ద్విచ‌క్ర వాహ‌నాల రుణాల వ‌డ్డీ రేట్లు... ఏ బ్యాంక్‌లో ఎంత‌?

ఈ ద్విచ‌క్ర వాహ‌నాల రుణాలు 6.85% వ‌డ్డీ రేటుతో ప్రారంభ‌మ‌వుతున్నాయి.

Updated : 20 Nov 2021 15:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ కారణంగా వ్య‌క్తిగ‌త వాహ‌నాలు వాడేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక‌ప్పుడు ప్రజా రవాణా ఉప‌యోగించే మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు కూడా ద్విచ‌క్ర వాహ‌నాలను విరివిగా వాడుతున్నారు. ప‌బ్లిక్, ప్రైవేట్‌ సెక్టార్ బ్యాంకులు, అనేక రుణ సంస్థ‌లు గ‌త 5 ఏళ్ల నుంచి ద్విచ‌క్ర వాహ‌నాల‌కు రుణాలు స‌ర‌స‌మైన వ‌డ్డీ రేట్ల‌కు అంద‌జేస్తున్నాయి. దీనికి తోడు మోటారు వాహన డీల‌ర్లు కూడా అనేక రుణ సంస్థ‌ల‌తో ఒప్పందాలు చేసుకుని వినియోగ‌దారుల‌కు రుణాల‌పై ద్విచ‌క్ర వాహ‌నాల‌ను అందజేస్తున్నాయి. 

ఒకవేళ మీరూ ద్విచ‌క్ర వాహ‌న రుణాన్ని పొందేందుకు ప్ర‌య‌త్నిస్తుంటే వివిధ రుణ సంస్థ‌లు అందించే రుణాల వ‌డ్డీల‌ను స‌రిపోల్చుకోవాలి. అర్హ‌త ప్ర‌మాణాలు, వ‌డ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, రుణాన్ని తీర్చే కాల‌వ్య‌వ‌ధి, లోన్ టు వాల్యూ (ఎల్‌టీవీ) నిష్ప‌త్తి, ఇత‌ర ఛార్జీలు మొద‌లైన వివిధ అంశాల‌ను ప‌రిశీలించాలి. మీరు చెల్లించే డౌన్ పేమెంట్ ఎంతో కూడా చూసుకోవాలి. రుణం ద‌ర‌ఖాస్తు చేసే ముందు మీ క్రెడిట్ స్కోర్ 750 లేదా అంత‌కంటే ఎక్కువ ఉంటే తక్కువ వ‌డ్డీ రేటుతో రుణం పొంద‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.  రుణం కోసం ద‌ర‌ఖాస్తు చేస్తున్న‌పుడు మీ వ‌య‌స్సు, ఆదాయం, గుర్తింపు వివ‌రాల‌ను  ఇవ్వాలి. ఆదాయ‌న్ని నిర్ధారించడానికి నిర్దిష్ట ప‌త్రాల‌ను స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అతి త‌క్కువ వ‌డ్డీ రేట్ల‌కు అందిస్తున్న 20కి పైగా ప్ర‌ముఖ బ్యాంకుల జాబితా ఈ దిగువన ఇస్తున్నాం. రూ.75 వేల‌ రుణానికి 3 ఏళ్ల ఈఎంఐ వివరాలు అందిస్తున్నాం.

గ‌మ‌నిక: ఈ ప‌ట్టిక‌లో ప్ర‌తి బ్యాంక్‌కి సంబంధించిన అత్య‌ల్ప వ‌డ్డీ రేట్లు మాత్ర‌మే ఉన్నాయి. వ‌ర్తించే వ‌డ్డీ రేటు భిన్నంగా ఉండొచ్చు. మీ వ‌య‌స్సు, ఆదాయం, క్రెడిట్ స్కోర్ వంటి అంశాల ఆధారంగా వ‌డ్డీ రేట్లు మార‌వ‌చ్చు. ఈఎంఐలో ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర ఛార్జీలు కలపలేదు. బ్యాంక్ నిబంధ‌న‌లు, ష‌ర‌తులు వర్తిస్తాయి.

Read latest Business News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని