భువనేశ్వర్‌లో ‘టెట్రాసాఫ్ట్‌’ ఇన్నోవేషన్‌ కేంద్రం

స్థానిక ఐటీ, కన్సల్టింగ్‌ సేవల కంపెనీ టెట్రాసాఫ్ట్‌ భువనేశ్వర్‌లో టెక్నాలజీ

Published : 03 Sep 2021 09:02 IST

ఈనాడు, హైదరాబాద్‌: స్థానిక ఐటీ, కన్సల్టింగ్‌ సేవల కంపెనీ టెట్రాసాఫ్ట్‌ భువనేశ్వర్‌లో టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ను ప్రారంభించింది. ఆ కేంద్రంలో 100 మంది డిజిటల్‌ టెక్నాలజీ నిపుణులను తీసుకోనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్లాట్‌ఫామ్‌ మోడరనైజేషన్‌, ఇంటెలిజెంట్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌, బిగ్‌ డేటా అనలటిక్స్‌, క్లౌడ్‌ విభాగాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, ఈ కేంద్రాన్ని ప్రారంభించినట్లు టెట్రాసాఫ్ట్‌ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ సూర్య తమ్మిరాజు, వైస్‌ ప్రెసిడెంట్‌ అనిల్‌ వేనుగంటి వెల్లడించారు. డిజిటల్‌ సేవలపై ఈ కేంద్రం దృష్టి సారిస్తుందని వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని