జీ గ్రూపు కార్యాలయాల్లో ఐటీ సోదాలు

ప్రముఖ మీడియా సంస్థ జీ గ్రూప్‌ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ దాడులు జరిపినట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. జీ గ్రూప్‌.

Updated : 22 Aug 2022 16:12 IST

ముంబయి: ప్రముఖ మీడియా సంస్థ జీ గ్రూప్‌ కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ దాడులు జరిపినట్లు ఆ శాఖ అధికారి ఒకరు తెలిపారు. జీ గ్రూప్‌ సైతం సోదాలను ధ్రువీకరించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఐటీ శాఖ అధికారులు తమ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారని జీ గ్రూప్‌ అధికార ప్రతినిధి తెలిపారు. ఐటీ అధికారులకు పూర్తి సహకారం అందిస్తూ వారు కోరిన వివరాలను అందజేసినట్లు తెలిపారు.

అయితే, కేవలం ముంబయిలోని జీ గ్రూప్‌ కార్యాలయాల్లోనే సోదాలు జరిగాయా? దిల్లీలో కూడా జరిగాయా అనే వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. అలాగే ముంబయిలోని లార్సెన్‌ అండ్‌ టర్బో (ఎల్‌అండ్‌టీ) గ్రూప్‌ ప్రధాన కార్యాలయంలోనూ ఐటీ శాఖ అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌కు సంబంధించి జీఎస్టీ అధికారుల నుంచి వచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు జరిగినట్లు తెలిసింది.

ఇవీ చదవండి..
కొవిషీల్డ్: కేంద్రానికి రూ.200..ప్రైవేటులో..?
2021 లో ఆదాయపు పన్ను  ముఖ్యమైన తేదీలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని