స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో పొదుపు చేస్తున్నారా?

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను సాధార‌ణంగా అంద‌రూ ఎంచుకుంటారు. ముఖ్యంగా స్థిర‌మైన రాబ‌డి, భ‌ద్ర‌త ఉంటుంద‌ని ఈ పెట్టుబ‌డుల‌కు ప్రాధాన్య‌త‌నిస్తారు. అయితే ఎఫ్‌డీ చేసేట‌ప్పుడు పెట్టుబ‌డుదారుడు మొద‌ట చూసేది వ‌డ్డీ రేట్లు. గ‌త కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సంస్థ‌లు దేశంలో మ‌రింత విస్త‌రించి కార్య‌క‌లాపాల‌ను వేగ‌వంతం చేస్తున్నాయి. దీంతో పాటు..

Published : 18 Dec 2020 15:41 IST

బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లను సాధార‌ణంగా అంద‌రూ ఎంచుకుంటారు. ముఖ్యంగా స్థిర‌మైన రాబ‌డి, భ‌ద్ర‌త ఉంటుంద‌ని ఈ పెట్టుబ‌డుల‌కు ప్రాధాన్య‌త‌నిస్తారు. అయితే ఎఫ్‌డీ చేసేట‌ప్పుడు పెట్టుబ‌డుదారుడు మొద‌ట చూసేది వ‌డ్డీ రేట్లు. గ‌త కొన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు సంస్థ‌లు దేశంలో మ‌రింత విస్త‌రించి కార్య‌క‌లాపాల‌ను వేగ‌వంతం చేస్తున్నాయి. దీంతో పాటు వినియోగ‌దారుల‌ను మ‌రింత ఆక‌ర్షించేందుకు ఎక్కువ వ‌డ్డీ రేట్ల‌ను ఇస్తూ ప్ర‌చారం జోరు పెంచాయి. ఉదాహ‌ర‌ణ‌కు, జ‌న స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై 9 శాతం వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తోంది. 3-5 ఏళ్ల డిపాజిట్ల‌కు 8.50 శాతంగా ఉన్నాయి. దీంతో పాటు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 60 బేసిస్ పాయింట్లు అధికంగా వ‌డ్డీని ఇస్తుంది. ఎస్‌బీఐ 3-5 ఏళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 6.8 శాతం, ఐదేళ్ల డిపాజిట్‌పై 6.85 శాతం వ‌డ్డీని ఇస్తోంది. సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు మ‌రో 50 బేసిస్ పాయింట్ల అధిక వ‌డ్డీ ల‌భిస్తోంది. కొత్త‌గా వ్యాపారం ప్రారంభించిన ఫైనాన్స్ సంస్ధ‌లు ఎక్కువ వ‌డ్డీ రేట్ల‌తో వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించ‌డం సాధార‌ణం. అయితే మీరు ఎందులో పెట్టుబ‌డులు పెట్టాల‌నుకుంటాఉన్నారో మీ నిర్ణ‌యంపై ఆధార‌ప‌డి ఉంటుంది. దీనికి ప‌రిశీలించాల్సిన కొన్ని ప‌రామితులు ఎంటో తెలుసుకోండి

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు:

ఇత‌ర వాణిజ్య బ్యాంకుల మాదిరిగానే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు కూడా ఆర్‌బీఐ ఆమోదం ఉంటుంది. చిన్న సూక్ష్మ రుణ సంస్థ‌ల ముఖ్య ఉద్దేశం బ్యాంకింగ్ స‌దుపాయాలు అందుబాటులో లేనివారికి ఆర్థిక సేవ‌లు అందించ‌డం. త‌క్కువ ఆదాయ వ‌ర్గాల‌కు, గ్రామీణ ప్రాంతాల వారికి, చిన్న వ్యాపార‌స్తుల‌కు ఇవి ఉప‌యోగ‌క‌రంగా ఉంటాయి. ప్ర‌ధాన రంగాల‌కే ఎక్కువ రుణాల‌ను అందించాల‌నే నిబంధ‌న ఈ సంస్థ‌ల‌కు ఉంటుంది.

రిటైల్ వినియోగ‌దారుల‌కు సాధార‌ణంగా బ్యాంకులు అందించే ప్రాథ‌మిక బ్యాంకింగ్ సేవ‌లు, డిపాజిట్లు, రుణాలు వంటి అన్ని సేవ‌ల‌ను అందిస్తాయి. కొన్ని సంస్థ‌లు వినియోగ‌దారుల‌ను ఆక‌ర్షించేందుకు డిపాజిట్ల‌ను రాబ‌ట్టుకునేందుకు ఎక్కువ వ‌డ్డీ రేట్ల‌ను ప్ర‌క‌టిస్తాయి. ఇత‌ర బ్యాంకుల మాదిరిగానే వ‌చ్చిన డిపాజిట్ల డ‌బ్బును రుణాల రూపంలో జారీ చేస్తాయి.

మ‌రి పెట్టుబ‌డుదారులు ఏం చేయాలి?

పెట్టుబ‌డుల కోసం ఒక ప‌థ‌కాన్ని ఎంచుకున్న‌ప్పుడు కేవ‌లం రాబ‌డి కోస‌మే కాకుండా సంస్థ అందించే సౌక‌ర్యం కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఖాతా ప్రారంభించేందుకు అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ మీకు ద‌గ్గ‌ర‌లో సంస్థ లేదా బ్యాంకు శాఖ ఉండేలా చూసుకోవాలి. ఆర్‌బీఐ స‌బ్సిడ‌రీ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేష‌న్ ( డీఐజీసీ ) బ్యాంకు డిపాజిట్ల‌పై ల‌క్ష రూపాయ‌ల బీమా అందిస్తుంద‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే పెట్టుబ‌డుదారులు ఈ విష‌యాన్ని దృష్టిలోపెట్టుకోవాలి. డీఐజీసీ వెబ్‌సైట్‌లో బీమా అందించే బ్యాంకుల జాబితా ఉంటుంది. జ‌న‌వ‌రి 7 న ప‌ది ఫైనాన్స్‌సంస్థ‌లు ఇందులో న‌మోద‌య్యాయి.

అయితే, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ప‌రిమితంగా డిపాజిట్ చేయాల‌ని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే కొన్ని ఇవి కొంత‌కాలం మాత్ర‌మే కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగించ‌వ‌చ్చు. కొన్ని సంస్థ‌ల్లో ఇటీవ‌ల జ‌రుగుతున్న మోసాల‌ను గుర్తుపెట్టుకొని ఎక్కువ మొత్తంలో డ‌బ్బును డిపాజిట్ చేయ‌క‌పోవ‌డం మంచిది. పెట్టుబ‌డుల‌ను ఒకే దాంట్లో కాకుండా వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలి.

ఇప్పుడు ఫైనాన్స్‌సంస్థ‌ల్లో కొన్ని గ‌తంలో సూక్ష్మ రుణ సంస్థలు అన్న విష‌యం గుర్తుంచుకోవాలి. అయితే అప్పుడు రుణాలు మాత్ర‌మే అందించే సంస్థ‌లు ఇప్పుడు బ్యాంకుల మాదిరిగి డిపాజిట్ల‌కు కూడా స‌దుపాయం క‌ల్పిస్తున్నాయి. అయితే ఎంతైనా ఎప్ప‌టినుంచో ఉన్న ప్ర‌భుత్వ రంగ బ్యాంకుల‌తో పోలిస్తే ఇప్పుడు వ‌స్తున్న ఫైనాన్స్ సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు రిస్క్‌తో కూడుకున్న‌వ‌నే చెప్పాలి. రిస్క్ త‌గ్గించుకోవాల‌నుకుంటే మీ పెట్టుబ‌డుల్లో కొంత భాగం మాత్ర‌మే స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల‌కు కేటాయించండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని