ప్రయాణ సాధనం రైలు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేయవచ్చు. రైలు ప్రయాణం చేసే వారందరూ దాదాపు ఐఆర్‌సీటీసీ(ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌) ద్వారా టికెట్లు బుక్‌ చేసుకుంటారు. ఇటీవల ఐఆర్‌సీటీసీతో కలిసి అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ రూపే కార్డును తీసుకొచ్చింది. ‘ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ రూపే కార్డ్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ కార్డును ఉపయోగించి వినియోగదారులు నిబంధనల మేరకు ఉచితంగా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా డిజిటల్‌ ఇండియా, మేకిన్‌ ఇండియా నినాదాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ఎస్‌బీఐ-ఐఆర్‌సీటీసీ, ఎన్‌పీసీఐ(నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేష్న్‌ ఆఫ్ ఇండియా)లు కలిసి సంయుక్తంగా ఈ కార్డును తీసుకొచ్చాయి. దీని ద్వారా చెల్లింపులు మరింత వేగంగా, భద్రంగా చేయవచ్చు. ఇప్పుడిప్పుడే ప్రయాణాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఈ కార్డు ప్రత్యేకతల గురించి ఓసారి చూద్దామా!

* మార్చి 31, 2021 వరకూ ఎలాంటి రుసుములు లేకుండా ఈ కార్డును పొందవచ్చు.

* ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ ద్వారా రైలు టికెట్లు బుక్‌ చేసుకునేవారు 10శాతం రివార్డు పాయింట్లు పొందవచ్చు. (ఒక రివార్డు పాయింట్‌= ఒక రూపాయి)

* అలా వచ్చిన పాయింట్లను ఉపయోగించి వినియోగదారులు ఉచితంగా  టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

* మొదటి 45 రోజుల్లో రూ.500 అంతకన్నా ఎక్కువ లావాదేవీలు జరిపిన వినియోగదారులు 350 బోనస్‌ రివార్డ్‌ పాయింట్లను పొందవచ్చు.

* ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్న వారు చెల్లించాల్సిన లావాదేవీ ఛార్జీల్లో  1శాతం తగ్గుతుంది.

* మూడు నెలలకు ఒకసారి ఉచితంగా ప్రీమియం లాంజ్‌  సదుపాయాన్ని పొందవచ్చు.

* పెట్రోల్‌/డీజిల్‌పై అన్ని పెట్రోల్‌ బంకుల్లో 1శాతం ఛార్జీ మినహాయింపు లభిస్తుంది.

* నేషనల్‌ కామన్‌ మొబిలిటీ కార్డ్‌(ఎన్‌సీఎంసీ) ఫీచర్‌ ద్వారా కాంటాక్ట్‌ లెస్, ఆన్‌లైన్‌ లావాదేవీలు చేయొచ్చు. మెట్రో, టోల్‌, ఫ్లాట్‌ఫాం టికెట్లు మొదలైన వాటి కోసం ఒక ట్యాప్‌తో లావాదేవీలు ముగించవచ్చు. ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇవే కాదు, ఐఆర్‌సీటీసీ ఎస్‌బీఐ రూపే కార్డు సాయంతో మెడ్‌లైఫ్‌, ఫిట్టర్‌నిటీ, మీ ఎన్‌ మామ్స్‌ మొదలైన వాటిలో కొనుగోళ్లు  జరిపినప్పుడు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

(గమనిక: నిబంధనలు, షరతులు ఇతర వివరాల కోసం www.sbicard.com  వీక్షించండి.)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని