PMJJBY.. కోవిడ్‌19 కార‌ణంగా మ‌ర‌ణించినా.. నామినీకి హామీ మొత్తం ల‌భిస్తుంది.

పీఎమ్‌జేజేవై.. పూర్తిగా ట‌ర్మ్ ఇన్సురెన్స్‌ పాల‌సీ. ఏడాదికి రూ.330 ప్రీమియంతో రూ.2 ల‌క్ష‌ల క‌వ‌రేజ్‌ని అందిస్తుంది.

Published : 27 May 2021 12:32 IST

ప్ర‌ధాన మంత్రి జీవ‌న్ జ్యోతి బీమా యోజ‌న‌(పీఎమ్‌జేజేబీవై) ప్ర‌భుత్వ మ‌ద్ద‌తు గ‌ల బీమా ప‌థ‌కం. ఈ ప‌థ‌కాన్ని ఆరు సంవ‌త్స‌రాల క్రితం ప్ర‌భుత్వం ప్రారంభించింది.  ఏదైనా కారణం చేత బీమా చేసిన వ్య‌క్తి మ‌ర‌ణిస్తే, రూ. 2ల‌క్ష‌ల హామీ మొత్తాన్ని నామినీకి చెల్లిస్తారు.

కోవిడ్ -19 కారణంగా ఎవ‌రైనా వారి కుటుంబ సభ్యుడిని కోల్పోతే, ముఖ్యంగా కుంటుంబానికి మూలాధార‌మైన స‌భ్యుని కోల్పోతే, అత‌ను/  ఆమె ఈ ప‌థ‌కంలో జాయినయ్యారా.. అని తెలుసుకోమ‌ని కుటుంబ స‌భ్యుల‌ను అడ‌గండి. పోషించే వ్య‌క్తిని కోల్పోయిన వారికి ఇటువంటి ప‌థ‌కాలు,  కొంత వ‌ర‌కు ఆర్థికంగా స‌హాయ‌ప‌డ‌తాయి. 

అర్హ‌త‌..
18 నుంచి 50 సంవ‌త్స‌రాల వ‌య‌సు వారికి పాల‌సీ అందుబాటులో ఉంటుంది. బ్యాంకులో పొదుపు ఖాతా ఉన్న‌ వారెవ‌రైనా ఈ ప‌థ‌కంలో చేర‌వ‌చ్చు. అయితే బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానించాల్సి ఉంటుది. కేవైసీ చేయంచ‌డం త‌ప్ప‌నిస‌రి. 55 సంవ‌త్స‌రాల వ‌ర‌కు జీవిత బీమా పొందేందుకు వీలుంటుంది. ఒక వ్య‌క్తి 50 సంవ‌త్స‌రాల వ‌య‌సులో పాల‌సీ తీసుకుంటే, 55 సంవ‌త్స‌రాల వ‌ర‌కు మాత్ర‌మే రిస్క్ క‌వ‌రేజ్ పొందేందుకు వీలుంటుంది. ఈ ప‌థ‌కంలో జాయిన్ అయిన వారు ప్రీమియం మొత్తాన్ని ప్ర‌తీ ఏడాది ఖాతా నుంచి స్వ‌యం చాల‌కంగా(ఆటో-డెబిట్‌) తీసుకునేందుకు బ్యాంకుల‌ను అనుమ‌తించాలి. 

ఎలా ప‌నిచేస్తుంది..
ప్ర‌ధాన‌మంత్రి జీవ‌న‌జ్యోతి బీమా యోజ‌న ప‌థ‌కంలో ఏడాదికి రూ.330 ప్రీమియం చెల్లించి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు హామీ పొంద‌వ‌చ్చు. ఒకే వాయిదాలో ప్రీమియం మొత్తం చెల్లించాలి. పాల‌సీ ఒక సంవ‌త్స‌రం కాల‌ప‌రిమితితో వ‌స్తుంది. అందువ‌ల్ల ప్ర‌తీ సంవ‌త్స‌రం రెన్యూవ‌ల్ చేసుకోవల్సి ఉంటుంది. జూన్ నుంచి మే వ‌ర‌కు క‌వ‌రేజ్ ఉంటుంది. ఖాతాదారుడు అభ్య‌ర్ధించిన తేది నుంచి ప్రారంభ‌మై మ‌రుస‌టి సంవ‌త్స‌రం మే31తో క‌వ‌రేజ్ ముగుస్తుంది. జూన్ నుంచి ఆగ‌ష్టు మ‌ధ్య కాలంలో ఈ ప‌థ‌కంలో జాయిన్ అయితే వ‌ర్తించే  వార్షిక ప్రీమియం రూ. 330

ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం, ఒక‌వేళ సెప్టెంబ‌రు-నవంబ‌రు మ‌ధ్య కాలంలో ఈ ప‌థ‌కంలో చేరితే ఆ ఏడాదికి చెల్లించాల్సిన ప్రీమియం రూ.258, డిసెంబ‌రు-ఫిబ్ర‌వ‌రి నెల‌ల మ‌ధ్య చేరితే చెల్లించాల్సిన ప్రీమియం రూ.172, మార్చి-మే నెల‌ల మ‌ధ్య కాలంలో చేరితే రూ.86 ప్రీమియం చెల్లించాలి. ప‌థ‌కంలో కొత్త‌గా జాయిన్ అవుతున్న‌ప్పుడు.. మీరు జాయిన్ అయ్యే నెల‌ల‌ను అనుస‌రించి ప్రీమియం ఉంటుంది. ఆ త‌రువాత నుంచి సంవ‌త్స‌రానికి రూ.330 ప్రీమియం చెల్లించాలి. ఈ మొత్తాన్ని మే25 నుంచి మే31 మ‌ధ్య కాలంలో బ్యాంకులు పాల‌సీదారుని ఖాతా నుంచి స్వ‌యం చాలాకంగా డెబిట్ చేస్తాయి. అందువ‌ల్ల ఆయా.. తేదిల్లో ప్రీమియం చెల్లింపుల‌కు స‌రిప‌డా మొత్తాన్ని ఖాతాలో ఉండేలా చూసుకోవాలి. 

ఎప్పుడు ర‌ద్ద‌వుతుంది..
1. ఈ ప‌థ‌కంలో చేరిన స‌భ్యుడు 55 సంత్స‌రాల వ‌య‌సుకు చేరిన‌ప్పుడు
2. ప్రీమియం చెల్లింపులకు.. త‌గినంత బ్యాలెన్స్ ఖాతాలో నిర్వ‌హించ‌న‌ప్పుడు
3. వివిధ బ్యాంకుల‌లో నుంచి బీమా తీసుకున్న‌ప్ప‌డు, వివిధ బ్యాంకుల ద్వారా ఒక‌టి మించి పాల‌సీలు తీసుకున్ని క‌వ‌రేజ్ మాత్రం రూ.2 ల‌క్ష‌ల‌కే ప‌రిమితం అవుతుంది.  ఇత‌ర బ్యాంకుల క‌వ‌రేజ్‌ను ర‌ద్దు చేస్తారు. ప్రీమియం మొత్తాన్ని జ‌ప్తు చేస్తారు. 

వ్య‌క్తి ఏదైనా కార‌ణంగా ఈ ప‌థ‌కం నుంచి మ‌ధ్య‌లోనే నిష్క్ర‌మిస్తే, వార్షిక ప్రీమియం చెల్లించ‌డం ద్వారా తిరిగి చేర‌వ‌చ్చు. జాయింట్ ఖాతా ఉంటే.. ఖాతాదారులు ఇరువురు ఈ ప‌థ‌కంలో చేర‌వ‌చ్చు. అయితే ఇద్ద‌రు విడివిడిగా ప‌థ‌కంలో చేరాల్సి ఉంటుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు