2021 లో ఆదాయపు పన్ను  ముఖ్యమైన తేదీలు

 ఆదాయపు పన్ను శాఖ మూడోసారి  పన్ను దాఖలు తేదీలను పొడిగించింది

Updated : 04 Jan 2021 15:22 IST

                                                                                                                                           

ఆదాయపు పన్ను శాఖ 2021 సంవత్సరానికి కొత్త ఇ-క్యాలెండర్‌ను విడుద‌ల‌ చేసింది. ఇది పన్నుకు సంబంధించిన అన్ని ముఖ్యమైన గడువుల జాబితాను కలిగి ఉంది. 'నిజాయితీపరులను గౌరవించేవిధంగా ఈ క్యాలెండర్‌గా రూపకల్పన చేశారు. పన్ను వ్యవస్థ ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేని, ఫేస్‌లెస్, కాగిత రహితంగా మారింద‌ని ప‌న్ను చెల్లింపుదారుల‌కు ఆదాయ‌ప‌న్ను విభాగం తెలిపింది.

2021 లో ఆదాయపు పన్ను  ముఖ్యమైన తేదీలు:

జనవరి 10: ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులకు మ‌దింపు సంవ‌త్స‌రం (ఏవై) 2020-21 కోసం ఐటీఆర్‌  దాఖలు చేయడానికి పొడిగించిన‌ గడువు తేదీ

జనవరి 15: ఆదాయపు పన్ను చట్టం క్రింద వివిధ ఆడిట్ నివేదికలను సమర్పించే తేదీ

జనవరి 15: 2020 డిసెంబర్ 31 తో ముగిసిన త్రైమాసికానికి జ‌మ‌చేసిన‌ టిసీఎస్ (మూలం వ‌ద్ద వ‌సూలు చేసే ప‌న్ను) త్రైమాసిక స్టేట్‌మెంట్

జనవరి 30: 2020 డిసెంబర్ 31 తో ముగిసిన త్రైమాసికంలో వసూలు చేసిన పన్నుకు సంబంధించి త్రైమాసిక టిసీఎస్ సర్టిఫికేట్

జనవరి 31: వివాద్‌- సే విశ్వస్ పథకం కింద డిక్లరేషన్ చేయడానికి చివరి తేదీ

జనవరి 31: 2020 డిసెంబర్ 31 తో ముగిసిన త్రైమాసికంలో టిడిఎస్ (మూలం వ‌ద్ద ప‌న్ను) త్రైమాసిక ప్రకటన

ఫిబ్రవరి 15: ఆడిట్ అవసరమయ్యే పన్ను చెల్లింపుదారులకు మ‌దింపు సంవ‌త్స‌రం 2020-21 కొరకు ఐటీఆర్‌ని దాఖలు చేయడానికి పొడిగించిన గడువు తేదీ

ఫిబ్రవరి 15: 2020 డిసెంబర్ 31 తో ముగిసిన త్రైమాసికంలో త్రైమాసిక టిడిఎస్ సర్టిఫికేట్ (జీతం కాకుండా)

మార్చి 15: 2021-22 కోసం నాలుగో విడత ముందస్తు పన్ను

మార్చి 31:  2020-21 కోసం ఆలస్యమైన లేదా సవరించిన ఆదాయ ప‌న్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ

మార్చి 31: 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొద‌టి, రెండో త్రైమాసికం డిపాజిట్ చేసిన టిడిఎస్ / టిసిఎస్ త్రైమాసిక స్టేట్‌మెంట్

మార్చి 31: అదనపు ఛార్జీలు లేకుండా వివాద్- సే విశ్వాస్‌ పథకం కింద చెల్లింపు చేసేందుకు చివరి తేదీ

మార్చి 31: పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ

మే 15: మార్చి 31, 2021 తో ముగిసిన త్రైమాసికంలో టిసిఎస్  త్రైమాసిక స్టేట్‌మెంట్

మే 31: మార్చి 31, 2021 తో ముగిసిన త్రైమాసికంలో టిడిఎస్  త్రైమాసిక స్టేట్‌మెంట్

మే 31: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి   285BA సెక్ష‌న్ కింద ఆర్థిక లావాదేవీల ప్రకటన
జూన్ 15: మ‌దింపు సంవ‌త్స‌రం 2022-23 కోసం మొదటి విడత ముందస్తు పన్ను

జూన్ 15: మ‌దింపు సంవ‌త్స‌రం 2021-22 కొరకు ఉద్యోగులకు టిడిఎస్ సర్టిఫికేట్-ఫారం 16 (చెల్లించిన జీతానికి సంబంధించి)

జూన్ 15: మార్చి 31, 2021 తో ముగిసిన త్రైమాసికంలో త్రైమాసిక టిడిఎస్ సర్టిఫికేట్ (జీతం కాకుండా)

జూలై 15: జూన్ 30, 2021 తో ముగిసిన త్రైమాసికంలో టిసిఎస్  త్రైమాసిక ప్రకటన 

జూలై 30: జూన్ 30, 2021 తో ముగిసిన త్రైమాసికంలో త్రైమాసిక టిసిఎస్ సర్టిఫికేట్

జూలై 31: జూన్ 30, 2021 తో ముగిసిన త్రైమాసికంలో టిడిఎస్  త్రైమాసిక ప్రకటన

జూలై 31: (ఎ) కార్పొరేట్ మదింపుదారుడు లేదా (బి) తన ఖాతాలను ఆడిట్ చేయటానికి బాధ్యత వహించే కార్పొరేట్ కాని అసెస్సీ లేదా (సి) అంతర్జాతీయ లేదా పేర్కొన్న దేశీయ లావాదేవీల్లోకి ప్రవేశించిన మదింపుదారుడు మినహా మిగతా వారందరికీ ఏవై 2021-22 కొరకు ఐటీఆర్

ఆగస్టు 15: జూన్ 30, 2021 తో ముగిసిన త్రైమాసికంలో త్రైమాసిక టీడీఎస్‌ సర్టిఫికేట్ (జీతం కాకుండా)

సెప్టెంబర్ 15:  2022-23ఏవై కోసం  రెండవ విడత  ముందస్తు తేదీ

సెప్టెంబర్ 30: అంతర్జాతీయ లేదా పేర్కొన్న దేశీయ లావాదేవీల్లోకి ప్రవేశించని మదింపుదారుడి విషయంలో ఏవై 2021-22 కొరకు ఆడిట్ నివేదిక

అక్టోబర్ 15: 2021 సెప్టెంబర్ 30 తో ముగిసిన త్రైమాసికంలో టిసిఎస్  త్రైమాసిక ప్రకటన

అక్టోబర్ 30: సెప్టెంబర్ 30, 2021 తో ముగిసిన త్రైమాసికంలో త్రైమాసిక టిసిఎస్ సర్టిఫికేట్

అక్టోబర్ 31: 2021 సెప్టెంబర్ 30 తో ముగిసిన త్రైమాసికంలో టిడిఎస్  త్రైమాసిక ప్రకటన

అక్టోబర్ 31: ఏవై 2021-22 కొరకు ఐటీఆర్ (అంతర్జాతీయ లేదా పేర్కొన్న దేశీయ లావాదేవీలు లేనివి) (ఎ) కార్పొరేట్ మదింపుదారుడు లేదా (బి) కార్పొరేట్-కాని మదింపుదారుడు, దీని పుస్తకాలను ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది.

అక్టోబర్ 31: అంతర్జాతీయ లేదా పేర్కొన్న దేశీయ లావాదేవీని కలిగి ఉన్న మదింపుదారునికి సంబంధించి ఏవై 2021-22 కొరకు ఆడిట్ నివేదిక

నవంబర్ 15: 2021 సెప్టెంబర్ 30 తో ముగిసిన త్రైమాసికంలో త్రైమాసిక టిడిఎస్ సర్టిఫికేట్ (జీతం కాకుండా)

నవంబర్ 30: అంతర్జాతీయ లేదా పేర్కొన్న దేశీయ లావాదేవీని కలిగి ఉన్న మదింపుదారునికి సంబంధించి ఏవై 2021-22 కొరకు ఐటీఆర్‌

డిసెంబర్ 15: ఏవై 2022-23 కోసం   మూడవ విడత ముందస్తు తేదీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని