IRCTC: నవంబర్‌ 16 నుంచి ‘శ్రీరామాయణ్‌ యాత్ర ఎక్స్‌ప్రెస్‌’ రైలు

ఐఆర్‌సీటీసీ శ్రీరామాయణ్‌ యాత్ర రైలు పర్యటనను ఆదివారం రాత్రి ప్రారంభించింది. దేశంలోని రైల్వే ఆధ్వర్యంలో మతపరమైన క్షేత్రాలకు పర్యటకాన్ని ఇది మొదలుపెట్టింది.

Published : 08 Nov 2021 18:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐఆర్‌సీటీసీ శ్రీరామాయణ్‌ యాత్ర రైలు పర్యటనను ఆదివారం రాత్రి ప్రారంభించింది. దేశంలోని రైల్వే ఆధ్వర్యంలో మతపరమైన క్షేత్రాలకు పర్యటకాన్ని ఇది మొదలుపెట్టింది. ఈ రైలు మొత్తం 17 రోజుల్లో ఏడు క్షేత్రాలకు వెళుతుంది. దీనిలో భాగంగా తొలుత అయోధ్యకు చేరుకొంటుంది. రామేశ్వరానికి చేరడంతో యాత్ర ముగుస్తుంది. ఈ రైలును దిల్లీలోని సఫ్దార్‌ జంగ్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ట్విటర్లో షేర్‌చేశారు. రామాయణ సర్క్యూట్‌కు సంబంధించిన రెండో పర్యటన డిసెంబర్‌ 12వ తేదీన మొదలవుతుందని అశ్వనీ పేర్కొన్నారు. 

ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్ర పర్యాటక ప్యాకేజీల సిరీస్‌లను సిద్ధం చేసేదుకు ప్రణాళిక తయారు చేస్తోంది. భవిష్యత్తులో 14రోజుల యాత్రకు ప్రాణాళిక తయారు చేసింది. ‘రామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్‌-మదురై’ పేరిట దీనిని సిద్ధం చేసింది. నవంబర్‌ 16వ తేదీన ఇది ప్రారంభమై 29వ తేదీన ముగియనుంది. దీనిని స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌లతో సిద్ధం చేసింది. దీనిలో పాల్గొనేవారు కచ్చితంగా కొవిడ్‌ టీకా తీసుకొని ఆ ధ్రువీకరణను లేదా 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్‌ నెగిటీవ్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాలి. 

రామాయణ యాత్ర ఎక్స్‌ప్రెస్‌-మదురైలో భాగంగా హంపీ, నాసిక్‌, చిత్రకూట ధామ్‌, వారణాసి, గయా, సీతామార్హి,జనక్‌పూర్‌(నేపాల్‌), అయోధ్య, నంద్రిగ్రామ్‌,ప్రయాగ్‌రాజ్‌, శ్రీనాగవీర్‌పూర్‌ను సందర్శిస్తారు. ఒక్కో వ్యక్తి రూ.14,490 ఛార్జి చేస్తారు. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌,ఐఆర్‌సీటీసీ ఫెసిలిటేషన్‌ సెంటర్లు, జోనల్‌ ఆఫీసులు, రీజనల్‌ ఆఫీసుల్లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు